newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రైళ్ళు తిరగవు.. విమానాలు రావు..జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్

21-03-202021-03-2020 13:54:46 IST
Updated On 21-03-2020 18:17:15 ISTUpdated On 21-03-20202020-03-21T08:24:46.305Z21-03-2020 2020-03-21T08:24:40.014Z - 2020-03-21T12:47:15.676Z - 21-03-2020

రైళ్ళు తిరగవు.. విమానాలు రావు..జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు చర్యలు చేపట్టాయి. దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ఆదివారం రైళ్ళ రాకపోకలను నిలిపివేయనున్నారు. రైల్వే సీపీఆర్వో రాకేష్ పలు అంశాలను వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ట్రైన్స్   ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాత మాత్రమే స్టేషన్ లోకి అనుమతిస్తున్నారు.  థర్మల్ స్క్రీనింగ్ మరియు సానిటైజర్ కోసం ప్రయాణికులు ఎండను సైతం లెక్కచేయకుండా లైన్లో నిలబడుతున్నారు. భారతీయ రైల్వే చరిత్రలో మొదటి సారి దేశవ్యాప్తంగా రైళ్ళు ఆగిపోబోతున్నాయన్నారు సీపీఆర్వో రాకేష్.

శనివారం అర్దరాత్రి నుంచి రేపు అర్దరాత్రి వరకు రైల్లు నడపడం లేదన్నారు. లాంగ్ డిస్టెన్స్ ఉన్న కొన్ని ట్రైన్ లు మాత్రమే నడుస్తాయని, హైదరాబాద్ లో 72 ఎంఎంటీఎస్ లకు గాను10ట్రైన్ లు నడుస్తాయన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో  రోజూ నడుస్తున్న 750ట్రైన్ లలో రేపు 15నుంచి 20 వరకు లాంగ్ డిస్టెన్స్ ఉన్నవి నడుస్తాయని మిగతావి ఆగిపోతాయన్నారు. రైల్వే స్టేషన్లలో లో థర్మల్ స్కీనింగ్ ఏర్పాటు చేసినప్పటికీ ఈ రోజు ముగ్గురు కరోనా అనుమానితులు రాజధాని ,కృష్ణా ట్రైన్ లలో ప్రయాణించారన్నారు. 

రైల్వే అధికారులు వారిని గుర్తించి ఆంబులెన్స్ లో ఐసోలేషన్ వార్డు కు తరలించామన్నారు. కరోనాను నివారించాలంటే ప్రతీ ఓక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రైల్వే ఫంక్షనల్ కార్యకలాపాల్లో ఇబ్బంది ఉండకుండా మొత్తం సిబ్బందిలో సగం మంది ఉద్యోగులు విధుల్లో ఉంటారన్నారు సీపీఆర్వో రాకేష్.

మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో నిర్మాణుష్యంగా మారింది శంషాబాద్ ఎయిర్ పోర్ట్. ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ భయంతో ప్రయాణికులెవరు ఎయిర్ పోర్ట్ కు రాకపోవడంతో ఖాళీగా కనిపిస్తోంది. శనివారం ఉదయం నుండే అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు ఆధికారులు. అయితే అధికారికంగా 22వ తేదీ నుండి అంతర్జాతీయ విమానాలు నడపడం లేదన్నారు. కరోనా వైరస్ విజృంభించడంతో ఈ ఉదయం రావల్సిన అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఎయిర్ పోర్ట్ లో అసలు జనమే కనిపించడం లేదు. 

ప్రధాని పిలుపుమేరకు జనమంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకి రెడీ అయ్యారు. దేశ ప్రజలందరూ మార్చి 22 న, ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇళ్ళకే పరిమితం కానున్నారు. ఏమైనా తప్పని పరిస్థితుల్లో ఇళ్ళు వదిలి బయటకు వెళ్ళాల్సి వస్తే ఉదయం 7 గంటల లోపు మరియు రాత్రి 9 గంటల తర్వాత వెళ్ళేందుకు సిద్ధమయ్యారు.  12 గంటలు పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్ళకుండా దానంతట కరోనా వైరస్ మరణించేట్టు చేయగలిగితే 100 శాతం నిర్మూలించగలం. అందుకే 14 గంటల జనతా కర్ఫ్యూ ప్లాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఏ మందులూ పబ్లిక్ ప్లేసుల్లో పిచికారి చేయక్కర్లేదు, తుడవక్కర్లేదు... 14 గంటలు వదిలేస్తే దానంతట అదే మరణిస్తుంది. అందరూ సహకరిస్తే మనకు ఈ వైరస్ రాకుండా మనం మన పిల్లలని మన వృద్ధులని మన కుటుంబాలని మన సమాజాన్ని మన దేశాన్ని కాపాడుకోగలం. మర్చిపోకండి, ఎలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవద్దు. జనతా కర్ఫ్యూ ఈ ఆదివారం ఉదయం 7 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు, అంటే 14 గంటలు. సహకరిద్దాం, ఇది మన భవిష్యత్తు కోసమేనని గుర్తిద్దాం. 

 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle