newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వరంగల్ ఐటీ సిగలో టెక్ మహీంద్రా, సైయంట్

07-01-202007-01-2020 13:17:41 IST
2020-01-07T07:47:41.148Z07-01-2020 2020-01-07T07:47:39.281Z - - 14-04-2021

వరంగల్ ఐటీ సిగలో టెక్ మహీంద్రా, సైయంట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐటీ అనగానే మనకు గుర్తుకువచ్చేది హైదరాబాద్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి. దేశ, విదేశీసంస్థలు తమ క్యాంపస్ లను హైదరాబాద్ లో ఏర్పాటుచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్ పెద్ద సంస్థలను ఆకట్టుకుంటోంది. ఐటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. వరంగల్ మడికొండలోని ఐటీ పార్క్‌లో సైయెంట్‌, టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సైయెంట్‌, టెక్‌ మహీంద్రా ప్రతినిధులు, మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో 5 ఎకరాల్లో సైయెంట్‌ నూతన భవనాన్ని నిర్మించారు. 600 నుంచి 700 మంది ఉద్యోగులతో సేవలు అందించేందుకు వీలుగా భవన నిర్మాణం చేపట్టారు. 

టెక్‌ మహీంద్రాలో 100 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 2016 ఫిబ్రవరిలో వరంగల్‌ ఐటీ సెజ్‌లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను కేటీఆర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐటీ సేవల కోసం 27 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలిని ప్రభుత్వం అభివృద్ధి చేసింది.

మొదటి దశలో భాగంగా 2017లో 5 ఎకరాల్లో మూడు కంపెనీలను ప్రారంభించారు. వరంగల్లో మరిన్ని ఐటీ సంస్థలు రావాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీయార్ అన్నారు. ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత నిస్తుందన్నారు. ఐటీ జాబ్స్ అంటే హైదరాబాద్ లోనే కాదు వరంగల్లోనూ ఉంటాయన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle