newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ళు

05-05-202005-05-2020 12:40:49 IST
Updated On 05-05-2020 12:57:30 ISTUpdated On 05-05-20202020-05-05T07:10:49.558Z05-05-2020 2020-05-05T07:10:32.297Z - 2020-05-05T07:27:30.369Z - 05-05-2020

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాపించకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. కరోనా లాక్ డౌన్ సందర్భంగా రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్దేశిత గ‌డువులోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. యాసంగి ధాన్యం కొనుగోలుపై మంత్రి అధికారులతో సమీక్ష జరిపారు. వరి పంటను సత్వరమే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. 

యాసంగి లో పండించిన పంట కొనుగోలు విషయంలో అనుసరించాల్సిన విధానంపై మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సింగరేణి అతిథిగృహంలో జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లాలో జరుగుతున్న ధాన్యం సేకరణపై ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, రైస్ మిల్ల‌ర్స్ తో చ‌ర్చించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీయార్ ఆదేశాల ప్రకారం రైతుల నుండి ప్రతి ధాన్యం గింజను  కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేయాల‌న్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం సాగు కోసం నీటి లభ్యత, నిరంతర విద్యుత్ అందించడంతో వరి ధాన్యం దిగుబడి మంచిర్యాల జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చిందని మంత్రి తెలిపారు. మొక్కజొన్న, ప్రత్తి పంటల దిగుబడి కూడా పెరిగిందన్నారు.

పంటల దిగుబడికి తగినట్లుగా పలు శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. మే నెల 31 వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాల‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు, నిలువ చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌న్నారు.  

పంట కొనుగోలుపై రైతులు ఎలాంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, పండిన ప్ర‌తి గింజను కొనుగోలు చేసే విధంగా ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంద‌ని స్ప‌ష్టం చేశారు.  మ‌రోవైపు గత వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.

అయినా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామ‌ని చెప్పారు.  లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకు ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. ఈ స‌మావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ పురాణం సతీష్,ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్. అధికారులు పాల్గొన్నారు. 

 

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   3 hours ago


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   4 hours ago


షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

   2 hours ago


తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

   5 hours ago


జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

   6 hours ago


అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

   7 hours ago


కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

   20 hours ago


కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

   a day ago


దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

   a day ago


Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   17-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle