newssting
Radio
BITING NEWS :
భారీ విధ్వంసం సృష్టిస్తూ బుధవారం అర్థరాత్రి పుదుచ్చేరి వద్ద తీరం దాటిన నివర్ తుఫాన్. తీరందాటే సమయంలో భీకర గాలుల ధాటికి నేలకూలిన భారీ వృక్షాలు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత. * నివర్ తుఫాన్ ప్రభావంతో చిగురుటాకులా వణికిపోతున్న తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. గత అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వాలు. ఇళ్లు సురక్షితం కాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచన. * తుఫాను సమయంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు. నెల్లూరు జిల్లా , తమిళనాడుకు చెందిన మత్స్యకారులు సేఫ్. శ్రీహరికోట తీరంలో తలదాచుకున్న మత్స్యకారులు. * ఎన్టీఆర్ ఘాట్ కూల్చాలన్న ఎంఐఎం వ్యాఖ్యల్ని ఖండించిన టీడీపీ నేతలు. ఎన్టీఆర్ పై అభిమానముంటే భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేతలు. * అక్బరుద్దీన్ కు గట్టి కౌంటరిచ్చిన బీజేపీ నేత బండి సంజయ్. దమ్ముంటే పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలని సవాల్. వారి ఘాట్లను కూల్చిన వెంటనే దారుస్సలాంను కూల్చివేస్తామన్న బండి సంజయ్. * తెలంగాణలో కొత్తగా మరో 862 కరోనా కేసులు, ముగ్గురు మృతి. * సమ్మె చెేపట్టిన సింగరేణి కార్మికులు. కేంద్రం చేపట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె. సమ్మెలో పాల్గొన్న నాలుగు కార్మిక సంఘాలు. * 26/11 ముంబై ఉగ్రదాడులకు నేటితో 12 ఏళ్లు పూర్తి. ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళులర్పించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్.

లాక్ డౌన్ ఉల్లంఘనలపై పోలీసుల యాక్షన్

04-04-202004-04-2020 09:02:31 IST
Updated On 04-04-2020 10:05:35 ISTUpdated On 04-04-20202020-04-04T03:32:31.286Z04-04-2020 2020-04-04T03:32:21.727Z - 2020-04-04T04:35:35.585Z - 04-04-2020

లాక్ డౌన్ ఉల్లంఘనలపై పోలీసుల యాక్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి చెందుతోంది. దీంతో గత 10 రోజులుగా లాక్ డౌన్ అమలవుతోంది. అయితే లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. సామభేద దండోపాయలను ఉపయోగిస్తున్నారు. రోడ్లమీదకు రావద్దు మహా ప్రభో అని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల గుంజీలు తీయించడం, మరికొన్ని చోట్ల లాఠీలతో పనిచెప్పడం, వాహనాలు సీజ్ చేయడం చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్ల పైకి వచ్చిన వాహనదారులపై చర్యలకు దిగారు ట్రాఫిక్ పోలీసులు. మార్చ్ 23 వ తేదీ నుండి ఏప్రిల్ 3 వ తేదీ వరకు రోడ్లపైకి వచ్చిన టూవీలర్ వాహనాలు 1,34, 107. త్రీ వీలర్ వాహనాలు 3360. ఫోర్ వీలర్ వాహనాలు 7958. మొత్తం 146258 వాహనాలు సర్వైవలెన్స్ కెమెరాల ద్వారా గుర్తించి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందిరిపై వయోలేషన్ ఆక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. 

Bengaluru: 6,500 vehicles seized for flouting lockdown orders ...

దీంతో పాటు ట్రాఫిక్ పోలీసులు స్వయంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన. టూవీలర్ వాహనాలు 18268. త్రీ వీలర్ వాహనాలు 2238. ఫోర్ వీలర్ వాహనాలు 1587. మొత్తం 22178 మంది వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై మాత్రం ఐపీసీలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ప్రధానంగా సెక్షన్‌ 188 (ప్రభుత్వ ఆంక్షల్ని ఉల్లంఘించడం), సెక్షన్‌ 270 (ప్రాణాంతకమైన వ్యాధి మరొకరికి సోకేలా ప్రవర్తించడం), సెక్షన్‌ సెక్షన్‌ 271 (క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించడం) తదితరాల కింద రిజిస్టర్‌ చేస్తున్నారు. ఇలాంటి వారిని ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నా.. శాంతిభద్రతల విభాగానికి అప్పగిస్తున్నారు. 

Lockdown violation: Dharwad cops seize 173 vehicles | Deccan Herald

పికెట్ల వద్ద వాహనచోదకుల్ని ఆపి... ఆకారణంగా బయటకు వచ్చిన వారి నుంచి వాహనాలు  స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా గడిచిన పది రోజుల్లో 10 వేలకు పైగా వాహనాలను సీజ్‌ చేశారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఆయా సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. మూడు పోలీసు కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌ (టీసీసీసీ) సిబ్బంది వివిధ జంక్షన్లు, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ద్వారా ఇలాంటి ఉల్లంఘనుల్ని గుర్తించి ఈ–చలాన్లు జారీ చేస్తుండగా క్షేత్రస్థాయి అధికారులు ఆయా వాహనాలను ఆపి స్వాధీనం చేసుకుంటున్నారు.

పదే పదే రోడ్లమీదకు వచ్చే యువకులపై పోలీసులు యాక్షన్ మొదలుపెట్టారు.  మరోపక్క ఫిజికల్‌ డిస్టెన్స్‌ను కచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ముగిసే వరకు ద్విచక్ర వాహనంపై ఒకరు, తేలికపాటి వాహనంగా పిలిచే కారులో గరిష్టంగా ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అనేక మంది ఈ ఉత్తర్వుల్నీ ఉల్లంఘిస్తూ ద్విచక్ర వాహనాలపై ఇద్దరు సంచరిస్తున్నారు. 10 వేలకు పైగానే వాహనాలు సీజ్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచారు. లాక్ డౌన్ ముగిసేవరకూ వీటిని బయటకు తీయడానికి వీల్లేదు. 

మహిళా ఖైదీలకు శుభ‌వార్త చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌

మహిళా ఖైదీలకు శుభ‌వార్త చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌

   9 hours ago


ప్ర‌చారం చివ‌రి రోజున భాగ్య‌న‌గ‌రానికి వ‌స్తున్న మోదీ.. మ‌త‌ల‌బేంటీ..?

ప్ర‌చారం చివ‌రి రోజున భాగ్య‌న‌గ‌రానికి వ‌స్తున్న మోదీ.. మ‌త‌ల‌బేంటీ..?

   9 hours ago


అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-1)

అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-1)

   10 hours ago


బండ్ల గ‌ణేశ్ కు ఇంట్లో బ్యాండుమేళం..!

బండ్ల గ‌ణేశ్ కు ఇంట్లో బ్యాండుమేళం..!

   11 hours ago


అబ్బో.. బీజేపీ మేనిఫెస్టో బందోబ‌స్తుగ‌నే ఉంది..!

అబ్బో.. బీజేపీ మేనిఫెస్టో బందోబ‌స్తుగ‌నే ఉంది..!

   12 hours ago


'కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె' కేటీఆర్ సెటైర్లు

'కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె' కేటీఆర్ సెటైర్లు

   12 hours ago


మొన్న స‌ర్జిక‌ల్, నిన్న కూల్చివేతలు, రేపేంటి..?

మొన్న స‌ర్జిక‌ల్, నిన్న కూల్చివేతలు, రేపేంటి..?

   13 hours ago


పంప‌కాల్లో తేడాలు.. వైసీపీలో గొడ‌వలు

పంప‌కాల్లో తేడాలు.. వైసీపీలో గొడ‌వలు

   13 hours ago


పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.. ఇదీ ఏపీలో ఉద్యోగుల పరిస్థితి!

పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.. ఇదీ ఏపీలో ఉద్యోగుల పరిస్థితి!

   13 hours ago


తెలంగాణ‌లో ఎంత మంది మంత్రి ప‌ద‌వులు ఊడ‌తాయో..!

తెలంగాణ‌లో ఎంత మంది మంత్రి ప‌ద‌వులు ఊడ‌తాయో..!

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle