newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

18-10-201918-10-2019 18:26:42 IST
Updated On 18-10-2019 19:04:56 ISTUpdated On 18-10-20192019-10-18T12:56:42.801Z18-10-2019 2019-10-18T12:56:39.025Z - 2019-10-18T13:34:56.316Z - 18-10-2019

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లిక్కర్ షాపుల లైసెన్సులకోసం అమ్మిన దరఖాస్తు పత్రాలద్వారానే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 960 కోట్ల రూపాయలను ఆర్జించినట్లు తెలుస్తోంది. లైసెన్సుల కోసం దరఖాస్తు చేయడానికి తప్పనిసరై దరఖాస్తుపత్రాలకు ఫీజులను ప్రభుత్వం రెండు లక్షల రూపాయలకు పెంచింది. అంతకుముందు ఫీజు లక్షరూపాయలు మాత్రమే ఉండేది. పైగా ఇది తిరిగి చెల్లించని మొత్తం అన్నమాట.

తుది సమాచారం ప్రకారం తెలంగాణలోని 2,116 వైన్ షాపుల కోసం రికార్డు స్థాయిలో 48,032 దరఖాస్తు పత్రాలను నమోదు చేసుకున్నారు. వీటిలో అత్యధికం ఖమ్మం జిల్లాలో నమోదు కావడం విశేషం. ఈ జిల్లాలో 89 లిక్కర్ షాపులకు గానూ 4,303 దరఖాస్తు పత్రాలు నమోదయ్యాయి. తర్వాత కొత్తగూడెం జిల్లా 76 షాపులకు గాను 3,410 దరఖాస్తు పత్రాలతో రెండో స్థానంలో నిలిచింది.

ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో లిక్కర్ షాపులకు దరఖాస్తు పత్రాలు నమోదువ కావడానికి పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్య కారణమైంది. మద్యనిషేధం అమలు చేయడం, దశలవారీగా నిషేధాన్ని పూర్తిస్తాయిలో అమలు చేయడానకి సంబంధించి ఏపీ ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ప్రజలు తెలంగాణ సరిహద్దు జిల్లాలకు ప్రయాణిస్తూ తెలంగాణలో మద్యం సేవిస్తూ తరిస్తున్నారు.

జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రబాద్ లలో 200 షాపులకు గాను 1,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మహానగరం నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 29.98 కోట్ల ఆదాయం వచ్చింది. మునుపటి రంగారెడ్డి జిల్లాలో కూడా గణనీయంగా దరఖాస్తు పత్రాలు పెరిగాయని చెబుతున్నారు.

అక్టోబర్ 1న ఆంద్రప్రదేశ్ లోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రం లోని 3,500 లిక్కర్ షాపులను స్వాధీనం చేసుకుంటూ కీలకనిర్ణయం తీసుకుంది. లిక్కర్ షాపులు ఇకపై కేవలం 9 గంటలు మాత్రమే పనిచేస్తాయని, ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటలవరకు మాత్రమే అవి పనిచేస్తాయని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ షాపులను నడపడానికి 3,500మంది సూపర్ వైజర్లు, 8.033మంది సేల్స్ మెన్లను ప్రభుత్వం నియమించింది.

ఇలా మద్యంషాపుల పని సమయాన్ని పరిమితం చేయడం, క్రమంగా ఉన్న షాపులను కూడా ఎత్తివేయనున్నామని  ఏపీ ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణకు లడ్డులాంటి అవకాశాన్ని అందించింది. ఆ లడ్డూ మూల్యం 960 కోట్ల రూపాయలు. ఆర్టీసీ సమ్మెతో కోట్లాది రూపాయలను నష్టపోతున్న ప్రభుత్వానికి లిక్కర్ షాపుల దరఖాస్తుల రూపంలో ధనలక్ష్మి తలుపుతట్టినట్లయింది.

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle