newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వందే భారత్ మిషన్.. అక్రమార్కులకు ‘సువర్ఱ’ అవకాశం

01-08-202001-08-2020 10:47:15 IST
Updated On 01-08-2020 13:57:05 ISTUpdated On 01-08-20202020-08-01T05:17:15.157Z01-08-2020 2020-08-01T05:16:43.477Z - 2020-08-01T08:27:05.960Z - 01-08-2020

వందే భారత్ మిషన్.. అక్రమార్కులకు ‘సువర్ఱ’ అవకాశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కాలంలో విదేశాలలో వందలాదిమంది భారతీయులు కట్టుబడి పోయారు, వారిని స్వదేశానికి తిరిగి తీసుకురావడం కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వందే భారత్ మిషన్ పేరుతో విమానాలు పంపి, ఆయా దేశాలతో మాట్లాడి తీసుకువస్తోంది. ఇలాంటి విమానాలలో ప్రయాణికులను పరిమితంగా మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వందే భారత్ మిషన్ లో భాగంగానే అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి.  అయితే, ఈ విమానాలను కొంతమంది బంగారాన్ని అక్రమంగా రవాణ చేసేందుకు వాడేస్తున్నారు.

వందే భారత్ మిషన్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన కొంతమంది ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు. వారినుంచి కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని  పట్టుకున్నారు.  వందే భారత్ మిషన్ విమానంలో దామన్ నుంచి వస్తున్న 11 మంది ప్రయాణికులు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడం విశేషం. ఈ ప్రయాణికులు బంగారాన్ని వారి లో దుస్తుల్లో పెట్టుకొని తీసుకొస్తుండగా, కష్టమ్స్ అధికారుల చెకింగ్ లో ఇది బయటపడింది.  మొత్తం 3.11 కేజీల బంగారాన్ని వీరి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  దీని విలువ కోటి ఆరు లక్షల రూపాయలు ఉంటుందని కష్టమ్స్ అధికారులు చెప్తున్నారు.  

కష్టకాలంలో వున్నవారిని కాపాడేందుకు ప్రభుత్వం వందే భారత్ మిషన్ ఉపయోగిస్తుంటే.. దానిని కూడా అక్రమార్కులు ఉపయోగించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి అక్రమ చర్యల వల్ల ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 'వందే భార‌త్ మిష‌న్' ఐదో విడ‌త‌లో భాగంగా కువైట్ నుంచి 5 విమాన స‌ర్వీసులు భార‌త్‌కు రానున్నాయి.

ఆగ‌స్టు 2 నుంచి 6 మ‌ధ్య హైద‌రాబాద్‌, చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగ‌ళూరు న‌గ‌రాల‌కు ఈ విమాన స‌ర్వీసులు కార్యకలాపాలు సాగించనున్నాయి. వందే భార‌త్ విమాన స‌ర్వీసుల విచార‌ణ‌కై గోఎయిర్‌, ఇండిగో ఎయిర్‌లైన్స్‌, ఎయిర్ ఇండియా కార్యాల‌యాల‌ను సంప్ర‌దించాల్సిందిగా భార‌త ఎంబ‌సీ పేర్కొంది. ఆగస్టు 1 నుంచి వాణిజ్య విమాన సేవలను తిరిగి ప్రారంభించడంలో భాగంగా కువైట్ ఎయిర్‌వేస్ భారతదేశం సహా 16 దేశాలకు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టికెట్ బుకింగ్ ప్రారంభించింది. తాజా పరిణామాల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేయనున్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle