newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రైళ్ళ కూత ఎప్పుడంటే? బస్సు ప్రయాణాలపై తర్జనభర్జన

10-05-202010-05-2020 17:55:40 IST
Updated On 10-05-2020 19:05:09 ISTUpdated On 10-05-20202020-05-10T12:25:40.021Z10-05-2020 2020-05-10T12:20:31.404Z - 2020-05-10T13:35:09.246Z - 10-05-2020

రైళ్ళ కూత ఎప్పుడంటే? బస్సు ప్రయాణాలపై తర్జనభర్జన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా దేశంలో ప్రజారవాణా, రైళ్ళు, విమాన సర్వీసులు అన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఒకచోటి నుంచి మరోచోటికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దేశంలో వివిధ ప్రాంతాలకు ఆహారధాన్యాలు, నిత్యావసరాలు మాత్రం గూడ్స్ రైళ్ళద్వారా సరఫరా అవుతున్నాయి. ఈమధ్యకాలంలో వలస కార్మికుల కోసం మాత్రం శ్రామిక్ రైళ్ళు తిరుగుతున్నాయి. తాజాగా రైల్వేశాఖ ఒక సమాచారం వచ్చింది. 

జూన్ తొలివారం నుంచి ప్రజా రవాణాను పునరుద్దరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ పరిస్థితుల్లో ప్రజా రవాణాను ప్రారంభించడం అంత మంచిది కాదని, దీనిపై పునరాలోచన చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కానీ దేశంలో గ్రీన్ జోన్ల సంఖ్య పెరుగుతుండటంతో జూన్ నుంచి ప్రజా రవాణా సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. అయితే మునుపటిలా కాకుండా కరోనా నేపథ్యంలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ, పలు మార్పులు చేర్పులు చేసి మొదలుపెట్టాలని చూస్తున్నారు.

మరోవైపు రైల్వే శాఖ విషయంలోనూ కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నెల 17తో లాక్ డౌన్ ముగుస్తుండటంతో.. ఆ రోజు ప్రజా రవాణా సర్వీసులపై సమీక్ష జరపాలని చూస్తున్నారు. ప్రధాని మోదీ సమావేశం తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే గత వారంరోజులుగా కరోనా తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు. ఇటు తెలంగాణాలో కూడా గ్రీన్ జోన్లు పెరుగుతున్నా.. ఆర్టీసీ బస్సులను నడిపే విషయంపై మాత్రం కేసీఆర్ సర్కార్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జనసాంద్రత ఎక్కువగా ఉండే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు ఇంకా రెడ్ జోన్లలోనే ఉన్నాయి. వీటితో అనుసంధానం లేకుండా బస్సులు నడపడం చాలా కష్టమని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.

ముఖ్యంగా హైటెక్ సిటీ, సికింద్రాబాద్, ఎల్ బినగర్-పటన్ చెరు, మెహిదీపట్నం, మియాపూర్ రూట్లో బస్సులు తిరగాల్సి వుంటుంది. ఇందులో రెడ్ జోన్లు ఎక్కువగా వున్నాయి. ఎక్కువ మంది ప్రయాణీకులు హైదరాబాద్- ఉమ్మడి రంగారెడ్డిజిల్లాల మధ్యే రాకపోకలు సాగిస్తారు. ఇక హైదరాబాద్ ఇప్పట్లో గ్రీన్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశాలు లేవు.

అంతేకాకుండా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు అన్నీ కూడా పక్కపక్కనే ఉండటంతో ఇలాంటి పరిస్థితుల్లో బస్సులకు అనుమతిస్తే ఖచ్చితంగా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇవే కాదు బస్సులలోనూ భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. ఒక్కో బస్సులో సిట్టింగే కానీ, స్టాండింగ్ అవకాశం ఉండకూడదంటున్నారు. ప్రయాణికుల రద్దీ వుంటే ఈ నిబంధనలు పాటించడం కష్టం. ఈ నేపథ్యంలో ప్రజారవాణా ప్రారంభం కావడం అంతా ఆషామాషీ కాదంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle