newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్ కోసం పోలీసు శాఖ అప్రమత్తం.. కరోనా వ్యాపించకుండా చర్యలు

01-07-202001-07-2020 11:25:01 IST
Updated On 01-07-2020 11:49:16 ISTUpdated On 01-07-20202020-07-01T05:55:01.411Z01-07-2020 2020-07-01T05:54:49.952Z - 2020-07-01T06:19:16.231Z - 01-07-2020

లాక్ డౌన్ కోసం పోలీసు శాఖ అప్రమత్తం.. కరోనా వ్యాపించకుండా చర్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నవేళ మరోమారు హైదరాబాద్ లో లాక్ డౌన్ అమలు చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో పోలీసులు సమాయత్తమౌతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో గతంలో కంటే కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వస్తున్న సంకేతాల నేపథ్యంలో పోలీసులు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ బాధ్యత నిర్వర్తిస్తున్న పోలీసు శాఖలో పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో అ సారి రెండింతలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు కరోనా బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూనే గతంలో కంటే కఠినంగా లాక్ డౌన్ అమలు చేసేందుకు తెలంగాణ పోలీసు శాఖ ప్రత్యేక వ్యూహం అమలుచేయనుంది.

తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కరోనా సెగ తగిలింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు అలాగే  ఆయన కొడుకుకి పాజిటివ్ వచ్చింది, అయితే మిగతా కుటుంబసభ్యులకు నెగెటివ్ రావడంతో వారందరిని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. అంతకుముందే తెలంగాణ హోం మంత్రి, టీఆర్ఎస్ కీలక నేత మొహమ్మద్ అలీకి కూడా కరోనా సోకింది. దీంతో ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు.

తెలంగాణ విద్యుత్ శాఖలో బారినపడ్డారు పలువురు విద్యుత్ ఉద్యోగులు. వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతూ ముగ్గురు విద్యుత్ ఉద్యోగులు మృతిచెందడం ఆందోళన పెంచింది. అలాగే  తెలంగాణ పోలీస్‌ శాఖలో కరోనా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన సిబ్బంది కరోనా కట్టడికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే డిస్‌ ఇన్ఫెక్షన్‌ టీమ్‌లను రంగంలోకి దింపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని స్టేషన్‌లలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తున్నారు. తొలి విడతలో అధికంగా కేసులున్న స్టేషన్‌లను డిస్‌ ఇన్ఫెక్షన్‌ టీమ్‌లు శుభ్రం చేస్తున్నాయి.

రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లను శుద్ధి చేయనున్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో పల్స్‌ ఆక్సీమిషన్స్‌ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వారికి యుద్ధ ప్రాతిపదికన కరోనా టెస్ట్‌లు నిర్వహించనున్నారు. అలాగే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారికి సెలవుపై వెళ్లాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లలో కరోనా నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

కరోనా వైరస్‌కు గురవుతున్న అధికారులు, ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. అమీర్ పేట తహసీల్దార్‌ చంద్రకళకు కరోనా సోకడంతో కార్యాలయాన్ని బల్దియా సిబ్బంది శానిటైజ్‌ చేసింది. మిగతా కార్యాలయ సిబ్బందికి అధికారులు కరోనా పరీక్షలు చేశారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో వైరస్‌కు గురవుతున్న అధికారులు, ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది.

సర్కిల్‌, జోనల్‌, ప్రధాన కార్యాలయం అన్న తేడా లేకుండా కరోనా పంజా విసురుతోంది. బల్దియా పాలనా విభాగం ఉద్యోగికి పాజిటివ్‌గా తేలింది. ఈ కార్యాలయంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. చేరింది. శేరిలింగంపల్లి జోన్‌ చందానగర్‌ సర్కిల్‌ జనన, మరణ ధ్రువపత్రాల జారీ విభాగం ఉద్యోగికి వైరస్‌ నిర్దారణ కావడంతో కార్యకలాపాలు నిలిపేశారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు పేషీలో పనిచేస్తున్న ఇద్దరు పీఏలకు కరోనా   సోకింది. కుత్బుల్లాపూర్‌ లో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో ముందు జాగ్రత్తగా షాపూర్‌నగర్‌ మార్కెట్లోని అన్ని వ్యాపార సముదాయాలనూ మూసివేశారు. జులై 5వ తేదీ వరకు వ్యాపార సముదాయాలన్నింటినీ మూసివేశామని ప్రకటించింది. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   an hour ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   4 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle