లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం
27-05-202027-05-2020 08:22:28 IST
Updated On 27-05-2020 09:41:12 ISTUpdated On 27-05-20202020-05-27T02:52:28.367Z27-05-2020 2020-05-27T02:52:19.604Z - 2020-05-27T04:11:12.041Z - 27-05-2020

కరోనా వైరస్ వ్యాపించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతనాలుగు దఫాలుగా లాక్ డౌన్ అమలుచేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ గడువు ఈ నెల 31న ముగియనుంది. ప్రస్తుతం పాక్షిక లాక్డౌన్ కొనసాగుతుండగా జూన్ 1 నుంచి మరిన్ని ఆంక్షలు సడలించాలనే యోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ ఆంక్షల అమలు, వానాకాలంలో నియంత్రిత సాగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాల చెల్లింపు వంటి పలు కీలక అంశాలపై చర్చిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ సడలింపులు కొనసాగుతున్నాయి. ఈ నెల 18న జరిగిన కేబినెట్ భేటీలో లాక్డౌన్ నిబంధనలను భారీగా సడలించారు. అంతేకాకుండా కరోనా వ్యాప్తి ఎక్కువగా వున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మినహా మిగతా అన్నిచోట్ల సాధారణ పరిస్థితులు వున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ మాత్రం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తు తం సరి–బేసి విధానంలో దుకాణా లను తెరుస్తున్నారు. ఈ పద్ధతిని మరి కొంతకాలం కొనసాగించాలా లేక, పూర్తిస్థాయిలో అనుమతివ్వాలా అనేదానిపై ఒక నిర్ణయానికి రానున్నారు. ప్రస్తుతం భౌతికదూరం నిబంధనలతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుసర్వీసులు, ప్రత్యేక రైళ్లు, దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మరోవైపు జీహెచ్ఎంసీతో పాటు అన్నిచోట్లా వంద శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం గతంలోనే అనుమతించింది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, కొన్ని ఆంక్షలతో ఆర్టీసీ బస్సులు నడపాలని భావిస్తోంది. షాపుల విషయంలో నిబంధనలు ఎలావున్నా ప్రార్థన మందిరాలు, సమావేశాలు, ఉత్సవాలు, హోటళ్లు, సినిమా థియేటర్లు, బార్లు, పబ్బులు, క్లబ్బులు, స్టేడియాలు తదితరాలపై ఆంక్షలు కొనసాగించే అవకాశముంది. అయితే జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆంక్షల విషయమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. జూన్ 2న జరగాల్సిన రాష్ట్ర అవరతణ వేడుకలను నిర్వహించాల్సిన తీరుపై సమావేశంలో కేసీయార్ నిర్ణయం వెలువరించనున్నారు. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి ప్రభుత్వోద్యోగులకు సగం వేతనాలే ఇచ్చారు. అయితే మే నెలకు సంబంధించి మాత్రం పూర్తి వేతనం చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆంక్షల సడలింపుతో ఖజానాకు వస్తున్న రాబడి తదితరాలను మరోమారు సమీక్షించనున్నారు. మేనెల వేతనాలు పూర్తిగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ ప్రభావం తెలంగాణ ఉద్యోగులపై పడింది.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
11 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
15 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
12 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
14 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
19 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
18 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
21 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
17 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
a day ago
ఇంకా