newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

రైతు బంధు కోతకి మొదలైన ప్రయత్నాలు?

05-01-202005-01-2020 13:26:44 IST
2020-01-05T07:56:44.193Z05-01-2020 2020-01-05T07:56:31.017Z - - 15-08-2020

రైతు బంధు కోతకి మొదలైన ప్రయత్నాలు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం. ఇది తెరాస నేతలు చెప్పినా.. సీఎం కెసిఆర్ చెప్పకపోయినా ఈ పథకం మరెక్కడా లేదు. చివరికి కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్.. ఏపీలో జగన్ సర్కార్ రైతు భరోసా కూడా కేవలం రైతుకి మాత్రమే ఒక మొత్తాన్ని ఫిక్స్ చేశారు. ఆ రైతుకి ఎంత భూమి ఉన్నా ఆ ప్రభుత్వాలిచ్చేది ఒకే మొత్తం కాగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వంలో ఎకరాకు ఏడాదికి రెండు దఫాలుగా ఎనిమిది వేలు ఇచ్చినా కెసిఆర్ రెండో ప్రభుత్వంలో ఈ మొత్తాన్ని పదివేలకి పెంచారు. ఎకరాకు ఒక్కో విడతకి ఐదు వేలు చొప్పున రబీ, ఖరీఫ్ రెండు సీజన్లకు ఎకరాకు పదివేల రూపాయలు రైతులకి పెట్టుబడి సాయం చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. ఒక రైతు యాభై ఎకరాలు ఉన్నా సరే ఏడాదికి ఐదు లక్షలు చెల్లిస్తున్నారు.

కాగా, ప్రస్తుతం ఈ పథకంలో చెల్లింపులు జాప్యం జరుగుతుంది. ఇప్పటికీ ఇంకా తొలి విడత చెల్లింపులే చేయలేకపోతోంది ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణ ఆర్ధికపరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ చెల్లింపులను ఎకరాల వారీగా చెల్లిస్తుంది. ఉదాహరణకి రెండెకరాల లోపు రైతులకి ఒకసారి.. ఐదెకరాల లోపు మరోసారి.. పదెకరాల లోపు ఇంకోసారి ఇలా చెల్లింపులు చేస్తూ వస్తుంది.

కాగా ఈ మధ్యనే రాష్ట్రంలో పెంచిన మద్యం ధరల వలన ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఈ పథకానికి మళ్లించాలని సీఎం భావించారని కూడా కథనాలు వస్తున్నాయి. అయితే త్వరలో ఈ పథకంలో స్వల్ప మార్పులతో పాటు కోతలు విధించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలలో వినిపిస్తుంది. ముందుగా ఈ పథకంలో పదెకరాల భూమికి సీలింగ్ విధించనున్నట్లుగా చెప్తున్నారు.

అంటే పదెకరాల పైన ఎంత భూమి ఉన్నా ఆ రైతుకి పదెకరాలకి మాత్రమే రైతు బంధు చెల్లిస్తారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడి పనిచేసి ఎమ్మెల్సీగా ఉన్నా గుత్తా సుఖేందర్ సీఎంకు ఈ అభిప్రాయాన్ని చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు పట్టాలు ఉన్నా సాగులో లేని భూమికి కూడా సాయాన్ని నిలిపివేయనున్నట్లుగా తెలుస్తుంది. దీంతో కొంతమేర భారం తగ్గి నిజమైన రైతులకు సకాలంలో సాయం అందుతుందని అభిప్రాయపడుతున్నారు.

నిజానికి ఈ పథకంలో భూస్వాములు భూములు కౌలుకి కౌలు.. మరో వైపు రైతుబంధు డబ్బులు రెండు విధాలుగా లబ్ది పొందుతున్నారని వినిపించింది. మరికొందరు భూమి సాగులో లేకున్నా వందల ఎకరాలు పట్టాలు కలిగి ఉన్నారు. వాళ్ళు కూడా వ్యవసాయం చేయకున్నా సాయం నగదు ఆదాయంగా మారిందని విమర్శలు వినిపించాయి. వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని అసలైన రైతులకి సాయం ఆలస్యం కాకుండా త్వరలోనే ప్రభుత్వం చర్యలకు సిద్దమైనట్లుగా తెలుస్తుంది.

 

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

   29 minutes ago


ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

   13 hours ago


కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

   14 hours ago


 ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

   15 hours ago


కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

   16 hours ago


ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

   18 hours ago


కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

   18 hours ago


కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

   21 hours ago


కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   a day ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle