newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్ ఉల్లంఘనులపై భారీగా కేసులు

16-04-202016-04-2020 19:11:54 IST
Updated On 16-04-2020 20:21:18 ISTUpdated On 16-04-20202020-04-16T13:41:54.636Z16-04-2020 2020-04-16T13:41:46.500Z - 2020-04-16T14:51:18.422Z - 16-04-2020

లాక్ డౌన్ ఉల్లంఘనులపై భారీగా కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉల్లంఘనల కేసులు పెరిగిపోతున్నాయి. పోలీసులు, హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు అభినందనీయమని రామగుండం పోలీస్ కమిషనర్  సత్యనారాయణ పేర్కొన్నారు. రెడ్ జోన్ గా ప్రకటించిన ఎన్టిపీసీ అన్నపూర్ణ కాలనీని ఆయన తనిఖీ చేశారు.  నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అతనిని ఐసోలేషన్ కి పంపించడం జరిగిందని అతడు కోలుకుంటున్నాడని ఆయన చెప్పారు. 

రెడ్ జోన్ ప్రాంతంలో ఇతరులెవరూ ప్రవేశించకుండా డ్రోన్ కెమెరాతో పోలీసులు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా కంట్రోల్ లో ఉండడంతో అన్నపూర్ణ కాలనీ నీ కంటోన్మెంట్ పరిధి నుండి తొలగించేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించడం జరిగిందిని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా పోలీసులకు సహకరించాలన్నారు. 

కరీంనగర్ లోని కశ్మీర్ గడ్డ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు ఒక కిరాణా దుకాణం వద్ద నిత్యావసర వస్తువుల పంపిణీ పేరిట 70కి పైగా జనాలను సమీకరించి, సమావేశాన్ని నిర్వహించడం, ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేస్తున్న వీరి పై కరీంనగర్ లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో బుధవారం నాడు కేసు నమోదు చేశారు. కరీంనగర్లోని హుస్సేనిపురా ప్రాంతానికి చెందిన సయ్యద్ సహా అర్సలాన్, సయ్యద్ అబూజార్, మహమ్మద్ తర్భిజ్ అహ్మద్ ఖాన్, అహ్మద్ పురా కు చెందిన మీర్జా రహమతుల్లా బేగ్, సయ్యద్ అఖిల్‌లపై కేసును నమోదు చేశారు. 

పైన పేర్కొన్న వ్యక్తుల్లో కొందరికి నిషేధిత PFI సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఈ సంస్థ పేరిట ఈ నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేస్తున్నారంటూ ముద్రించబడిన డోర్ పోస్టర్లు,ఢిల్లీ లో జరిగిన అల్లర్లలోని వారికి సహాయం కోసం ముద్రించిన ఒక చందాలు స్వీకరించే బుక్కు, రెండు కార్లు, రెండు సెల్ ఫోన్లు, 49 రేషన్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎస్ఐ స్వరూప్ రాజ్ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వీరిని విచారిస్తున్నారు. ఇటు జామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిజామాబాద్ డిప్యూటీ మేయర్ మహమ్మద్ ఇంద్రిస్ ఖాన్ తో పాటు మరో 10 మంది పై కేసు నమోదు చేశారు పోలీసులు. రెడ్ జోన్ ప్రాంతంగా గుర్తించిన ఆటో నగర్ లో ఓ కుటుంబ సభ్యులను క్వారన్ టైన్ కు తరలిస్తుండగా అడ్డుకున్నారు నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇంద్రిస్ ఖాన్. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రెడ్ జోన్ ప్రాంతంలోకి రావడం, అధికారుల విధులకు ఆటంకం కలిగించి పోలీసులతో వాగ్వాదానికి దిగిన నేతలపై కేసులు నమోదుచేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేయర్ తో పాటు మరో 10 మంది పై పలు కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle