newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వరవరరావు బెయిల్ తిరస్కరణ.. వీడియో కాన్ఫరెన్స్‌లో బంధువులతో భేటీ

19-08-202019-08-2020 10:26:20 IST
Updated On 19-08-2020 11:04:13 ISTUpdated On 19-08-20202020-08-19T04:56:20.330Z19-08-2020 2020-08-19T04:54:35.108Z - 2020-08-19T05:34:13.087Z - 19-08-2020

వరవరరావు బెయిల్ తిరస్కరణ.. వీడియో కాన్ఫరెన్స్‌లో బంధువులతో భేటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వ్యాప్తి విపరీతంగా వున్న వేళ ముంబైలో జైలులో వున్న విరసం కవి, ఉద్యమకారుడు వరవరరావు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించాలని బాంబే హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వాదించింది. ప్రస్తుతం ఆయనకు మంచి వైద్య సహాయం అందుతోందని, జైలు అధికారులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయనకు సరైన వైద్యసేవలు అందిస్తారని, అందువల్ల ఆయన బెయిల్‌ పిటిషన్‌ను ఆమోదించవద్దని కోరింది. 

ఎల్గార్‌ పరిషద్‌– కోరేగావ్‌ భీమా కుట్ర కేసులో వరవరరావును అరెస్టు చేశారు. మోడీ హత్యకు కుట్ర జరిగిందని, అందులో వరవరరావు ప్రస్తావన వుందని ఆయన్ని అరెస్టు చేసి  జైల్లో పెట్టారు. కరోనా వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతినడం, కరోనా సోకడంతో  ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అంతేకాదు దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి వల్ల జైలులో ఖైదీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎంపీలు, వందలాదిమంది జర్నలిస్టులు వివిని బెయిలుపై విడుదలచేయాలని, ఆయనకు మంచి వైద్యం కావాలని మహారాష్ట్ర సీఎంని కోరారు. 

ఈనేపథ్యంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయాలని వరవరరావు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. జస్టిస్‌ అమ్జాద్‌ సయిద్‌ బెంచ్‌ ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వరవరరావుకు బెయిల్‌ ఇవ్వవద్దని ఎన్‌ఐఏ న్యాయవాది అనిల్‌సింగ్‌ వాదించారు. ఈ సందర్భంగా  వరవరరావు తరఫు న్యాయవాది సత్యనారాయణ..గతనెల 31న చివరిసారిగా ఆయన కుటుంబసభ్యులతో వీడియోకాల్‌లో మాట్లాడించారని తెలిపారు. దీంతో ఆయనతో కుటుంబసభ్యులను వీడియోకాల్‌లో మాట్లాడించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను 2వారాలు వాయిదా వేసింది కోర్టు. 

ఇదిలా వుంటే న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆస్పత్రి నుండి వరవరరావుతో కుటుంబ సభ్యులకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఆయనతో కుటుంబసభ్యులు మాట్లాడిన అనంతరం వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ తన ఫేస్ బుక్ వాల్ పై ఓ పోస్టు పెట్టారు. 

వివి కాస్త తేరుకున్నారు, కాని కావలసింది తక్షణ విడుదల

బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు నానావతి హాస్పిటల్ ఇవాళ వరవరరావుతో కుటుంబ సభ్యులకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. గత నెల రోజులలో వివితో జరిగిన రెండు కలయికలతో (జూలై 15న జెజె ఆస్పత్రిలో, జూలై 31న నానావతి ఆస్పత్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో) పోలిస్తే, ఇవాళ ఆయన కాస్త మెరుగ్గా కనిపించారు.

మానసికంగా చురుకుగా, సంబద్ధంగా ఉన్నారు గాని, శారీరకంగా మాత్రం చాల బలహీనంగా, చేతకానట్టుగా కనిపించారు. సంభాషణ జరిగినంతసేపూ పడుకునే ఉన్నారు, మధ్యలో కొన్ని నిమిషాలు వీపులోనో, కడుపులోనో నొప్పితో విలవిలలాడారు. ఇవాళ్టి సంభాషణతో మరొకసారి రుజువైనదేమంటే ఆయనకు తక్షణమే కావలసింది వైద్య సదుపాయంతో పాటు, కుటుంబ రక్షణ, చుట్టూ మనుషులతో సంబంధం, చదువుకునే రాసుకునే సౌకర్యాలు. నిన్న కోర్టులో కూడ ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని ఎన్ ఐ ఎ వాదించిన నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం, విడుదల కోసం ఆందోళన పెంచవలసి ఉందన్నారు. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle