newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్ వేళ జోరుగా లిక్కర్ దందా

08-04-202008-04-2020 13:03:07 IST
Updated On 08-04-2020 14:03:15 ISTUpdated On 08-04-20202020-04-08T07:33:07.636Z08-04-2020 2020-04-08T07:31:43.064Z - 2020-04-08T08:33:15.207Z - 08-04-2020

 లాక్ డౌన్ వేళ జోరుగా లిక్కర్ దందా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు పోలీసులు కరోనా వ్యాపించకుండా లాక్ డౌన్ పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే అక్రమార్కులు మాత్రం తమ దందా కొనసాగిస్తూనే వున్నారు. లిక్కర్ షాపులు బంద్ అయినా దుకాణం సీళ్లు తొలగించి మద్యం అమ్మకాలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. బెల్ట్ షాపులే అడ్డాగా మద్యం అక్రమ అమ్మకాలు బాగా పెరిగిపోతున్నాయి. లాన్‌ కాలంలోనూ కొందరు మద్యం దుకాణాలు తెరుస్తూ ప్రభుత్వ ఆదేశాలను గాలికి వదిలేస్తున్నారు. 

బెల్టు షాపుల నిర్వాహకులు అధిక ధరలకు మద్యం అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్రమ మద్యం అమ్మకాలను బెల్ట్ షాపుల ద్వారా అమ్మిస్తూ అక్రమ లాభార్జనకు  కొందరు వ్యాపారులు  సిద్ధపడుతున్నారు.

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి.... జైపూర్‌ మండలంలో ఈ దందా  సాగుతున్నట్లు తెలుస్తోంది. బెల్టు షాపుల నిర్వాహకులు క్వార్టర్‌ రూ.350, బీరు రూ.300 చొప్పున అమ్మకాలు సాగిస్తున్నారు.ఫుల్ బాటిళ్ల ను డబుల్, ట్రిబుల్ రేట్లకు విక్రయిస్తున్నారు. మద్యం దుకాణాలను జనతా కర్ఫ్యూ నుంచి మూసివేశారు.అయితే షాపులకు  సిలు వేసినప్పటికి కొందరు  దానిని పాక్షికంగా తొలగించడంతో పాటు మరో తాళానికి అది కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

మద్యం దుకాణాలకు వస్త్రంతో కూడిన సీళ్లు వేశామని అధికారులు చెబుతుంటే కొని మద్యం దుకాణాలకు పేపర్‌తో వేసిన సీలు ఉండడం, అది కూడా తొలగించి ఉండడం అనుమానాలకు బలం చేకూరుతోంది. అక్రమంగా అధిక ధరలకు మద్యం అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లాక్ డౌన్ సమయంలో పెద్దపల్లి పట్టణంలోని  ఓం సాయిరాం వైన్స్ నుండి  అర్ధరాత్రి  మద్యం తరలిస్తుండగా పట్టుకున్న,  టాస్క్ ఫోర్స్ పోలీసులు,  86, 000 వేల రూపాయల మద్యం, ఒక కారు,  4ద్విచక్ర వాహనాలు, 7 గురు వ్యక్తులను పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. పెద్దపల్లి  జిల్లా కేంద్రంలోని సాయిరాం  వైన్ షాప్ యజమాని లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిoచి అత్యాశకుపోయి అడ్డదారిలో మద్యం విక్రయిస్తూ  పోలీసులకు దొరికీపోయాడు.

పెద్దపల్లిపట్టణంలోని కూనారం రోడ్ లో గల సాయిరాం  వైన్ షాపులో తెల్లవారు జామున లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా యజమాని ఎక్సైజ్ అధికారులు వేసిన సీల్ ను తొలగించాడు. మద్యం అమ్మకాలు సాగించాడు. ఈ సమయంలో మద్యం అమ్మకాలు జరిపితే భారీ మొత్తంలో లాభాలు సంపాదించవచ్చని ఉద్దేశం తో సాయిరాం  వైన్స్ యజమాని బెల్ట్ షాప్ వారితో ఒప్పందం కుదుర్చుకొని భారీ మొత్తంలో మద్యం నిల్వలు షాప్ నుండి బయటకు తీసి  వాటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. బెల్ట్ షాపు వారితో కలిసి మద్యం బాక్స్ లను కారు, బైక్ ల పై తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు షాప్ యజమాని తో పాటు బెల్ట్ షాప్ నిర్వాహకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేసి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేశారు.

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   13 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   17 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   20 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle