newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

06-04-202006-04-2020 21:21:30 IST
Updated On 07-04-2020 08:50:42 ISTUpdated On 07-04-20202020-04-06T15:51:30.834Z06-04-2020 2020-04-06T15:51:26.398Z - 2020-04-07T03:20:42.762Z - 07-04-2020

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈనెల 15 వరకూ కొనసాగుతున్న కరోనా లాక్ డౌన్ కొనసాగిస్తేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీయార్. పారిశుద్ధ్య సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు. సఫాయన్నా.. సలాం అన్నా అన్నారు కేసీయార్. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, అంతా స్వీయనియంత్రణ పాటించాలన్నారు. రాష్ట్రంలో సోమవారం నాటికి 364 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణపై ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష చేపట్టిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. లాక్‌డౌన్, స్వీయ నియంత్రణ వల్లే మనం బయట పడగలిగాం. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) సర్వే ప్రకారం దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగించడం తప్ప మరో మార్గంలేదు. కరోనా వైరస్‌ కట్టడికి కేంద్రం, ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెప్పిన పద్ధతులను అనుసరిస్తున్నాం. లాక్‌డౌన్‌ అమలుతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలిగామన్నారు. 

కరోనా వైరస్‌ మానవజాతికి వచ్చిన అతిపెద్ద సంక్షోభమని, దీనినుంచి బయటపడాల్సి వుందన్నారు. మనలాంటి  ఎక్కువ జనాభా గల దేశంలో లాక్‌డౌన్‌ విధించడం తప్ప మరో గత్యంతరంలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరతానని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నందున ఏప్రిల్‌ 15 తరువాత కూడా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కోరతా అన్నారు. ఒకవేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌  ఎత్తివేసినా.. తెలంగాణలో మాత్రం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.

తెలంగాణలో లాక్‌డౌన్‌కు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని, దీనిని శిక్షగా మాత్రం భావించవద్దన్నారు. మార్చి 15 నుంచి తెలంగాణ ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. ‘రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,937 మందిని క్వారెంటైన్‌లో ఉంచాం. నిజాముద్దీన్‌ ఘటనతో కలిపి 364 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జ్‌, 11 మంది చనిపోయారు. గాంధీ ఆస్పత్రిలో 308 మంది చికిత్సలో ఉన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్‌ మత  ప్రార్థనలకు వెళ్లిన 1089 మందిని  గుర్తించాం. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి పాజిటివ్ వచ్చింది. వారి కుటుంబ సభ్యులు 92 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో మరో 100 కేసులు పెరిగే అవకాశం ఉంది. పీపీఏలు విరివిగా వున్నాయన్నారు. 

కరోనా వైరస్ వ్యాపించకుండా కట్టుదిట్టమయిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆస్పత్రుల్లో స్వీపర్ నుంచి డాక్టర్ వరకు చేతులెత్తి నమస్కరిస్తున్నా మీరే మాకు కనిపించే దేవుళ్ళన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక బహుమతిగా అందరికీ ప్రత్యేక అలవెన్స్ అందిస్తామన్నారు. వైద్య సిబ్బందికి 10 శాతం అదనపు జీతం. 95,392 మంది పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి జీతం. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పారిశుద్ధ్య కార్మికులకు 7,500 అదనంగా ఇస్తాం. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు రూ.5వేలు ఇస్తామన్నారు.

ఈ కష్టకాలంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన మీడియా దుర్మార్గంగా వుందని కొన్ని పత్రికలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రధానమంత్రి దీపాలు వెలిగించాలంటే పిచ్చి కామెంట్లు చేశారని, ప్రధాని ఓ వ్యక్తి కాదు వ్యవస్థ అన్నారు. అందరిలో సంఘీభావం పెంచేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తారని, దానిని కూడా విమర్శించడం దుర్మార్గం అన్నారు కేసీయార్. అలాంటి వారి అవసరం మనకు లేదన్నారు. సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీయార్.  ఇలాంటి కష్టకాలంలో పిచ్చిరాతలు రాసే మీడియాపై కఠిన చర్యలు తీసుకుంటా అన్నారు. తప్పుడు వార్తలు రాసే వారికి కరోనా తగలాలని శాపం పెడుతున్నా. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలి.. ప్రభుత్వం దగ్గర ప్రతి రికార్డు ఉంటుంది. సమయం వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం. లాక్‌డౌన్ కొనసాగించాలని ప్రధానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   13 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   17 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   20 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle