newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్ ఎఫెక్ట్.. భాగ్యనగరంలో అభాగ్యులెందరో!

26-03-202026-03-2020 12:42:37 IST
Updated On 26-03-2020 17:23:31 ISTUpdated On 26-03-20202020-03-26T07:12:37.061Z26-03-2020 2020-03-26T07:12:32.844Z - 2020-03-26T11:53:31.967Z - 26-03-2020

లాక్ డౌన్ ఎఫెక్ట్.. భాగ్యనగరంలో అభాగ్యులెందరో!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది.. ఇందుకు ప్రధాని మోడీ గత ఆదివారం జనతా కర్ఫ్యూని పాటించాలని కోరారు.  అందుకు ప్రజల నుండి కూడా విశేషంగా మద్దతు లభించింది. తరవాత తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఎందరో పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఔను.. కొన్ని వందల కుటుంబాలు పస్తులే ఉన్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో చిన్నా చితకా వ్యాపారాలు చేసుకొనే వారి దగ్గర నుండి రోజు వారీ కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు.. భవన నిర్మాణ కార్మికులకు పనిలేదు. వీరివి రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు. వీరిలో ఎక్కువ మంది ఎక్కడెక్కడి నుండో వచ్చిన వలస కార్మికులు కావడంతో ప్రభుత్వం అందించే రేషన్, నగదు వీరికి అందదు.

లాక్ డౌన్ తో బయట పనిలేక.. ఇక్కడ ఉంటే బ్రతుకు కష్టమనుకున్న కొన్ని కుటుంబాలు సొంత ఊళ్ళకి కాలినడకనే ప్రయాణం మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారు ఈ సాహసానికి పూనుకుంటున్నారు. దాదాపు 250 నుండి 400 కిమీ కాలినడకన ఎలా వెళ్తారని వీరినిప్రశ్నిస్తే వారి సమాధానం కన్నా ముందు వారి మనసులో నుండి తీరని ఆవేదనే బయటకు వస్తుంది.

వచ్చే నెల 14 వరకూ లాక్ డౌన్ వుంది. మరో ఇరవై రోజులు పనిలేదు. ఇప్పుడు మా దగ్గర మరో రెండు రోజులకు మాత్రమే తిండి ఉంది. ఈ రెండు రోజులలో కొంత దూరమైనా వెళ్తే మరో రెండు రోజులు ఆకలితో అయినా మా సొంత ఊళ్ళకి వెళ్తే వ్యవసాయ కూలీ చేసుకొని గంజి అయినా తాగుతాం అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. సువిశాల భాగ్యనగరంలో వీరు ఎటు నుండి వెళ్తున్నారో ప్రపంచానికి కనిపించడం లేదు కానీ జిల్లాలలో వీరి ప్రయాణం స్పష్టంగా కనిపిస్తుంది.

బుధవారం వేకువజామున సంగారెడ్డి నుండి రోడ్డుపై నడుచుకుంటూ కర్నూలు వెళ్తున్న ఓ నలభై కుటుంబాలు మంత్రి కేటీఆర్ కంట పడ్డాయి. రెండు రోజులకి తలకాస్త తిండి మూటలు కట్టుకొని నెత్తిన పెట్టుకొని వెళ్తున్న ఈ కూలీలను కేసీఆర్ ఆపి వివరాలను కనుక్కుని వారికి వాహనాన్ని ఏర్పాటుచేసి పంపించారు. అటు సంగారెడ్డి నుండి రంగారెడ్డి వరకు కూలీలది ఇదే పరిస్థితి.

ఇక సిటీలో హాస్టళ్లలో ఉండేవారిది ఇంకో బాధ. వారిని ఖాళీ చేయించేశారు యజమానులు. వారికి సొంతూళ్ళకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించే ఏర్పాట్లు చేసింది. ఇక కోచింగ్ సెంటర్లకు వెళ్లే విద్యార్థులు, చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకొనే బ్యాచిలర్స్ కు నగరంలోని టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లే ఆధారంగా ఉండేది. మొన్నటి వరకు 24 గంటలు సిటీలో ఏదైనా దొరికే సౌకర్యాలతో వీరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు.

కొందరు బ్యాచిలర్స్ రూములు అద్దెకి తీసుకొని ఉండేవారు తిండికి మాత్రం బయట కర్రీ పాయింట్ల మీదే ఆధారపడే వారు. ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో బయట ఏమీ దొరకక.. ఇంట్లో వంట చేసుకొనేందుకు ఏమీ లేక వారిది మరో అవస్థ. మంగళ, బుధవారాలలో పోలీస్ స్టేషన్ వద్ద పర్మిషన్  కోసం వచ్చిన వారిలో ఇలాంటి వారి జాబితా కూడా చాలా పెద్దదే ఉంది. కొందరికి పర్మిషన్ వచ్చినా వారిని తెలంగాణ సరిహద్దుల్లోనే గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఆపేశారు ఆంధ్రా అధికారులు. రాత్రంతా వారు అక్కడే వుండాల్సి వచ్చింది. ఉదయం వారిని ఐసోలేషన్ సెంటర్లకు తరలించారు. 

జనతా కర్ఫ్యూ తర్వాత ఒక్కరోజు అవకాశం ఇచ్చినా.. ఎలాంటి అవకాశం లేని వారు సొంత గ్రామాలకు వెళ్లేవారని.. లేదంటే ఇక్కడే ఉన్నా కనీసం నిత్యావసరాలతో పాటు వంట సామాగ్రి లాంటివి కొనుక్కొనే వారమని.. ఒక్కరోజు కర్ఫ్యూ అని చెప్పి ఏకంగా నెల రోజులు పొడగింపుతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని కొందరు వాపోతున్నారు. లాక్ డౌన్ ప్రజా శ్రేయస్సు కోసమే విధించినా ఇందులో ప్రణాళిక లోపించిందన్నది కొందరి వాదన. అయితే, ఇది ఒకరకంగా మానవాళి చేస్తున్న యుద్ధమే కనుక అందులో కొన్నికష్టాలు, నష్టాలు తప్పవన్నది ఇంకొందరి వాదన.

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   13 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   17 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   20 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle