newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వరంగల్ వరదలపై విజయశాంతి విమర్శలు

19-08-202019-08-2020 13:25:02 IST
Updated On 19-08-2020 14:33:07 ISTUpdated On 19-08-20202020-08-19T07:55:02.645Z19-08-2020 2020-08-19T07:54:49.993Z - 2020-08-19T09:03:07.604Z - 19-08-2020

వరంగల్ వరదలపై విజయశాంతి విమర్శలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో భారీవర్షాల ప్రభావం వరంగల్ పై బాగా పడింది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే వరంగల్ వాసులు వరదనీటితో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత విజయశాంతి. ప్రభుత్వం చేతగానితనానికి జనం బలవుతున్నారని ఆమె మండిపడ్డారు. చిన్న చినుకులకే జలమయమయ్యే హైదరాబాద్‌ను ఎలాగూ కాపాడలేకపోయారని, ఇప్పుడు ప్రభుత్వం చేతగానితనానికి వరంగల్‌ కూడా బలైందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి విమర్శించారు.

రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో ఇటీవల  బయటపడిన రూ.కోటి లంచం ఘటనే చెబుతోందని విమర్శించారు. గాంధీ ఆస్పత్రి పలుమార్లు అగ్నిప్రమాదానికి గురైనా అక్కడ ఫైర్‌సేఫ్టీ వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుందని ఆరోపించారు.  అన్నిరంగాల్లో తెలంగాణ సర్కార్ విఫలం అయిందని, కేసీయార్ దొర వైఫల్యాలు రాయాలంటే గ్రంథమే సరిపోదన్నారు. 

ఇదిలా ఉంటే వరంగల్ వరదల బారిన పడడానికి కారణాలపై మంత్రి కేటీయార్ ఫోకస్ పెట్టారు. వరంగల్‌ నగరంలో నెలరోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలిగిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఆక్రమణలు గుర్తించి, తొలగించేందుకు వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీని వేసినట్లు తెలిపారు.

నగరంలో ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం మంత్రులు ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మె ల్యేలు, అధికారులతో కలిసి మంగళవారం సమీక్షించారు.

నాలాలపై అక్రమ నిర్మాణాల వల్లే వర ద బయటకు పోక రోడ్లపైకి నీరు వచ్చి, కాలనీలు జలమయమయ్యాయని వారు చెప్పింది నూరు పాళ్లు నిజమన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గ కుండా ఆక్రమణలు తొలగించాలని, గుర్తించిన చోట పనులు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు.

అక్రమ నిర్మాణాలైతే నిర్దాక్షిణ్యంగా తొలగించాలని, పేదల ఇళ్లయితే, ప్రభుత్వం తర ఫున డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని, రిజిస్ట్రేషన్‌ ఉన్న వారివైతే నష్టపరిహారం చెల్లించా లని సూచించారు. వరంగల్‌ నగరంలో నాలాలపై ఆక్రమణలు ఇప్పుడు వచ్చినవి కాదని, ఏళ్ల క్రితం నుంచీ ఉన్నాయని, ఇండ్ల నిర్మాణం, లే-అవుట్లు, రోడ్ల నిర్మాణం పద్ధతి ప్రకారం జరగలేదన్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle