newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

‘లోక్ సభ ఫలితాలే స్ఫూర్తి..2023లో అధికారం మాదే’

01-06-201901-06-2019 09:41:22 IST
Updated On 25-06-2019 12:58:56 ISTUpdated On 25-06-20192019-06-01T04:11:22.374Z01-06-2019 2019-06-01T04:11:13.597Z - 2019-06-25T07:28:56.402Z - 25-06-2019

‘లోక్ సభ ఫలితాలే స్ఫూర్తి..2023లో అధికారం మాదే’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన షాక్ నుంచి త్వరగానే  కోలుకుంది తెలంగాణ బీజేపీ. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా చేసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించి తెలంగాణలో పాగా వేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆశగా ఉన్నారు. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని, కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు.

టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఒక్క బీజేపీకే ఉందని భావించే ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో తమకు పట్టం కట్టారని అన్నారు. కేవలం ఒక్క అసెంబ్లీ స్థానం మాత్రమే సాధించిన  లోక్‌ సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఒక అవకాశంగా, ఒక సవాల్‌గా భావించి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో విజయంతో బీజేపీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంటింటికీ బీజేపీని తీసుకెళ్తాం. కేంద్ర పథకాలను తీసుకెళ్తాం. బెంగాల్‌ తరహా పోరాటాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం అంటున్నారు లక్ష్మణ్. కేంద్ర మంత్రి వర్గంలో కిషన్‌ రెడ్డికి స్థానం దక్కడంతో కేంద్రం నుంచి సాధ్యమైనంత సాయం తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తామన్నారు.

దక్షిణాదిలో కర్ణాటక తరువాత తెలంగాణలో బీజేపీ పాగా వేయడంతో తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్రంలో అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది. దీన్ని అవకాశం తీసుకుని ముందుకెళ్లాలని 2023 నాటికి పార్టీని బలోపేతం చేస్తామంటున్నారు.

మరోవైపు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిష న్‌రెడ్డిని, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలను ఘనంగా సన్మానించాలని బీజేపీ నిర్ణయించింది. పాత జిల్లాల ఆధారంగా జిల్లా కేంద్రాల్లో భారీ సభలు ఏర్పాటు చేసి వారిని సన్మానించనుంది. ఢిల్లీలోని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ నివాసంలో జరిగిన రాష్ట్ర బీజేపీ నేతల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మోడీ మంత్రిమండలిలో సికింద్రాబాద్ కు ప్రత్యేక స్థానం ఉంది. గతంలోనూ దత్తాత్రేయకు మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం పూర్తి మెజారిటీ సాధించిన బీజేపీ తన స్వంత ఎంపీలకు మంత్రి యోగం కల్పించింది. అమిత్ షా బాధ్యతలు చేపట్టిన హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి తన పనితీరుతో అందరి ప్రశంసలు అందుకోవడం ఖాయం అంటున్నారు బీజేపీ నేతలు. కిషన్ రెడ్డికి టీడీపీ, టీఆర్ఎస్ నేతలు అభినందనలు తెలిపారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle