newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సందడి

02-06-202002-06-2020 13:22:33 IST
Updated On 02-06-2020 16:29:03 ISTUpdated On 02-06-20202020-06-02T07:52:33.245Z02-06-2020 2020-06-02T07:36:02.965Z - 2020-06-02T10:59:03.891Z - 02-06-2020

రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సందడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ కారణంగా రైల్వే శాఖ అన్ని సర్వీసులను రద్దుచేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వలస కార్మికుల కోసం వందలాది శ్రామిక్ రైళ్ళను నడిపింది. తాజాగా సోమవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో రైల్వే రిజర్వేషన్లు, ప్రయాణాలు ప్రారంభం అయ్యాయి. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి 9 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఉదయం ఆరుగంటలకు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో భారీ క్యూలైన్‌ ఏర్పడింది. దేశవ్యాప్తంగా 100 రూట్లలో 200 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది. తొలి రోజు లక్షా 45వేల మంది ప్రయాణాలు చేయనున్నారు. ఆన్‌లైన్, రైల్వే బుకింగ్ కౌంటర్లలో రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాత టికెట్ ఉన్న వారికే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. ప్రతి ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించారు.

రైల్వే ప్రయాణాల కోసం విజయవాడలోబారులు తీరారు ప్రయాణికులు. దాదాపు రెండున్నర నెలల తర్వాత ప్రయాణికులతో కళకళలాడుతోంది  విజయవాడ రైల్వే స్టేషన్. నేటి నుంచి రైళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో  రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు ప్రయాణికులు. లాక్ డౌన్ కారణంగా తమ బంధువులకు, స్నేహితులకు దూరంగా వున్నవారు తగిన జాగ్రత్తలతో ప్రయాణాలు చేస్తున్నారు.

గతంలోలా కాకుండా రైలు బయలుదేరే సమయానికి గంటన్నర నుంచి రెండుగంటల ముందే  స్టేషన్‌కు చేరుకోవాలన్న నిబంధన మేరకు ముందే తరలివచ్చారు ప్రయాణికులు. వందల సంఖ్యలో వస్తున్న ప్రయాణికులతో రోడ్డు పైకి క్యూ వచ్చింది. స్టేషన్‌లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా నేలపై గుర్తులు వేశారు రైల్వే శాఖ సిబ్బంది. రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్న ప్రయాణికులకు పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపుతున్నారు అధికారులు. 

ప్రయాణానికి ముందే ఆయా రైల్వే బోగీలను శుభ్రం చేస్తున్నారు పారిశుద్ధ్య సిబ్బంది. ప్రయాణికులు తగిన జాగ్రత్తలతో ప్రయాణం చేయాలని, ప్రయాణికులకు ప్రయాణికులకు మధ్య భౌతిక దూరం వుండేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

కరోనా అనుమానితుల కోసం ఒక్కో రైల్లో 3 పీపీఈ కిట్లను ఉంచుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెగ్యులర్‌ ఛార్జీలతోనే టికెట్లు ఇస్తుండగా, జూన్‌ 29వ తేదీ నుంచి తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ మొదలవుతుంది. కాగా, హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ దేశరాజధానికి బయల్దేరింది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle