newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన కేసీఆర్‌..! డిఫెన్స్‌లో జేఏసీ

03-11-201903-11-2019 07:19:14 IST
2019-11-03T01:49:14.318Z03-11-2019 2019-11-03T01:49:06.813Z - - 22-02-2020

లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన కేసీఆర్‌..! డిఫెన్స్‌లో జేఏసీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ కార్మికుల‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రెండోసారి లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు. స‌రిగ్గా నెల రోజుల క్రితం స‌మ్మె ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యంలో అక్టోబ‌రు 6వ తేదీన క‌చ్చితంగా విధుల్లో చేరాల‌ని లేక‌పోతే 49 వేల కార్మికులు సెల్ప్ డిస్మిస్ అయిన‌ట్లేన‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. కానీ, కార్మికులు మాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు. జేఏసీ మాట‌పై కార్మికులంతా ఒక్క‌తాటిపై న‌డుస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల స‌మ్మె నెల రోజుల‌కు చేరువ‌వుతుండ‌టం, ఆర్టీసీ కార్మికులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుండ‌టం, ఆవేద‌న‌తో చ‌నిపోతుండ‌టం, హైకోర్టులో ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప‌రిణామాలు లేక‌పోవ‌డం, కేంద్రం కూడా ఆర్టీసీ కార్మికుల వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకునే యోచ‌న‌లు ఉండ‌టంతో అంతా కేసీఆర్ కొంత త‌గ్గుతారేమో అని భావించారు.

నిన్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ఆయ‌న ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో అనే ఉత్కంఠ నెల‌కొంది. కానీ, మ‌రోసారి ఆయ‌న ప‌ట్టు వీడ‌లేదు. ఆర్టీసీ కార్మికుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపేదే లేద‌న్న‌ట్లు ఆయ‌న మాట‌లు ఉన్నాయి. 50 శాతం బ‌స్సుల‌ను ప్రైవేటుప‌రం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆర్టీసీ కార్మికులు బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నార‌ని, వారిది చ‌ట్ట‌వ్య‌తిరేక స‌మ్మె అని ప‌దేప‌దే నొక్కి చెప్పారు.

ఇప్ప‌టికే ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు పోయిన‌ట్లేన‌ని, కాక‌పోతే తాము ద‌యాగుణంతో ఆర్టీసీ కార్మికుల‌కు మ‌రో ఛాన్స్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 5వ తేదీలోగా క‌చ్చితంగా విధుల్లో చేరాల‌ని, అది కూడా బేష‌ర‌తుగా చేరితేనే ఉద్యోగాలు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఎటువంటి చ‌ర్చ‌లు జ‌రిపేది లేద‌ని మ‌రోసారి పున‌రుత్ఘాటించారు.

తాము విధించిన డెడ్‌లైన్ లోపు విధుల్లో చేర‌క‌పోతే ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు పోయిన‌ట్లేన‌ని నెల రోజుల క్రితం చెప్పిన మాట‌నే కేసీఆర్ మ‌రోసారి చెప్పారు. అంతేకాదు, మిగ‌తా 50 శాతం బ‌స్సుల‌ను కూడా ప్రైవేటు ప‌రం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఆర్టీసీ యూనియ‌న్లు, ప్ర‌తిప‌క్షాల మాయ‌లో కార్మికులు ప‌డి ఉద్యోగాలు పొగొట్టుకోవ‌ద్ద‌ని కేసీఆర్ హిత‌వు ప‌లికారు. ఆర్టీసీ కార్మికుల మ‌ర‌ణాల‌కు యూనియ‌న్లు, ప్ర‌తిప‌క్ష పార్టీల‌దే బాధ్య‌త అని చెప్పారు.

యూనియ‌న్ల‌ను, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ప‌దేప‌దే చెప్ప‌డం ద్వారా ఆర్టీసీ కార్మికులు పున‌రాలోచించుకొని విధుల్లో చేరాల‌ని కేసీఆర్ ఆశిస్తున్నారు. ముఖ్య‌మంత్రి క‌ఠినంగా ఉండ‌టంతో తాము ఇక చేసేది ఏమీ లేద‌ని, ఇంకా స‌మ్మె చేస్తే ఉద్యోగాలు పోతాయ‌నే భ‌యం ఆర్టీసీ కార్మికుల్లో రావాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌గా ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి ఆర్థ‌మ‌వుతోంది.

మ‌రి, ఇంత‌కాలం కార్మికులంతా ఏక‌తాటిపై న‌డిచి యూనియ‌న్ల నిర్ణ‌యాన్ని పాటించారు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన లాస్ట్ వార్నింగ్‌తో వారు ఏమైనా మ‌న‌స్సు మార్చుకుంటారా చూడాల్సి ఉంది.

బేష‌ర‌తుగా కార్మికులంతా ఉద్యోగాల్లో చేరాల‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ కార్మికులు విధుల్లో చేరితే ఇన్ని రోజులు స‌మ్మె చేసి సాధించింది శూన్య‌మే అవుతుంది. స‌మ్మె కొన‌సాగిస్తే కుటుంబాల పోష‌ణ‌కు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ స‌మ‌యంలో ఆర్టీసీ జేఏసీ కార్మికుల్లో ధైర్యం నింపి స‌మ్మె కొన‌సాగించేలా చేయ‌గ‌ల‌దా అనేది చూడాలి.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   11 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle