newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్ తర్వాత తొలి రైలు తెలంగాణ నుంచే స్టార్ట్.. ఆద్యంతం రహస్యం

02-05-202002-05-2020 15:21:25 IST
Updated On 02-05-2020 15:50:19 ISTUpdated On 02-05-20202020-05-02T09:51:25.343Z02-05-2020 2020-05-02T09:51:22.361Z - 2020-05-02T10:20:19.251Z - 02-05-2020

లాక్ డౌన్ తర్వాత తొలి రైలు తెలంగాణ నుంచే స్టార్ట్.. ఆద్యంతం రహస్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ సమయంలోనూ తెలంగాణ అరుదైన ఘటనకు నాందిపలికింది. దాదాపు 40 రోజుల లాక్ డౌన్ తర్వాత దేశంలోనే తొలిసారిగా వలస కూలీలను రైళ్ల ద్వారా తరలించిన ఘటన తెలంగాణ నుంచే ప్రారంభమైంది. అత్యంత రహస్యంగా ప్రభుత్వం, పోలీసుల అధికారులు సాగించిన ఆపరేషన్‌లో భాగంగా 1,225 మంది వలస కూలీలతో కూడిన ప్రత్యేక రైలు శుక్రవారం ఉదయం 4.50కి హైదరాబాద్ లోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి జార్ఖండ్‌లోని హతియాకు బయల్దేరింది. ఒక్కో కోచ్‌లో 72 మంది ప్రయాణికులకు సీట్లు అందుబాటులో ఉంటూడగా  భౌతిక దూరం పాటింపుపై కేంద్రం మారదర్శకాలకు అనుగుణంగా 54 మందిని మాత్రమే అధికారులు అనుమతించారు. 

మొత్తం 24 కోచ్‌లలో ప్రయాణీకులతో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు ఎట్టకేలకు జార్కండ్ లోని హతీయా జిల్లాకు శుక్రవారం రాత్రి చేరుకుంది. సొంత రాష్ట్రానికి, సొంత ఊరుకు ఎప్పుడెప్పుడు చేరగలమా అని ఉద్వేగంతో గడిపిన వలసకూలీలకు హాతియా రైలుస్టేషన్లో సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉందని, నా ఆనందాన్ని ప్రకటించడానికి మాటలు కూడా రావట్లేదని రామ్ గర్‌కు చెందిన ఒక వలసకూలీ విలపిస్తూ చెప్పండం అధికారులను కదిలించివేసింది. ప్రయాణంలో మాకు తగిన ఆహారం అందించి ఏలోటూ లేకుండా చూసుకున్నారని తొలిరైలు ప్రయాణికులు చెప్పారు.

జార్కండ్‌కు తెలంగాణ నుంచి రైలు వెళుతోందని వార్త పొక్కితే కూలీలతోపాటు వేలమంది విద్యార్థులు, రైల్వే ఉద్యోగులు కూడా స్టేషన్‌కు వెల్లువెత్తుతారన్న భయంతో చివరి క్షణం వరకు రైలు ఎక్కడినుంచి బయలుదేరుతుందన్న విషయం తెలియనివ్వకుండా ప్రభుత్వం అత్యంత నిగూఢంగా వ్యవహరించి లాక్ డౌన్ తర్వాత దేశంలోనే తొలి రైలు ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది. శుక్రవారం వేకువజామున హైదరాబాద్‌లోని లింగంపల్లి  రైల్వేస్టేషన్‌లో జార్ఖండ్‌కు వెళ్లే ప్రత్యేక రైలు ఎక్కుతున్న వలస కూలీల ఫొటోలను ప్రభుత్వం విడుదల చేసేంతవరకు మీడియాతో సహా ఎవరికీ ఈ విషయం తెలీకపోవడం విశేషం.

లాక్‌డౌన్‌తో ఇరుక్కుపోయిన వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వారిని వారి స్వస్థలాలకు తరలించే కార్యక్రమం తెలంగాణ నుంచి మొదలైంది. వారిని రైళ్ల ద్వారా తరలించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే బోర్డు అనుమతి ఇవ్వటంతో ఆ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న వలస కూలీలు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు ఆందోళనకు దిగటం, అది కాస్తా ఉద్రిక్తతకు దారితీయటం, పోలీసు వాహనాలు ధ్వంసం కావటానికి దారితీసిన సంగతి తెలిసిందే. 

వారిని స్వస్థలాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి విషయాన్ని కేంద్రం దృష్టికి తీసు కెళ్లటంతో రైలు ద్వారా తరలింపునకు అంగీకరించింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్, ఈ తరలింపు వ్యవహారాన్ని పర్యవేక్షించే నోడల్‌ అధికారి సుల్తానియా తదితరులు అర్ధరాత్రి వరకు పర్యవేక్షించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇలా వేరే ప్రాంతాలకు చెంది లాక్‌ డౌన్‌ వల్ల మరో చోట ఇరుక్కు పోయిన వారందరినీ రైళ్ల ద్వారా తరలించాలని కేంద్రం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోగా ఆ తర్వాత పట్టాలెక్కిన తొలి రైలు ఇదే. 

హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన లక్షల మంది ఉంటున్నారు. సెలవు రోజుల్లో వీరు సొంత ప్రాంతాలకు వెళ్లి వస్తుండటం సహజం. లాక్‌డౌన్‌ వల్ల వీరు గత 40 రోజులుగా ఇక్కడే ఉండిపోయారు. లాక్‌డౌన్‌కు ఎప్పుడు విముక్తి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాగోలా సొంత ప్రాంతాలకు వెళ్లాలని వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొందరు కాలినడకన వెళ్తుండగా, కొందరు అక్రమంగా వాహనాల్లోని సరుకుల మధ్య కూర్చుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను వారి ప్రాంతాలకు తరలించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపటంతో, వారి మాటున ఉద్యోగులు, ఇతరులు కూడా వెళ్లేందుకు యత్నిస్తున్నారు. వీరి సంఖ్య ఎక్కువగా ఉండటంతో తరలించటం సాధ్యం కాదు. 

వలస కూలీల కోసం రైళ్లను నడుపుతున్న సంగతి ముందే తెలిస్తే.. వీరు కూడా పెద్ద సంఖ్యలో ఆయా స్టేషన్లకు వచ్చే ప్రమాదం ఉందని రైల్వే భావిస్తోంది. ఇటీవల ముంబైలో ఇలాగే వేల సంఖ్యలో వలస కూలీలు స్టేషన్‌కు రావటంతో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో రైల్వే అధికారులు ఈ రైలు విషయాన్ని గోప్యంగా ఉంచారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గానీ స్థానిక స్టేషన్‌ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. ఉదయం రైలు బయల్దేరే వరకు అదే విభాగంలోని మిగతావారికి కూడా తెలియకపోవటం విశేషం.

వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను పంపే క్రమంలో తెలంగాణతో పాటు, వారు వెళ్లాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని ఏకాభిప్రాయానికి వస్తేనే రైళ్లు నడపనున్నట్టు రైల్వే బోర్డు పేర్కొంటోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు అనుసరిస్తూ రైల్వే స్టేషన్‌కు తెచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, వారు దిగిన తర్వాత వారిని క్వారంటైన్‌ చేయటమా, ఇతర షెల్టర్లకు పంపటమా, ఇళ్లకు చేర్చటమా అని నిర్ణయించి తరలించే బాధ్యత అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. వారికి భోజన, పానీయాల వసతి కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని, ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటే మాత్రం రైల్లో వారికి భోజనం, నీళ్లు అందిస్తామని రైల్వే బోర్డు నిర్ణయించింది.

లాక్‌ డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకున్న బిహార్, ఒడిశాకు చెందిన 1,200 కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలించడం వెనుక జరిగిన పోలీస్‌ ఆపరేషన్‌ ఫలించింది. ఈ మొత్తం ఆపరేషన్‌ను వెస్ట్‌ జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర అత్యంత రహస్యంగా, విజయవంతంగా పూర్తి చేశారు. ఏడీజీ జితేందర్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన స్టీఫెన్‌ రవీంద్ర.. బుధవారం రాత్రే కూలీల వద్దకు వెళ్లారు. అందరినీ సొంత రాష్ట్రాలకు పంపుతామని వారికి హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు. ఎప్పుడు, ఎలా పంపుతారన్న విషయం ఆఖరు నిమిషం వరకు కూలీలకు కూడా తెలియనివ్వలేదు. 

గురువారం రాత్రి 12 గంటల నుంచి 1.30 గంటల వరకు మొత్తం 1,200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికి నెగెటివ్‌ వచ్చింది. అప్పుడే లింగంపల్లి రైల్వే అధికారులకు కూలీలను తీసుకొస్తున్నామని పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు తెప్పించిన దాదాపు 30కి పైగా బస్సుల్లో తరలించారు. తెల్లవారుజామున 2.30 తర్వాత బస్సులు లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరాయి. ప్రత్యేక రైలులో అంతా ఎక్కాక వారికి ఆహారం, వాటర్‌ అందించారు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటలు దాటాక రైలు బయల్దేరింది.

లాక్ డౌన్ అనంతరం రెండో రైలు కేరళలోని ఎర్నాకులం నుంచి ఒరిస్సా లోని భువనేశ్వర్‌కు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. దాదాపు వెయ్యిమంది వలసకూలీలకు కరోనా పరీక్షలు జరిపి పాజిటివ్ రాలేదని నిర్థారించుకున్న తర్వాతే ప్రయాణానికి అనుమతించారు.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   35 minutes ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   16 minutes ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   6 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   9 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   an hour ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   3 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle