newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

26-03-202026-03-2020 08:28:36 IST
2020-03-26T02:58:36.074Z26-03-2020 2020-03-26T02:56:17.068Z - - 08-04-2020

రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు తీవ్ర ప్రభావానికి లోనవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కరోనా కట్టడికి, రాష్ట్రములో లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్యాడి కొనుగోలుపై నిజామాబాద్ అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శరత్,పోలీస్ కమిషనర్ కార్తికేయ తో పాటు, జిల్లా వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలందరూ సామాజిక దూరంతో పాటు స్వీయనియంత్రణ పాటించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. 

మీ ఇళ్లలోనే ఉండడమే మీకు శ్రీ రామ రక్ష అన్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మూడు రకాల ప్లాన్ లు సిద్ధం చేసుకున్నామన్నారు. ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు 12 కిలోల బియ్యం,1500వందల నగదు ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలకు 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉండగా ఇప్పటివరకు 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పటికే అందుబాటులో ఉందన్నారు. 

నిత్యావసర వస్తువుల విషయంలో ప్రజలు సంయనం పాటించాలని,నిత్యావసర వస్తువుల సరుకుల కోసం 3వేల కోట్ల ప్యాకేజీని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. రేపటి నుండి బియ్యం, నగదు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసామన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి రాకుండా అన్ని బార్డర్లు సీజ్ చేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.కరోనా నివారణకు అధికారులు సమాయత్తం కావాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

అంతకుముందు మంత్రి ప్రశాంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో అమలవుతున్న కరోనా నివారణ, లాక్ డౌన్ చర్యలను సమీక్షించారు. కరోనా నివారణకు అధికారులు సమాయత్తం కావాలని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా విషయంలో కామారెడ్డి జిల్లా ప్లాన్1లో ఉన్నామని, సామాజిక దూరాన్ని, స్వీయనియంత్రణ పాటించాలన్నారు. గ్రామాల్లో కట్టడి చేయడంలో కామారెడ్డి ముందంజలో ఉందని, అధికారులు ఇదే స్ఫూర్తిలో ముందుకు సాగాలన్నారు. 

రెవెన్యూ, హెల్త్, పోలీస్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూం పనిచేస్తోందని, నిత్యావసర వస్తువుల విషయంలో ప్రజలు సంయమనం పాటించాలని ఎక్కువ ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయాలన్నారు. మరో 19 రోజుల పాటు అనవసరంగా బయటకు రావద్దని, నిత్యావసర వస్తువుల సరుకుల కోసం 3వేల కోట్ల ప్యాకేజీని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెల్ల రేషన్ కార్డుదారులకు రూ 1500 నగదుతో పాటు 12కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

కామారెడ్డి జిల్లాలో 8.70లక్షల మందికి 10వేల టన్నుల పంపిణీకి చర్యలు చేపట్టామని, గురువారం నుండి బియ్యం, నగదు పంపిణీ చేసేందుకు సమాయత్తం చేశామన్నారు. మార్చి1 నుండి  విదేశాల నుండి వచ్చిన వారిని 1070 మందిని గుర్తించామని, కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle