వనదేవతలకు బంగారం సమర్పించిన గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ
07-02-202007-02-2020 14:56:11 IST
2020-02-07T09:26:11.302Z07-02-2020 2020-02-07T09:26:09.516Z - - 16-04-2021

తెలంగాణలో మహా వేడుక మేడారం జాతర. ఈ జాతరకు జనం పోటెత్తుతున్నారు. మేడారం జాతరలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం పాల్గొన్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ఎత్తు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్లు ఇరు రాష్ట్రాల గవర్నర్లకు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయంలో జరిగే మేడారం జాతర దేశంలోనే అతిపెద్దదని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ కొనియాడారు. వనదేవతలుగా విరాజిల్లుతున్న సమ్మక్క సారలమ్మలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మేడారాన్ని దేవభూమిగా భావిస్తున్నామని దత్తాత్రేయ అన్నారు. గవర్నర్ హోదాలో అమ్మవార్ల ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి దేవతల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని దత్తాత్రేయ పేర్కొన్నారు. గవర్నర్ల రాక సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా