లాక్ డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నాం
08-04-202008-04-2020 15:48:03 IST
Updated On 08-04-2020 17:57:39 ISTUpdated On 08-04-20202020-04-08T10:18:03.267Z08-04-2020 2020-04-08T10:17:40.580Z - 2020-04-08T12:27:39.623Z - 08-04-2020

దేశవ్యాప్తంగా అమలులో వున్న లాక్ డౌన్ పొడిగింపు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి. రాష్ట్రాలు,నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయని, ప్రజలు లాక్ డౌన్ కి సహకరించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు కిషన్ రెడ్డి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా వుందని ఎవరూ తేలికగా తీసుకోవద్దన్నారు. ప్రజలెవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అనవసరపు కారణాలతో రోడ్లపైకి రావడం మీకే మంచిది కాదన్నారు. తాజా కూరగాయలు అవసరం లేదు.. పప్పుతో తినండి..వారం రోజులకు సరిపడా సరుకులు దగ్గర పెట్టుకోవాలన్నారు. గ్యాస్, మంచినీళ్ళు, బియ్యం, పప్పులు తెచ్చుకోవాలని, కూరగాయల కోసం బయటకు వచ్చి కరోనా బారిన పడవద్దన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం లాక్ డౌన్ అమలు పరుస్తోందన్నారు. దేశంలో టెస్టింగ్ కిట్ల కొరత లేదు..ఈరోజు రెండు లక్షల కిట్లు వచ్చాయని, ఎక్కడి వారు అక్కడే ఉంటారన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు నిర్బంధంలో ఉన్నవారి నిర్బంధం కొనసాగుతుందని, ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరేళ్లుగా కేంద్రం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చెయ్యలేదని, ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తామన్నారు. కరోనా రోగుల చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు జారీచేసింది. మూడు రకాల ఆసుపత్రులను సూచించింది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ సోకిన రోగులను వారి వ్యాధి తీవ్రతను బట్టి మూడు రకాల ఆసుపత్రుల్లో చికిత్స చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. కరోనా అనుమానితులను కొవిడ్ కేర్ సెంటర్లలో, కరోనా తీవ్రత మధ్యస్థంగా ఉన్న వారిని కొవిడ్ హెల్త్ సెంటర్లలో, కొవిడ్ తీవ్రవత ఎక్కువగా ఉన్న రోగులను కొవిడ్ ప్రత్యేక ఆసుపత్రుల్లో వైద్యచికిత్సలు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ తీవ్రతను బట్టి రోగులను మూడు రకాలుగా విభజించి ఆయా ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రప్రభుత్వ, రాష్ట్రప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగుల చికిత్సకు మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసింది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను ప్రత్యేకంగా ఐసీయూ, వెంటిలేటర్లు ఉన్న ఆసుపత్రుల్లో చేర్చాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ కేర్ సెంటర్లు, కొవిడ్ హెల్త్ సెంటర్లు, కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. కరోనా కేసుల్లో 70 శాతం ప్రాథమిక దశలోనే ఉన్నందున వారిని కొవిడ్ కేర్ సెంటర్లు, కొవిడ్ హెల్త్ సెంటర్లలోనే చికిత్స చేయవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెపుతున్నారు...

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
3 hours ago

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!
4 hours ago

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు
4 hours ago

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భవిష్యత్
5 hours ago

అబ్బో సమస్యలపై కూడా జగన్ ఫోకస్ చేస్తున్నారా
6 hours ago

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ
19 hours ago

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు
a day ago

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి
21 hours ago

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
a day ago
ఇంకా