newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్‌డౌన్ సడలింపుపై ఐఏపీఎస్ఎం వార్నింగ్.. నేడే తెలంగాణ నిర్ణయం

05-05-202005-05-2020 12:04:40 IST
Updated On 05-05-2020 12:46:26 ISTUpdated On 05-05-20202020-05-05T06:34:40.207Z05-05-2020 2020-05-05T06:34:36.801Z - 2020-05-05T07:16:26.261Z - 05-05-2020

లాక్‌డౌన్ సడలింపుపై ఐఏపీఎస్ఎం వార్నింగ్.. నేడే తెలంగాణ నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ ఎత్తివేశాక ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌ (ఐఏపీఎస్‌ఎం) ఇటీవల తయారుచేసిన ఒక నివేదిక తెలంగాణ ప్రభుత్వాన్ని డైలెమ్మాలో పడేసింది. లాక్ డౌన్ పేరుతో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తు పరిణామాలు దారుణంగా ఉంటాయని ఐఏపీఎస్‌ఎం హెచ్చరించింది. దీంతో సడలింపులిచ్చి లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశాలపై చర్చిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా, సడలింపులిచ్చినా ఏం చేయాలనే దానిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన ఈ నివేదికను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అధ్యయనం చేసి ఆ నివేదికలోని కొన్ని సీరియస్ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఇప్పటికే తమ అభిప్రాయాలు పంపించారు కూడా.

కరోనా నివారణకు వ్యాక్సిన్, మందు ల్లేవు. దాన్ని కట్టడి చేయడం ఒక్కటే మార్గం. అందుకే ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలవుతోంది. అయితే అదొక్కటే పరిష్కారం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. లాక్‌డౌన్‌తో సాధారణ జనజీవనం స్తంభించింది. ఉపాధి అవకాశాల్లేక బతుకుదెరువు ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంపైనా, కొన్ని సడలింపులిచ్చి కొనసాగించడంపైనా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తోంది.

ఐఏపీఎస్‌ఎం నివేదికలో పేర్కొన్న ప్రకారం.. ‘ప్రజల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ (జనబాహుళ్యం మొత్తానికి రోగ నిరోధక శక్తి) పెరగాలంటే 60% మందికి వైరస్‌ వ్యాప్తి చెందాలి. అప్పుడే వైరస్‌ తీవ్రత తగ్గి నెమ్మదిస్తుంది. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుతుంది. అయితే లాక్‌డౌన్‌ సడలింపుల్లో పరిమితులు విధించకపోతే అందరికీ వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ఫలితంగా పెద్దసంఖ్యలో మరణాలు సంభవిస్తాయి. బ్రిటన్‌ అటువంటి తప్పుచేసి నష్టపోయింది. కరోనా వైరస్‌ తక్కువ వయసుగల వారికి సోకితే పెద్ద ప్రమాదం లేదు. వారికి అది తేలికపాటి వ్యాధిలాంటిదే. కానీ 60 ఏళ్లకు మించిన వారికి సోకితే మరణాలు సంభవిస్తాయి.

యువకులు వైరస్‌కు గురైతేనే మొత్తం జనాభాలో సామూహిక రోగనిరోధక శక్తి క్రమంగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాక, కరోనాను పారద్రోలాలంటే పరిమిత సడలింపులతో పాటు కేసుల స్క్రీనింగ్, నిర్వహణ కోసం బలమైన ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. వచ్చే శీతాకాలంలో కరోనా కేసులు మరింత పెరగొచ్చు. కాబట్టి తగిన ప్రణాళిక, సంసిద్ధత అవసరం. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలి. రాబోయే రోజుల్లో కరోనా కేసులను సమర్థవంతంగా ఎదుర్కోడానికి పీపీఈ, డయాగ్నస్టిక్‌ కిట్లు, వెంటిలేటర్లను ఎక్కువగా ఉత్పత్తి చేయాలి’. 

వైరస్‌ కట్టడికి సమగ్ర వ్యూహం అవసరం

లాక్‌డౌన్‌ ఎత్తివేతకు వ్యూహాల గురించి పై నివేదికలో వివరంగా పేర్కొన్నారు. దానిప్రకారం.. ఇప్పటికే ఉన్న ఆసుపత్రులు, కొత్త ఆసుపత్రుల్లో కరోనా కేసుల నిర్వహణ సామర్థ్యాన్ని విస్తరించాలి. అంటువ్యాధుల పెరుగుదలను నివారించడానికి వైరస్‌ వ్యాప్తి వేగాన్ని తగ్గించాలి. వైద్య సిబ్బందిపై అధిక భారాన్ని తగ్గించాలి. వారిని కాపాడుకోవాలి. వైరస్‌ సామాజిక వ్యాప్తిని నిరోధించేందుకు కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలి. ప్రజల సాధారణ ఆరోగ్య అవసరాలను ఏకకాలంలో తీర్చాలి. అవసరమైన వస్తువుల తయారీ, జీవనోపాధి కల్పన, ఆర్థిక వ్యవస్థను క్రమంగా పునరుద్ధరించడం చేయాలి.

లాక్‌డౌన్‌ ఎత్తివేశాక లేదా సడలింపులిచ్చాక ఏం చేయాలనే దానిపై కొన్ని సాధారణ ప్రొటోకాల్స్‌ను నివేదిక ప్రస్తావించింది. వీటిప్రకారం.. వైరస్‌ లింక్‌ను విచ్ఛిన్నం చేయడానికి భౌతికదూరం పాటించడం తప్పనిసరి. భౌతికదూరం కనీసం రెండు మీటర్లు ఉండాలి. భౌతికదూరాన్ని మార్కెట్‌ ప్రదేశాలు, కిరాణా దుకాణాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యుత్‌ బిల్లు కౌంటర్లు, పోస్టాఫీసులు తదితర చోట్ల అమలుచేయాలి. వైరస్‌ వ్యాప్తి జరగకుండా చూసేందుకు ఫేస్‌మాస్క్‌ తప్పనిసరి. దీన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలి. 60ఏళ్లు పైబడిన, అలాగే ఇతరత్రా వ్యాధులున్న 50ఏళ్లు పైబడిన వారికి వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువ. వీరు ఇంటి నుంచే పనిచేయాలి. వీరి సంఖ్యను లెక్కించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రమం తప్పకుండా పరీక్షించాలి. పార్కులు, సమావేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్రీడ, సంగీత ప్రదర్శనలు పూర్తిగా నిషేధించాలి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత 60రోజులు లేదా వైరస్‌ మహమ్మారి తగ్గే వరకు వీటిని అనుమతించకూడదు.

అత్యవసర సేవల విషయంలో జిల్లా కలెక్టర్‌ 90రోజుల పాటు పాస్‌లు జారీచేయాలి. ప్రజారవాణా సదుపాయం కల్పించాలి. భౌతికదూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించే ప్రయాణించాలి. సీటింగ్‌ సామర్థ్యం మించకూడదు. పరిస్థితి తీవ్రంగా ఉన్నచోట ప్రజా రవాణా వాహనాల్లో సీటుకు ఒకరిని మాత్రమే అనుమతించాలి. అవసరమైన వస్తువుల కోసం ఆన్‌లైన్‌ షాపింగ్‌ను అనుమతించవచ్చు. ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో లాక్‌డౌన్‌ సమయంలో మాదిరిగానే చర్యలు చేపట్టాలి. జనాన్ని బయటకు రానివ్వకుండా చూడాలి. వివాహాలు, అంత్యక్రియలకు 20మందికి మాత్రమే అనుమతివ్వాలి. అలాంటి సందర్భాలలో సమీప బంధువులు హాజరుకావచ్చు.

ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు 50శాతం రోస్టర్‌తో పనిచేయాలి. వారానికి ఐదు రోజుల పని విధానం అమలుచేయొచ్చు. ప్రైవేటు ఆఫీసుల్లో షిఫ్ట్‌కు 70శాతం ఉద్యోగులనే అనుమతించాలి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువుంటే ఈ సంఖ్యను 50 నుంచి 20 శాతానికి తగ్గించాలి. ఆఫీసుల్లో హ్యాండ్‌ వాషింగ్‌ సౌకర్యం, హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. సాధారణ పరిస్థితి వచ్చే వరకు అంతర్జాతీయ, రాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజల కదలికలపై పరిమితి విధించాలి. అంతర్జాతీయ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించిన తరువాత.. ఏదైనా మార్గం ద్వారా ఎక్కడి నుంచైనా వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు జాతీయ మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్‌కు వెళ్లాలి. పరిస్థితిని బట్టి 30 నుంచి 90 రోజుల వరకు ఈ నిబంధనలు కొనసాగించాలి. ఆపై వైరస్‌ వ్యాప్తి తీవ్రతను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి.  

ఐఏపీఎస్‌ఎం నివేదికలోని అంశాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సడలింపులిచ్చి లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle