newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్ పొడిగింపునకే కేసీయార్ నిర్ణయం!

05-05-202005-05-2020 08:00:02 IST
Updated On 05-05-2020 08:57:59 ISTUpdated On 05-05-20202020-05-05T02:30:02.764Z05-05-2020 2020-05-05T02:29:57.400Z - 2020-05-05T03:27:59.362Z - 05-05-2020

లాక్ డౌన్ పొడిగింపునకే కేసీయార్ నిర్ణయం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మరో రెండురోజుల్లో లాక్ డౌన్ ముగియనుంది. దీనిపై కేసీయార్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా కట్టడి, ఆర్థిక కార్యకలాపాలు, లాక్‌డౌన్‌ గడువు పొడిగింపు వంటి ముఖ్యమైన అంశాలపై రాష్ట్రప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఇవాళ జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ అంశాలన్నీ చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో లాక్‌డౌన్‌కు ఇచ్చిన గడువు 7వ తేదీతో ముగుస్తోంది. కేంద్రం ఈనెల 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఇప్పుడు కేసీఆర్ కూడా కేంద్ర నిర్ణయాన్ని అనుసరిస్తూనే రాష్ట్రంలో మరికొంతకాలం లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉంది. 

ఇక టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్, వివిధ పోటీ పరీక్షల నిర్వహణ అంశం, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై ఇవాళ కేబినెట్ భేటీలో  చర్చించనున్నారు. భేటీ తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి నిర్ణయాలను తెలియజేసే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు.

బీహార్, ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు రైళ్లు నడుపుతామని తెలిపారు. లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు ఆసక్తి చూపుతుండడంపై చర్చ జరిగింది. ఇటు మద్యం షాపులు తెరవడంపై కూడా ఒక నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు ఆబ్కారీ శాఖ అధికారులు. 

తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లు నడిపి కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్ణయించారు.  దక్షిణ మధ్య రైల్వే జిఎం గజానన్ మాల్యతో మాట్లాడి, మంగళవారం నుంచి 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు రైళ్ల ద్వారా తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియా, సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ రెడ్డిలను ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా నియమించింది. 

తమ సొంత స్థలాలకు వెళ్ళేందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అలా పేర్లు నమోదు చేసుకున్న వారిని రైళ్ల ద్వారా తరలిస్తారు. పోలీస్ స్టేషన్లలోనే వివరాలు ఇస్తారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికులను తమ సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినందున ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కోరారు.

ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించి, కార్మికులను సమన్వయం చేయాల్సిందిగా పోలీసు అధికారులను ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ లోని పలు పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి.

దీంతో వలస కార్మికులు కొందరు తమ స్వంతూళ్ళకు వెళ్లేందుకు ఆసక్తి చూపించినా నిర్మాణ రంగానికి సంబంధించిన కాంట్రాక్టర్లు వారిని వారించారు. దీంతో తమ ప్రయత్నాలు మానుకున్నారు. మళ్ళీ తమ విధులకు హాజరవుతున్నారు. ఫార్మా కంపెనీలు కూడా వీరిపైన ఆధారపడుతున్నాయి. తమ పర్మినెంట్ ఉద్యోగులతో పాటు టెంపరరీ ఉద్యోగాల్లో ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. ఇటు భవన నిర్మాణ రంగంలో పనులు ప్రారంభం అయితే వలస కార్మికులకు ఉపాధి లభించనుంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle