వరవరరావుని వెంటనే విడుదల చేయాలి.. భార్య హేమలత డిమాండ్
30-05-202030-05-2020 10:11:11 IST
Updated On 30-05-2020 11:20:40 ISTUpdated On 30-05-20202020-05-30T04:41:11.409Z30-05-2020 2020-05-30T04:39:38.851Z - 2020-05-30T05:50:40.378Z - 30-05-2020

ముంబై జెజె ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విరసం నేత వరవరరావు ఆరోగ్యం విషమించింది. మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్నవరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్లో అరెస్టయిన ఆయన వివిధ అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వెంటనే విడుదల చేయాలని భార్య హేమలత డిమాండ్ చేశారు.

వరవరరావుగారి ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, అందువల్ల ఆయనను తలోజా జైలు నుంచి ముంబయిలోని జెజె ఆస్పత్రికి తరలించారని శుక్రవారం రాత్రి ఎనిమిదన్నరకు చిక్కడపల్లి పోలీసుల ద్వారా తెలిసింది. పుణె పోలీసులు తమకు ఆ ఒక్క వాక్యమే చెప్పారని అంతకుమించి వివరాలేవీ తమకు తెలియవని చిక్కడపల్లి పోలీసులు చెప్పారు.
ఆ తర్వాత మూడు నాలుగు గంటల దుర్భర ఆందోళణ తర్వాత తెలిసిన సమాచారం వరవరరావు గారు గురువారం సాయంత్రం తలోజా జైలులో కళ్ళు తిరిగి పడిపోయారని, వెంటనే జెజె ఆస్పత్రికి తరలించారని శుక్రవారం సాయంత్రానికి ఆరోగ్య స్థితి కుదుటపడిందని తెలిసింది. జెజె ఆస్పత్రి విడుదల చేసిన ఒక ఆరోగ్య బులిటిన్, ముంబయిలో విలేఖరులతో అధికారులు చెప్పిన విషయాలు బయటకు వచ్చాయి. ఆయన మూడురోజులుగా జైలు ఆస్పత్రిలోనే వున్నాకని, ఆ తర్వాతనే జెజె ఆస్పత్రికి తరలించవలసి వచ్చిందని జైలు అధికారులు చెప్పారని ఇంకొక వార్త వచ్చింది. ఇలా వెలువడుతున్న సమాచారంలో ఏది ఎంత వాస్తవమో, ఆయన ఆరోగ్య స్థితి కచ్చితంగా ఎలా వుందో తెలియదు. ఈలోగా కుటుంబ సభ్యులు ముంబయి వెళ్ళడానికి తగిన ఏర్పాటుచేస్తామని తెలంగాణ పోలీసులు చేసిన ప్రకటన మరింతగా ఆందోళన కలిగిస్తోంది.
72 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో, ప్రస్తుతం తీవ్రమయిన ఆందోళనలో వున్న నేను కూడా ముంబయి ప్రయాణం చేసే స్థితిలో లేను. పైగా ఆయనను కలవడానికి న్యాయస్థానం అనుమతి సంపాదించే ప్రయత్నం జరుగుతోంది. ఆ అనుమతి దొరికితే కుటుంబ సభ్యులం ముంబయి వెళతాం. కోవిడ్ 19 వల్ల అవసరమయిన అనుమతులు ప్రభుత్వం ఇస్తే చాలు, మా ప్రయాణ ఏర్పాట్లు మేం చేసుకుంటాం.
ఆయన ఆరోగ్యం గురించి, భద్రత గురించి తీవ్రమయిన ఆందోళనతో కేంద్ర ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి , తెలంగాణ ప్రభుత్వానికి ఈ వినతి చేస్తున్నాను.
1. వరవరరావు గారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా వుందో కుటుంబసభ్యులకు తెలియడానికి తక్షణమే ఆయనతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేయాలి.
2. అబద్ధపు ఆరోపణలపై, విచారణ కూడా లేకుండా 18 నెలలుగా నిర్బంధంలో ఉంచిన వరరవరావగారిని తక్షణమే బెయిలుపై విడుదల చేయాలి.
3. కళ్ళు తిరిగి పడిపోవడం అనేదే నిజమే అయితే అందుకు కారణాలేంటో సమగ్ర వైద్య పరీక్షలు జరపాలి.
4. ఆయనకు అంతకుముందే ఫైల్స్, ప్రొప్టేట్ ఎన్లార్జిమెంట్, కరోనా ఆర్టరీ డిసీజ్, ఎడీమా, హైపర్ టెన్షన్, అసిడిటీ, సైనస్/మైగ్రెయిన్లలో ఏ సమస్య తీవ్రంగా మారి, ప్రస్తు ఆందోళనకర పరిస్థితి కల్పించిందో లేదా ఏ కొత్త సమస్య తలెత్తిందో వైద్య బృందం చేత సమగ్ర పరీక్షలు జరిపించాలి.
5. ఆయన పట్ల మొత్తంగా ఆయన సహనిందితుల పట్ల ఎన్ఐఏ వహిస్తున్న కక్షపూరిత ధోరణి విడిచిపెట్టాలని ఎన్ఐఏకు బాధ్య వహించే హోంమంత్రిత్వ శాఖ ఆదేశించాలి, తెలుగువాడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఈ బాధ్యత తీసుకోవాలి.
6. 1969 ఉద్యమం నుంచి తెలంగాణ కోసం పోరాగంలో పాల్గొన్న ప్రపంచ ప్రసిద్ధుడైన తెలంగాణ బిడ్డ వరవరరావు గారి ఆరోగ్యం కోసం,క్షేమం కోసం, భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం బాధ్యత పడాలి అంటూ పి. హేమలత శనివారం ఉదయం 9 గంటలకు ప్రెస్ నోట్ విడుదల చేశారు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
an hour ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
2 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
4 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
5 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
6 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
6 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
4 hours ago

నా రూటే సెపరేటు
8 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా