newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్ సడలిస్తున్నా 'ఏపీ టు తెలంగాణ' బంద్!

18-05-202018-05-2020 15:51:18 IST
Updated On 18-05-2020 16:04:48 ISTUpdated On 18-05-20202020-05-18T10:21:18.724Z18-05-2020 2020-05-18T10:20:49.606Z - 2020-05-18T10:34:48.608Z - 18-05-2020

లాక్ డౌన్ సడలిస్తున్నా 'ఏపీ టు తెలంగాణ' బంద్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో లాక్ డౌన్ 40 అమల్లోకి వచ్చేసింది. దీంతో మరికొన్ని సడలింపులు అమల్లోకి వచ్చాయి. ఒకవిధంగా దాదాపుగా డెబ్భై శాతం కార్యకలాపాలకు మార్గం సుగమమైంది. అయితే ప్రజా రవాణా లేకపోవడంతో అనుకున్న స్థాయిలో కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఇంకా 30 లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇక్కడ సీఎం కేసీఆర్ ముందే లాక్ డౌన్ ను మే 29 వరకు పొడగించేసిన సంగతి తెలిసిందే.

అయితే.. తెలంగాణలో ఇప్పటికే చాలా సడలింపులు ఇచ్చేశారు. నిర్మాణ రంగం నుండి సాధారణ కార్యకలాపాల వరకు చాలా మేరకు సడలింపులు ఇచ్చేశారు. కానీ ఒక్క ప్రజా రవాణా విషయంలో మాత్రం మిగతా రాష్ట్రాల మాదిరి కూడా కనీసం సడలింపులు ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిపై తెలంగాణ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది.

మరీ ముఖ్యంగా మూడు రాష్ట్రాల నుండి తెలంగాణకు రాకపోకల్ని నిషేధించినట్లుగా తెలుస్తుంది. ఈ రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. గుజరాత్, మహారాష్ట్రలో కేసులు చాలా అధికంగా ఉన్నాయి. వైరస్ వ్యాప్తి కూడా అక్కడ చాలా ఉదృతంగా ఉంది. కనుకే ఆ రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చేందుకు వీలు లేదని చెప్పింది. కానీ ఏపీ నుండి నిషేధం విధించడం ఆసక్తిగా మారింది.

తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేస్తుంది. కానీ ఏపీ నుండి వచ్చేందుకు మాత్రం వీలు లేకుండా చేస్తుంది. ఏపీలో ఉన్న తెలంగాణకి చెందిన కొందరు వలస కార్మికులను తిరిగి ఏపీకి పంపిస్తామని ఏపీ హోంమంత్రి సుచరిత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన గంటల వ్యవధిలోనే ఈ తరహా నిషేధం నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది.

తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలలో మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది. వేలల్లో కేసులు బయటపడడంతో పాటు సరిహద్దు నుండి నిత్యం రాకపోకలు అధికంగా ఉంటుంది కనుక ఆ మార్గంపై నిషేధం విధిచింది. అయితే ఏపీలో పరిస్థితి ఏమంత భయంకరంగా లేదని అక్కడి ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. అయినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ నుండి వచ్చే అన్ని బార్డర్స్ దగ్గర నిషేధం విధించేసింది.

ఏపీలో తెలంగాణ సరిహద్దు జిల్లాలలో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలలో వైరస్ ఎక్కువగా ఉందని తెలంగాణ అంచనా. అక్కడి కేసుల సంఖ్య కూడా ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఈక్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వ అధికారుల మాట. ఈ నిషేధం దాదాపుగా రాష్ట్రంలో ప్రజారవాణాపై ఆంక్షలు ఉన్నన్ని రోజులు అమల్లో ఉంటుందని కూడా చెప్తున్నారు.

అయితే.. తెలంగాణ నుండి వెళ్లేవారికి మాత్రం ఇక్కడ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసి మరీ ఏపీకి పంపిస్తుంది. వారిలో కొందరిని ఏపీ అధికారులు రోజుల తరబడి వెయిట్ చేయించడంతో పాటు కనీసం సౌకర్యాలు కూడా లేకుండా చెక్ పోస్టుల వద్దే పడిగాపులు కాసేలా చేస్తున్నారు. ఇది ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయ లోపంగా కనిపిస్తుంది. అయితే తెలంగాణ మాత్రం రాష్ట్రానికి వచ్చే వారి విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించింది.

 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle