newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వరంగల్ వరదబాధితులు అందరినీ ఆదుకుంటాం... కేటీఆర్ భరోసా

19-08-202019-08-2020 14:31:32 IST
2020-08-19T09:01:32.971Z19-08-2020 2020-08-19T09:01:28.337Z - - 22-04-2021

వరంగల్ వరదబాధితులు అందరినీ ఆదుకుంటాం... కేటీఆర్ భరోసా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వరంగల్‌ నగరంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుంది. నగరంలో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకు ఆదేశించాం. సీఎంకు పరిస్థితి వివరించడంతో రూ.25 కోట్లు తక్షణ సహాయం కింద మంజూరు చేశారు. అందరూ ధైర్యంగా ఉండాలి’అని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ తదితరులు ముంపునకు గురైన వరంగల్‌ నగరంలో మంగళవారం పర్యటించారు. 

కేటీఆర్, ఈటల ఉదయం హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అనంతరం కేటీఆర్‌ నాయకత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని నయీంనగర్, సమ్మయ్య నగర్, గోపాలపూర్, పెద్దమ్మగడ్డ–యూనివర్సిటీ రోడ్, పోతననగర్, బొందివాగు రోడ్, రామన్నపేట, హంటర్‌ రోడ్, సంతోషిమాత గుడి ప్రాంతం, ఉర్సు, రంగశాయిపేట, శివనగర్‌ తదితర ప్రాంతాల్లో దాదాపు 4 గంటల పాటు పర్యటించారు. అన్ని ప్రాంతాల్లోని ముంపునకు గురైన ప్రజలతో మాట్లాడి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. దెబ్బతిన్న డ్రైనేజీలు, ఇళ్లు, రోడ్లను పరిశీలించారు. 

ఫాతిమానగర్‌–కేయూ వంద ఫీట్ల రోడ్డులో గోపాలపూర్, సమ్మయ్య నగర్‌ ప్రాంత వాసులతో కేటీఆర్‌ మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని.. పరిస్థితి చక్కబడే వరకు నిత్యావసర సరుకులు అందజేస్తామని హామీ ఇచ్చారు. హంటర్‌ రోడ్డులో కేటీఆర్‌ సహా ఇతర ప్రజాప్రతినిధులు వరద నీటిలోనే నడుస్తూ పరిస్థితులు పరిశీలించారు. చాలా చోట్ల నాలాలపై ఆక్రమణ వల్లే వరదలు సంభవించినట్లు స్థానికులు కేటీఆర్‌ దృష్టికి తెచ్చారు. సహాయక చర్యల్లో పాల్గొన్న డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ సభ్యులను కేటీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. 

ముంపు ప్రాంతాల పర్యటన అనంతరం ఈ బృందం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోని కోవిడ్‌ వార్డును సందర్శించింది. మంత్రులు కేటీఆర్, ఈటల, ఎర్రబెల్లి పీపీఈ కిట్లు ధరించి కోవిడ్‌ వార్డులోకి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వైద్యంపై ఆరా తీశారు. మందులు, పరికరాలతోపాటు నిపుణులైన వైద్యులు, ఇతర సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారని, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులను, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. ఏరియల్‌ వ్యూ ద్వారా ఓరుగల్లు నగరాన్ని పరిశీలించిన కేటీఆర్‌.. అనంతరం కాజీపేటలోని ‘నిట్‌’ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘ముంపు కాలనీల పర్యటనలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే విషయం చెప్పారు. నాలాలపై ఆక్రమణల వల్ల వరద బయటకు వెళ్లపోవడంతో రోడ్లపైకి నీరు వచ్చి జనావాసాలు జలమయమయ్యాయన్నారు. వారు చెప్పింది నిజం. నగరంలో అనేక చోట్ల నాలాలపై ఆక్రమణలున్నాయి. వాటిని తక్షణం తొలగించాలి. రాజకీయ ఒత్తిళ్లు ఉండవు. ఇప్పటికే గుర్తించిన నిర్మాణాల తొలగింపు పని వెంటనే ప్రారంభం కావాలి. ఆక్రమణల గుర్తింపు, తొలగింపునకు కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని నియమిస్తున్నాం. నాలాలపై అక్రమ నిర్మాణాలు వేటిని విడిచిపెట్టొద్దు. ఒకవేళ వాటిల్లో పేదల ఇళ్లుంటే, వారికి ప్రభుత్వం తరఫున డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్‌ ఉన్న వారివైతే నష్ట పరిహారం చెల్లించి తొలగించాలి’అని ఆదేశించారు.

వరంగల్‌లో రాబోయే నెల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. నాలాలపై ఉన్న ఆక్రమణలు గుర్తించి, వాటిని తొలగించే కార్యక్రమం నిర్వహించడానికి వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీని నియమించారు. జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు రూపొందించిన తర్వాత అవసరమైనన్ని నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. వరంగల్‌లో నాలాలపై ఆక్రమణలు ఇప్పుడు వచ్చినవి కాదని.. చాలా ఏళ్ల క్రితం నుంచే ఇదంతా జరిగిందన్నారు. ఓ పద్ధతి ప్రకారం నగరాభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే కొత్త మున్సిపల్‌ చట్టం తెచ్చామని చెప్పారు. వరంగల్‌ నగరానికి కొత్త మాస్టర్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైందని, సీఎం ఆమోదంతో త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 

ఇక్కడి పరిస్థితిని చూసి, సీఎంకు నివేదించాం. తక్షణ అవసరాల కోసం రూ.25 కోట్లు మంజూరు చేసిన సీఎం.. నష్టంపై అధికారులు పూర్తి స్థాయి అంచనాలు రూపొందించిన తర్వాత ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తామని చెప్పారు’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. వరంగల్‌ నగర జనాభా ఇప్పటికే 11 లక్షలకు చేరిందని, దీనికి అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు. ‘పారిశుద్ధ్య పనుల్లో యాంత్రీకరణ జరగాలి. ముంపునకు గురైన వారికి ప్రభుత్వం పక్షానే నిత్యావసర సరుకులు అందించాలి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలి. అలాగే రాబోయే రోజుల్లో మళ్లీ భారీ వర్ష సూచన ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’అని కేటీఆర్‌ సూచించారు. 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle