newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రైల్వేని నమ్ముకున్నాం.. పూట గడవడంలేదంటున్న కూలీలు

05-06-202005-06-2020 09:34:26 IST
Updated On 05-06-2020 10:37:24 ISTUpdated On 05-06-20202020-06-05T04:04:26.040Z05-06-2020 2020-06-05T04:04:17.424Z - 2020-06-05T05:07:24.259Z - 05-06-2020

రైల్వేని నమ్ముకున్నాం.. పూట గడవడంలేదంటున్న కూలీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దక్షిణ మధ్య రైల్వేలో కీలకమయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చరిత్ర లో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ఈ రైల్వే స్టేషన్ ను నమ్ముకొని బతుకుతున్న జీవితాలు దుర్బరమయ్యాయి...ఒక్కరయినా పిలవకపోతారా అని రైల్వే కూలీలు ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుల కారణంగా ప్రయాణికులు వస్తున్నా అంతగా తమకు కూలీ దొరకడం లేదంటున్నారు. అలాగే కస్టమర్లతో కిక్కిరిసి పోయే ఆల్ఫా హోటల్  సిబ్బంది,కస్టమర్ ల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది..స్టేషన్ ముందు ఉన్న చిరు వ్యాపారులు తమ షాపులో ప్రయాణికులు ఏమైనా  కొనకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అటు చిరు వ్యాపారుల నుంచి రైల్వే కూలీల వరకూ అందరి జీవితాలను తలకిందులు చేసింది కరోనా మహమ్మారి.

The Building - Picture of Alpha Hotel, Hyderabad - Tripadvisor

సికింద్రాబాద్ రైల్వే చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ కనిపించలేదు.  దేశ రైల్వే లో అత్యధిక ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైల్వే స్టేషన్ లలో సికింద్రాబాద్ ఒకటి. రోజూ లక్షల్లో ఈ స్టేషన్ నుంచి ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు..ఇప్పుడు మాత్రం వందల్లో ప్రయాణికులు వెళ్తున్నా స్టేషన్ రద్దీ గానే కనబడుతోంది. కారణం ఒకటి రెండు గంటల ముందే ప్రయాణికులు రైల్వే స్టేషన్ కు చేరుకోవాల్సి వస్తోంది. 

లాక్ డౌన్ కారణం గా రెండు నెలలుగా తమకు పనిలేదని రైల్వే కూలీలు, చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో పనిచేసే కూలీల దుస్థితి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రయాణికులు రైల్వే స్టేషన్ కు వస్తున్నా ఎవరి సామాన్లు వారే మోసుకుంటున్నారు తప్ప తమకు పని చెప్పడం లేదని ..చాలా మంది కరోనా ఎక్కడ వస్తుందోనని తమను దూరంగా ఉంచుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలంటున్నారు రైల్వే పోర్టర్లు. గతంలో రెండు వందల మంది పనిచేసే వారని ఇప్పుడు ఇరవై మంది పనిచేస్తున్నా రోజు రెండు ,మూడు వందలు కూడా రావట్లేదంటున్నారు నిత్యం రైల్వే కూలీపై ఆధారపడుతున్న మల్లయ్య. 

ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద ఆధారపడి జీవిస్తున్న వారిలో పార్కింగ్ ఎంప్లాయిస్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. .ఇన్ని రోజులు ప్రయాణికులు లేక ఎవరు తమ వాహనాలను పార్కింగ్ పెట్టలేదు..ఇప్పుడు కొంత మంది ప్రయాణికులు వస్తున్నా సొంత వాహనాల మీద రావట్లేదు. దీంతో పార్కింగ్ స్టాఫ్ కూడా ఉద్యోగానికి రావట్లేదంటుంన్నారు పార్కింగ్ ఎంప్లాయీ లక్ష్మి. దీంతో తమకు రోజు గడవడం కష్టంగా ఉందని, కాంట్రాక్టర్ కూడా ఇబ్బందులు పడుతున్నాడని ఆమె అంటున్నారు. 

వందల మంది ప్రయాణికులతో నిత్యం కళకళలాడే తమ షాపు లో ఉదయం నుంచి కూర్చున్నా కేవలం రెండు కవర్లు మినహా అమ్మింది ఏంలేదంటున్నారు షాపు యజమాని.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఉన్న షాప్ యజమానులు గతంలో రోజుకు పది వేల వరకు అమ్మేవారు. కానీ ఇప్పుడు వంద, రెండువందల మించి నడవట్లేదంటున్నారు షాప్ యజమాని శ్రీనివాస్. 

సికింద్రాబాద్ స్టేషన్ ముందు ఉన్న ఆల్ఫా హోటల్ అంటే తెలియని వారు ఉండరు. నగరానికి కొత్త గా ఎవరైనా వస్తే అడ్రస్ కోసం అల్ఫా హోటల్ పేరే చెప్తారు. మామూలు రోజుల్లో కనీసం మనిషి నిలబడేంత స్థలం కూడా ఉండదు ఈ హోటల్లో.  కానీ ఇప్పుడు కస్టమర్ ను చూద్దామన్నా ఎక్కడా కనిపించడం లేదు.. ఆల్ఫా హోటల్ చరిత్ర లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని. రైల్వే ప్రయాణికులు తగ్గడంతో తమ హోటల్ కు వచ్చే వారి సంఖ్య తగ్గిందంటున్నారు హోటల్ నిర్వాహకులు. కరోనానుంచి బయటపడి మళ్లీ సికింద్రాబాద్ స్టేషన్ ఎప్పుడు కళకళలాడుతుందోనని రైల్వే కూలీలు, చిన్నచితకా వ్యాపారం చేసే షాపు ఓనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   17 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle