newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్ వున్నా నాటుసారా అక్రమ తయారీ

16-04-202016-04-2020 10:55:57 IST
Updated On 16-04-2020 11:20:16 ISTUpdated On 16-04-20202020-04-16T05:25:57.706Z16-04-2020 2020-04-16T05:25:49.252Z - 2020-04-16T05:50:16.464Z - 16-04-2020

లాక్ డౌన్ వున్నా నాటుసారా  అక్రమ తయారీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్  ప్రకటించిన విషయం విదితమే. అక్రమార్కులు రెచ్చిపోతూనే వున్నారు. తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో నాటుసారా తయారీ గుప్పుమంటోంది. కర్నాటక సరిహద్దులో వున్న తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విచ్చలవిడిగా నాటుసారా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. లాక్ డౌన్ నిబంధనలతో మద్యం షాపులు బంద్ అయ్యాయి. ఎక్కడా మద్యం దొరకకపోవడంతో సారా తయారీకి తెరలేపారు నిర్వాహకులు. అయినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు.   

తాజాగా వికారాబాద్ జిల్లా యాలాల మండలం అన్నాసాగర్ గ్రామంలో  గ్రామ సర్పంచ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సివిల్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏడు బైకులతో పాటు ఏడుగురిని అదుపులోకి తీసుకుని యాభై లీటర్ల సారా స్వాధీనపర్చుకున్నారు పోలీసులు. తాపీగా అక్కడికి చేరుకున్న ఎక్సైజ్ అధికారులు వారిని తమ అధీనంలోకి తీసుకున్నారు. లాక్ డౌన్ పుణ్యమాని నాటుసారా వ్యాపారులు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. విస్తృతంగా నియోజకవర్గంలో నాటుసారా తయారు చేసి గ్రామాలకు తరలిస్తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. ఈ విషయం అంతర్గత రహస్యమైనా అటువైపు  చూడడానికి కూడా అధికారులు మక్కువ చూపకపోవడంతో ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు .  

గ్రామాల్లో మద్యం లభించకపోవడంతో కొందరు వ్యక్తులు నాటుసారా తయారీని లాభదాయకమయిన వ్యాపారంగా మలచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సారాను పూర్తిగా నిషేధించిందని ఒకవైపు చెప్పుకొస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో నిఘా పెట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు మాత్రం పత్తా లేకుండా పోయారు . గత కొన్ని రోజుల నుంచి తాండూరు నియోజకవర్గంలో వివిధ  గ్రామాల్లో సారా విచ్చలవిడిగా లభిస్తోంది. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు శివారులో ఈ నియోజకవర్గం ఉండటంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. దీంతో ఎక్సైజ్ శాఖలో  క్రిందిస్థాయి అధికారులు సారా వ్యాపారులపై నిఘాను ఉంచడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle