newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రోజుకు 23 వేల టెస్టులు.. సెప్టెంబర్ ‌కల్లా తెలంగాణలో కరోనా ఉండదు

09-08-202009-08-2020 09:07:59 IST
2020-08-09T03:37:59.350Z09-08-2020 2020-08-09T03:37:55.371Z - - 14-04-2021

రోజుకు 23 వేల టెస్టులు.. సెప్టెంబర్ ‌కల్లా తెలంగాణలో కరోనా ఉండదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో రోజుకు 23వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కేసు ల సంఖ్య రోజు రోజుకి తగ్గుతుందని చెప్పారు. నెలాఖరుకు నగరంలో కేసులు చాలా తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ చివరికి తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను కేటాయించిదని గుర్తు  చేశారు.

కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను  బేఖాతరు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు.  ఇప్పటి వరకు దాదాపు 1039 ఫిర్యాదులు వచ్చాయన్నారు.  వాటిలో 130కి పైగా బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఇన్యూరెన్స్‌కు సంబంధించి 16 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఆస్పత్రలన్నింటికి కౌన్సిలింగ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులను మూసివేడం తమ ఉద్ధేశ్యం కాదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

కాగా, . రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 150 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  అందులో ప్రస్తుతం 91 ఆసుపత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయి.  మరిన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులలో కరోనా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసిన ఈ వైరస్‌తో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. ఇలా అందరిపైనా దాడి చేస్తోంది. ఇలాంటి తరుణంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు ఒకింత శుభవార్త చెప్పారు.

‘తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ధైర్యమే కరోనాకు మందు. సెప్టెంబరు ఆఖరు నాటికి తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో కనుమరుగవుతుంది. ఈ నెలాఖరుకల్లా హైదరాబాద్‌లో కేసులు చాలా వరకు తగ్గుతాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని శ్రీనివాసరావు చెప్పారు.  

తెలంగాణలో పాజిటవ్ కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 5శాతం పాజిటివ్‌ రేటు నమోదవుతోంది. ప్రభుత్వం తాజాగా కోవిడ్-19 నివారణ చర్యలకు రూ. 100 కోట్లు కేటాయించింది. కరోనా రెండు వారాలు మాత్రమే ఉండే జబ్బు. 11వందల సెంటర్స్‌లో రోజుకు 20వేలకు పైగా టెస్టులు చేస్తున్నాం. పాజిటివ్‌ వచ్చిన వారికి వెంటనే హోం ఐసోలేషన్ కిట్ ఇస్తున్నాం. కోవిడ్ కేర్ సెంటర్స్ ద్వారా హోం ఐసోలేషన్ రోగులను మానిటరింగ్ చేస్తున్నాం’ అని శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.

‘ప్రస్తుతం 10వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయి. మెత్తం 18వేల పడకలకు ఆక్సిజన్ అందుబాటులో ఉంది. ఔట్ సోర్సింగ్ నర్సింగ్, డాక్టర్లను విధుల్లోకి తీసుకున్నాం. కొంతవరకే ప్లాస్మా ఉపయోగపడుతోంది. క్రిటికల్ రోగులకు ప్లాస్మాతో ప్రయోజనం ఉండదు. కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చిన వారిలో యాంటీబాడీస్ డెవలప్ కావు. పాజిటివ్‌ వచ్చిన వారు హైదరాబాదు రావాల్సిన అవసరం లేదు. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించాం’ అని తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle