లాక్‌డౌన్‌తో కరోనాను అడ్డుకోవచ్చా..? వుహాన్ అనుభవం ఏం చెబుతోంది ?
23-03-202023-03-2020 11:28:07 IST
Updated On 23-03-2020 14:24:30 ISTUpdated On 23-03-20202020-03-23T05:58:07.462Z23-03-2020 2020-03-23T05:58:05.334Z - 2020-03-23T08:54:30.586Z - 23-03-2020

ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టింది చైనాలోని వుహాన్ నగరంలో. కరోనా వైరస్ కారణంగా చైనాలోని మొత్తం నగరాల్లో కంటే ఈ నగరంలో ఎక్కువ మరణాలు సంభవించాయి. వుహాన్ నుంచి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. కరోనా కారణంగా ఇక్కడ బీతావహ వాతావరణం నెలకొంది. అయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వుహాన్ నగరంలో మాత్రం తగ్గుముఖం పట్టింది. అక్కడ కొన్ని రోజులుగా పాజిటీవ్ కేసులు నమోదు కావడం లేదు. ఇందుకు వుహాన్‌లో చైనా తీసుకున్న కఠిన చర్యలే కారణం. ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఇటలీ, ఇరాన్, జెర్మనీ, స్పెయిన్, రష్యా వంటి దేశాలు ఇప్పుడు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికే ఈ చర్యలు తీసుకుంటున్నారు. మన దేశంలోనూ కరోనా పాజిటీవ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంకా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వాలు కూడా లాక్డౌన్ ప్రకటించాయి. ఈ లాక్డౌన్ ద్వారా ప్రజలకు కొంత ఇబ్బంది కలగవచ్చు కానీ కరోనా వంటి మహమ్మారి వల్ల భారీ ప్రమాదం నుంచి సమాజాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. వుహాన్ అనుభవం ఇదే చెబుతోంది. కరోనా వైరస్ పుట్టిన వుహాన్ నగరంలో మొదటి లాక్డౌన్ విధించాలని చైనా భావించినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారనే అభిప్రాయాలు వచ్చాయి. ప్రజలపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తోందనే మాటలు వినిపించాయి. కానీ, తర్వాత ఈ కఠిన ఆంక్షలే వుహాన్‌లో కరోనాను కట్టడి చేశాయి. ఇప్పుడు ప్రపంచమంతా అవలంభిస్తున్న లాక్డౌన్ విధానాన్ని చైనా ముందు వుహాన్‌లో అమలు చేసి కరోనా వ్యప్తిని నివారించగలిగింది. సుమారు ఒక కోటి 10 లక్షల జనాభా కలిగిన ఈ నగరాన్ని పూర్తిగా స్తంభింపజేసి కరోనాను అరికట్టింది. మొదట వుహాన్‌లో లాక్డౌన్ ప్రకటించిన గంటల్లోనే ప్రజారవణా మొత్తం నిలిపి వేశారు. ప్రైవేటు వాహనలను కూడా బయటకు అనుమతించలేదు. నిత్యావసరాలు, మెడికల్ దుకాణాలు తప్ప మిగతావన్నీ మూసివేశారు. అప్పటికే సెలవుల్లో ఉన్న విద్యాసంస్థలను పూర్తిగా మూసివేశారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. నిత్యావసర వస్తువులు కొనడానికి మాత్రం ప్రతీ ఇంటి నుంచి రెండు రోజులకు ఒకరిని మాత్రమే బయటకు అనుమతించారు. కొరియర్ల ద్వారా కావాల్సినవి తెప్పించుకునే అవకాశం మాత్రమే ఇచ్చారు. తర్వాత అధికారులు మొత్తం ఇంటింటికీ తిరిగి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా, కరోనా లక్షణాలు ఉన్నాయా అని పరిశీలించారు. ఎవరైనా అనుమానితులు ఉంటే వెంటనే ఐసొలేషన్‌కు తరలించారు. వుహాన్‌లో కరోనా విజృంభణ, కఠిన నిబంధనలతో వుహాన్‌కు చెందిన కొందరు ఇతర నగరాలకు వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని ఎక్కడికీ అనుమతించలేదు. ఇంతటి కఠినమైన నిబంధనలను అమలు చేయడం ద్వారా ఇప్పుడు వుహాన్‌లో కొత్తగా పాజిటీవ్ కేసులు నమోదు కావడం లేదు. అయినా కొన్ని ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోంది. వైరస్ మళ్లీ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జనవరి 23న వుహాన్‌లో లాక్డౌన్ ప్రకటించగా ఇప్పుడిప్పుడే ప్రజలను తమ పనులకు అనుమతిస్తున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 31 వరకు ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలని కోరుతున్నాయి. ప్రజలకు నిత్యావసరాలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినా ఆంక్షలు ప్రజలకు ఇబ్బంది కలిగించవచ్చు. వ్యాపారులకు నష్టం చేయవచ్చు. కానీ, కరోనా వంటి మహమ్మారిని ఎదురుకోవాలంటే ఇలాంటి ఆంక్షలు తప్పవని వుహాన్ నగరాన్ని చూస్తేనే అర్థం అవుతోంది. కాకపోతే వుహాన్‌లో పూర్తి వైరస్ విజృంభించిన తర్వాత ఆంక్షలు పెట్టారు. మన ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా లాక్డౌన్ ప్రకటించి, కరోనాను ఆదిలోనే సమర్థంగా ఎదురుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
10 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
14 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
11 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
15 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
13 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
18 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
17 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
20 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
16 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
21 hours ago
ఇంకా