newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వయసుమీద పడిన పోలీసులకు కరోనా డ్యూటీ లేదు

31-03-202031-03-2020 16:22:55 IST
Updated On 31-03-2020 16:26:08 ISTUpdated On 31-03-20202020-03-31T10:52:55.394Z31-03-2020 2020-03-31T10:52:42.702Z - 2020-03-31T10:56:08.039Z - 31-03-2020

వయసుమీద పడిన పోలీసులకు కరోనా డ్యూటీ లేదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 55 ఏళ్లు దాటిన పోలీసులను బయట డ్యూటీలు విధించడం నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు అధికారులు కూడబలుక్కున్నట్లు తీసుకున్న ఈ నిర్ణయం ఇటు కరోనా, అటు వేసవి బారినపడి మగ్గుతున్న వృద్ద పోలీసులుకు పెద్ద ఉపశమనం కలిగించిందనే చెప్పాలి.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసుశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 55 ఏళ్లు దాటిన పోలీసులకు క్షేత్రస్థాయి విధులు కాకుండా లూప్‌లైన్‌ డ్యూటీలు వేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. పదిరోజులుగా లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడంలో నిద్రాహారాలు మాని 24 గంటలపాటు కష్టపడుతున్న పోలీసులకు ఇది శుభవార్తే. ఎందుకంటే కరోనాతో వృద్ధులకే ప్రాణాపాయం అధికం. 

పోలీసుశాఖలో 55 ఏళ్లు దాటిన వారు వివిధ విభాగాల్లో దాదాపు 5,000 మంది వరకు ఉంటారు. వీరిలో చాలామంది రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నారు. సర్వీసులో ఒత్తిళ్లతో ఇప్పటికే బీపీ, డయాబెటిక్, కిడ్నీ తదితర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయినా, వారంతా లాక్‌డౌన్‌ విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో డీజీపీ తీసుకున్న నిర్ణయంతో అటువంటి వారికి ఊరట లభించినట్టయింది.

అనారోగ్యంతో విధులు నిర్వహిస్తున్న వారు ఎప్పుడెలాంటి సమస్య వచ్చినా, ఆలస్యం చేయకుండా వెంటనే యూనిట్‌ ఆఫీసర్‌ దృష్టికి తేవాలని డీజీపీ ఆదేశించారు. కరోనాను నిలువరించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం ప్రకటించిన కరోనా ఇన్సూరెన్స్‌ పథకంలో పోలీసులనూ భాగస్వామ్యం చేసే అవకాశాన్ని డీజీపీ పరిశీలిస్తున్నారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ శాఖలో 55 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలున్న వారిని కరోనా విధుల నుంచి తప్పించి పోలీస్‌ స్టేషన్‌లోనే ఉండేలా విధులు అప్పగిస్తామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. ప్రతి జిల్లాలోనూ పోలీస్‌ ఫ్యామిలీ హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 7,060 మందిపై కేసులను నమోదు చేశామన్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

 

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   4 hours ago


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   5 hours ago


షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

   3 hours ago


తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

   6 hours ago


జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

   7 hours ago


అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

   7 hours ago


కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

   20 hours ago


కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

   a day ago


దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

   a day ago


Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   17-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle