‘‘లాక్ డౌన్ పరీక్ఝలో మనదే విజయం కావాలి’’
26-03-202026-03-2020 10:38:19 IST
Updated On 26-03-2020 11:42:57 ISTUpdated On 26-03-20202020-03-26T05:08:19.293Z26-03-2020 2020-03-26T05:07:37.113Z - 2020-03-26T06:12:57.270Z - 26-03-2020

ప్రపంచం కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రపంచాన్ని వెంటాడుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరికి ఇది పరీక్ష సమయమని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నాకేమవుతుందిలే అనే నిర్లక్ష్యానికి పోవొద్దని ఆమె హితవు పలికారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ స్వీయ నియం త్రణతో మనందరం ఇండ్లలో ఉండటమే శ్రేయస్కరమని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశం ద్వారా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శార్వరి నామసంవత్సరం అందరి కుటుంబాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆమె ఆకాంక్షించారు. పండుగనాడు కూడా కుటుంబాలను వదిలేసి సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుశాఖ సహా ఇతర శాఖల సిబ్బంది కుటుంబాలకు ఆమె శుభాకాంక్షలు సందేశం పంపారు. ఇటు తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి హోం క్వారంటైన్లో ఉన్నవారికి రెడ్ నోటీసులు జారీ చేస్తోంది. కుటుంబసభ్యుల అనుమతితో ‘ఈ ఇంటికి రాకూడదు.. ఆరోగ్య నిర్బంధంలో ఉన్నది’ అని రాసి ఉన్న నోటీసులను ఇళ్లకు అంటిస్తున్నారు. అలాగే 20 వేల బృందాలు ఇంటింటికీ తిరిగి విదేశాల నుంచి వచ్చినవారికి ఇప్పటికే క్వారంటైన్ ముద్రలు వేశారు. ఈ ముద్రల కోసం ఎన్నికల పోలింగ్ సమయంలో వాడే ఇంక్ ఉపయోగిస్తున్నారు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 65వ నంబరు జాతీయ రహదారి వెంట వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. తెలంగాణ ఏపీ సరిహద్దుల వద్ద వాహనాల రద్దీ తగ్గింది. హైదరాబాద్ నుండి నో అబ్జెక్షన్ లెటర్ ల తో వచ్చిన వారిని అనుమతించిన పోలీసులు... మిగతా వాహనాలని హోల్డింగ్ పాయింట్ లో పార్కింగ్ చేయించారు... ఏపీ నుండి వచ్చే వాహనాలను బార్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను అన్నింటిని కోదాడ రామాపురం చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటుచేసిన హోల్డింగ్ పాయింట్లో నిలిపివేస్తామని పోలీసులు తెలిపారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
13 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా