newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రోగుల కష్టాలు చూడండి.. గవర్నర్ తమిళిసై.. కట్టడిలోనే కరోనా.. కేసీఆర్

21-07-202021-07-2020 07:10:01 IST
Updated On 21-07-2020 10:41:29 ISTUpdated On 21-07-20202020-07-21T01:40:01.774Z21-07-2020 2020-07-21T01:39:59.532Z - 2020-07-21T05:11:29.090Z - 21-07-2020

రోగుల కష్టాలు చూడండి.. గవర్నర్ తమిళిసై.. కట్టడిలోనే కరోనా.. కేసీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ కష్టాలు పడుతున్నారని, విస్తృత రీతిలో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరినట్లు సమాచారం. మొబైల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందిపడే వారికి ఇళ్ల వద్దే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించినట్టు తెలిసింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో సుమారు గంటన్నర పాటు సమావేశమైన సందర్భంగా రాష్ట్రంలో కరోనా రోగుల వ్యథల పట్ల గవర్నర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదైనా ప్రాంతంలో గణనీయ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడితే ఆ ప్రాంతం పరిధిలోని ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించాలని గవర్నర్‌ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. 

అలాగే, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీ, బెడ్ల కృత్రిమ కొరతపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో కమిటీ వేసి ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై‌ కోరినట్టు తెలిసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత, వినియోగం, ఖాళీ బెడ్ల సంఖ్యను ఎప్పటికప్పుడు రోగులు తెలుసుకునేలా పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని గవర్నర్‌ కోరినట్టు తెలిసింది.   

కరోనా చికిత్సలో ప్లాస్మాథెరపీ కీలక భూమిక పోషిస్తుందని, ప్రతి ఆస్పత్రిలో ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేసి, ప్లాస్మా దాతలకు ప్రోత్సాహకాలు అందించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. ఈఎస్ఐలో ర్యాపిడ్‌ పరీక్షల యంత్రాన్ని సమకూర్చాలని తాను చేసిన విజ్ఞప్తికి కేంద్ర కార్మికశాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు గవర్నర్‌ చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా పౌరులు తన దృష్టికి  తెచ్చిన పలు అంశాలను సీఎంకు గవర్నర్‌ వివరించారు. 

ఎంతమందికైనా చికిత్సకు సిద్ధం.. కట్టడిలోనే కరోనా.. కేసీఆర్ 

రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచామని సీఎం కేసీఆర్‌ గవర్నర్‌తో చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్స బాగా జరుగుతున్నదని, సీరియస్‌గా ఉన్నవారిని ఆస్పత్రుల్లో ఉంచి, చికిత్స అందిస్తున్నామని, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని హోమ్‌ క్వారంటైన్‌కు పంపించి.. నిరంతరం నిఘా పెడుతున్నామన్నారు. కరోనా రోగులకు ఆస్పత్రుల్లో ఏ ఇబ్బందుల్లేవని, ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ప్రభుత్వాస్పత్రుల్లో ఎంతమందికైనా చికిత్స అందించేందుకు సంసిద్ధతతో ఉన్నామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి నియంత్రణలోనే ఉన్నాయని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన చికిత్స అందిస్తున్నామని, కొందరు చేస్తున్న దుష్ప్రచారం వల్ల ప్రజలు హైరానాపడి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్ప త్రుల చుట్టూ తిరుగుతున్నారని ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది. 

1,200 మంది పీజీ వైద్యులతో పాటు 200 మంది పీహెచ్‌సీ వైద్యులను నియమించి ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేయనున్నామని గవర్నర్‌కు నివేదించారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle