newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

లాక్ డౌన్ వెసులుబాట్లతో స్వల్ప ఉపాధి

22-04-202022-04-2020 10:32:07 IST
Updated On 22-04-2020 11:19:17 ISTUpdated On 22-04-20202020-04-22T05:02:07.619Z22-04-2020 2020-04-22T05:00:03.986Z - 2020-04-22T05:49:17.570Z - 22-04-2020

లాక్ డౌన్ వెసులుబాట్లతో స్వల్ప ఉపాధి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనదేశంలో మార్చి 22 నుంచి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది.అప్పటినుంచి అన్ని పనులు ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి మినహాయింపులను దశలవారీగా పెంచుతోంది. ఐతే... ఈ మినహాయింపులను అమలు చేసేదీ లేనిదీ నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉంటుంది. తాజాగా స్కూల్ బుక్స్ అమ్మే షాపులు, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ అమ్మే షాపులు తెరచుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది. అంతేకాదు... ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్లకు రీచార్జ్ చేసే సౌకర్యంను కూడా లాక్‌డౌన్ నుంచి తప్పించింది. కాబట్టి... మొబైల్ రీచార్జ్ షాపులు ప్రత్యేకంగా ఈ ఒక్క సేవ కోసం తెరచుకోవచ్చు.

అలాగే సీనియర్ సిటిజన్స్‌కి బెడ్‌సైడ్ అటెండెన్స్‌గా ఉండేవారికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఐతే... రాష్ట్రాల ప్రభుత్వాలు ఇందుకు అంగీకరిస్తేనే. ఉదాహరణకు తెలంగాణలో ఇవి అమలవ్వవు. ఎందుకంటే ప్రభుత్వం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను మే 7 వరకూ కొనసాగిస్తోంది. ఏపీలో ఈ మినహాయింపులు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.

దీర్ఘకాలంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కార్మికుల్ని ఆదుకునే లక్ష్యం తో ప్రభుత్వం నిర్మాణరంగానికి లాక్‌డౌన్‌లో కూడా కొంత వెసులుబాటు కల్పించడంతో  కార్మికులు మళ్లీ పనులలోకి వెళ్లవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఈ రంగంపై ఆధార పడి సుమారు 30లక్షల మంది జీవిస్తున్నారు. ఈరంగంలో పనులు మొదలైతే వీరందరికీ ఉపాధి లభిస్తుంది. ఆర్ధికంగా చేయూతనిచ్చినట్లవుతుందని ప్రభుత్వం భావించింది. అయితే వెసులుబాటు కల్పించినా ఈ రంగం పుంజుకోవడంలేదు. కొన్ని జాగ్రత్తల్తో పనికెళ్లేందుకు కార్మికులు సిద్దమైనా వారికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రాలేదు. 

ఉపాధి కల్పనా రంగంలో అత్యంత కీలకమైన ఈ విభాగంలో వెసులుబాట్లు కల్పించిన తర్వాత కూడా ఎటు వంటి ప్రయోజనం చేకూరడంలేదని ఆవేదన వ్యక్తం అవుతోంది. ఇందుక్కారణం నిర్మాణ రంగంలో అతిముఖ్యమైన సరుకుల ధరలు అనూహ్యంగా పెంచేయడమే. లాక్‌డౌన్‌ నేపధ్యంలో నష్టాలపాలైన సిమెంట్‌ పరిశ్రమల అధిపతులు ఒక్క సారిగా సిమెంట్‌ ధరను పెంచేశారు. ఇప్పుడు మార్కెట్‌లో సిమెంట్‌ బస్తా ధర 400నుంచి 450కి పైగా పలుకుతోంది. ఈ ధరపై సిమెంట్‌ కొని నిర్మాణాలు చేసేందుకు సాధారణ వ్యక్తులెవరూ సాహసించరు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ళు నిర్మించుకునేవారెవరూ ఈ ధరపై కొనుగోలుకు ముందుకురారు. 

ఇటుక ధర కూడా ఇదేవిధంగా పెరిగింది. ఇక ఇసుక అయితే అందుబాటులో లేనే లేదు. ఒక వేళ ఇసుక దొరికితే బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ మూడూ లేకుండా నిర్మాణరంగం పుంజుకునే అవకాశాల్లేవు. గతంలో సిమెంట్‌ ధరలపై ప్రభుత్వ నియంత్రణుండేది. సిమెంట్‌ను దీర్ఘకాలం నిత్యావసర వస్తువుల జాబితాలో ఉంచారు. ప్రభుత్వ నిర్దేశిత ధరను మించి ఉత్పత్తిదార్లు విక్రయించే అవ కాశం ఉండేదికాదు.

మార్కెట్‌లో అమ్మకాలు కూడా అధి కారులిచ్చే ఉత్తర్వులకనుగుణంగానే సాగేవి. నిర్మాణ అవసరాల్ని బట్టి సిమెంట్‌ కోటా జారీ చేసేవారు. ధరను ఎప్పుడూ నియంత్రణలో ఉంచేవారు. కొన్ని సందర్బాల్లో డిమాండ్‌ పెరిగేది. దీంతో బ్లాక్‌ జరిగే అవకాశం లేకుండా దక్షిణ కొరియా నుంచి సిమెంట్‌ను కేంద్రం దిగుమతి చేసుకునేది. తద్వారా అవసరానికి సరిపడే సిమెంట్‌ను మార్కె ట్‌లో అందుబాటులో ఉంచేది. 

అయితే  సిమెంట్‌ను నిత్యావసరాల జాబితా నుంచి తొలగించారు. దీంతో ధర నిర్ణయాధికారం పరిశ్రమలకు, దుకాణదారుల చేతికి ఇచ్చినట్టయింది. లాక్‌డౌన్‌ నేపధ్యంలో సిమెంట్‌ పరిశ్రమలు కొంతమేర నష్టపోవడం యదార్ధమే. అంతమాత్రాన రాత్రికి రాత్రే నష్టాలన్నీ పూడ్చేసుకుని తిరిగి లాభాలు పొందాలన్న తాపత్రయం సరికాదు. సిమెంట్‌ పరిశ్రమల అధిపతుల్ని ప్రభుత్వం కఠినంగా హెచ్చరించాలి.

నిర్దేశిత ధరను మించి విక్రయాలు జరిపితే చర్యలు చేపట్టాలి. ఏ రోజు కా రోజు ప్రభుత్వమే సిమెంట్‌ ధరను ప్రకటించాలి. అలాగే ఇటుకల తయారీకవసరమైన మట్టి, సిమెంట్‌, బూడిదలను అందుబాటులో పెట్టాలి. అనంతరం ఇటుకల ధరలపై కూడా నియంత్రణ విధించాలి. ఈ రంగం తిరిగి కోలుకునే వరకు ఇసుకను ఉచితంగా సరఫరాచేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 

గ్రామీణ స్థాయి నుంచి నిర్మాణాలు జోరందుకుంటాయి. కేవలం పట్టణాలు, నగరాల్లో నిర్మించే భారీ భవంతులకే ఇనుము వినియోగం అధికంగా ఉంటుంది. పేద, మధ్యతరగతి ఇళ్ళ నిర్మాణాల్లో కేవలం కొన్ని ఊచలు మాత్రమే అవసరమౌతాయి. ఇనుము ధర పెద్దగా ఈ నిర్మాణాల్ని ప్రభావితం చేయదు. కానీ సిమెంట్‌, ఇసుక, ఇటుకల ధరలకనుగుణంగానే ఇవి సాగుతాయి. ఈ నిర్మాణాలు పుంజుకుంటేనే ఎక్కువ సంఖ్యలో కార్మికులకు, కూలీలకు పని లభిస్తుంది. వారికి ఆర్ధికంగా ఊరటనిచ్చినట్లవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle