newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రైతులకు శుభవార్త... రైతుబంధుకి దరఖాస్తు చేసుకోలేదా?

11-06-202011-06-2020 14:58:41 IST
2020-06-11T09:28:41.536Z11-06-2020 2020-06-11T09:28:35.885Z - - 12-04-2021

రైతులకు శుభవార్త... రైతుబంధుకి దరఖాస్తు చేసుకోలేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో లక్షలాదిమంది రైతులకు చేయూతనిస్తోంది ప్రభుత్వం. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఈ రైతుబంధు పథకం వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రైతుబంధు పథకం ప్రయోజనాలు అందుకోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎంతో మందికి అండగా నిలుస్తున్న రైతుబంధు పథకం కోసం ఇప్పటి వరకు కొంత మంది రైతులు దరఖాస్తు చేసుకోలేదు. అలాంటి రైతులు దరఖాస్తు చేసుకోడానికి వ్యవసాయ శాఖ మరో అవకాశం కల్పించింది. 

ఈ ఏడాదే జనవరి నెలలో కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు, ఇంతకు ముందే పాస్ పుస్తకాల ఉండికూడా దరఖాస్తు చేసుకోనివారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నెల 13వ తేదీ లోగా రైతుబంధుకోసం రైతులు దరఖాస్తుచేసుకునే అవకాశం కల్పించింది. ఇంకెందుకు ఆలస్యం రైతు సోదరులారా మీరు వెంటనే రైతుబంధుకి దరఖాస్తు చేసుకోండి. మీ అర్హతల ఆధారంగా ఈ పథకం ద్వారా మీ చెక్కుల రూపంలో సాయం చేస్తుంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది. ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేస్తోంది. ఖరీఫ్, రబీ ఈ రెండు సీజన్లకుగాను ఎకరానికి రూ. 5000 చొప్పున రూ. 10,000లను రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు

ఏమేుం కావాలంటే....

రైతు బంధు కావాలంటే కొన్ని పత్రాలు మీదగ్గర అందుబాటులో వుండాలి, అవేంటంటే.. దరఖాస్తు ఫారంతో పాటు భూమి పట్టా పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్(సేవింగ్స్ అకౌంట్), ఎమ్మార్వో డిజిటల్ సంతకం చేసిన పేపర్ జోడించాలి. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది. ఈ సాయం ద్వారా రైతులు అప్పులు చేయాల్సిన అవసరం వుండదు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle