లాక్ డౌన్ ఎత్తేస్తారా? రెడ్ జోన్లలో పరిస్థితేంటి?
01-05-202001-05-2020 10:31:42 IST
Updated On 01-05-2020 10:54:13 ISTUpdated On 01-05-20202020-05-01T05:01:42.604Z01-05-2020 2020-05-01T04:47:39.233Z - 2020-05-01T05:24:13.424Z - 01-05-2020

తెలంగాణలో ఈ నెల 7వ తేదీతో లాక్ డౌన్ ముగియనుంది. లాక్ డౌన్ పొడిగింపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం. ఈ నెల 5వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో లాక్ డౌన్ కొనసాగింపా లేక ఎత్తివేయాలా అనేది తేలనుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో తగ్గినట్టే తగ్గి మరో 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 1038కి చేరుకున్నాయి. మలక్ పేట్ గంజ్ లో పనిచేస్తున్నపహాడీ షరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్లో ముగ్గురు షాపుల యజమానులకు, వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందని తేలింది. వీరి కుటుంబాలన్నీటిని ఆసుపత్రిలో ఐసొలేషన్ లో ఉంచామని. గంజ్, పహదీషరీఫ్ ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించి తగు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేశారు. ఇక కరోనా ప్రభావంతో గురువారం ఒక్కరోజే తెలంగాణలో ముగ్గురు మరణించినట్లు పేర్కొన్నారు. దీంతో.. తెలంగాణలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,038కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 568 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 11 జిల్లాలు కరోనా ఫ్రీ అయ్యాయని అధికారులు రిలీఫ్ ఫీలవుతున్నారు. తెలంగాణలో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయి. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడానికి లాక్డౌన్ పకడ్బందీగా అమలుచేయడమే కారణంగా చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు 11 జిల్లాలు కరోనా ఫ్రీ జిల్లాలుగా మారినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలు సడలించి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 33 జిల్లాల్లో యాదాద్రి భువనగిరి, వనపర్తి, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటీవ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ముందు నుంచీ ఈ మూడు జిల్లాల్లో కరోనా ప్రభావం లేని జిల్లాలుగా ఉన్నాయి. తాజాగా సిద్ధిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, ములుగు జిల్లాల్లో కరోనా పాజిటిగా నిర్ధారణ అయిన వారు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ జిల్లాల్లో ఇప్పుడు ఒక్క కరోనా కేసు కూడా లేదు. మొత్తంగా 11 జిల్లాలు ఇప్పుడు కరోనా ఫ్రీ జిల్లాలుగా మారాయి. ఈ 8 జిల్లాలకు చెందిన పాజిటివ్ కేసులున్న వారందరికీ వ్యాధి నయమై వెళ్లిపోయారు. దీంతో ఈ జిల్లాలన్నింటినీ ప్రభుత్వం కరోనా రహిత జిల్లాలుగా ప్రకటించింది. గాంధీవైద్యులు నిరంతరంగా సేవలందిస్తున్నారని వారి పర్యవేక్షణలో అందరూ త్వరగా కోలుకుంటారని అంటున్నారు. కరోనా సోకిన చిన్నారి సైతం కోలుకుంది. అంతేకాదు కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో కేంద్రం మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో పాటిస్తున్నారని కేంద్రబృందమే నివేదిక పంపిన తర్వాత రాజకీయ విమర్శలకు తావులేదని మంత్రి ఈటల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చికిత్స, రోగులకు అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తంచేస్తూ.. ఢిల్లీ వేదికగా కేంద్రం ప్రశంసించడం సంతోషం కలిగించిందని చెప్పారు. ఇక్కడకు వచ్చిన కేంద్ర బృందం.. కొవిడ్ దవాఖానలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి నివేదిక పంపిందని తెలిపారు. హోంశాఖ జాయింట్ సెక్రటరీ సలీలశ్రీవాత్సవ ప్రశంసించారని పేర్కొన్నారు. కరోనా విషయంలో కేసీయార్ సర్కార్ చర్యలపై కేంద్రం సానుకూల వైఖరి ప్రదర్శించింది. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే తెలంగాణ త్వరలో కరోనానుంచి విముక్తి పొందడం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
an hour ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
8 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
22 minutes ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
10 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021
ఇంకా