newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం *అసోం, మేఘాలయ, త్రిపురల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు *ఐదో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఉపాధి హామీ నిధుల విడుదల కోరుతూ..నేడు అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా*నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు*దిగివస్తున్న ఉల్లి ధరలు...కిలో ఉల్లి 70-80 లోపే అమ్మకాలు *అమరావతి: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్*హైదరాబాద్‌: బంజారాహిల్స్ ఎస్‌బీటీ నగర్‌లో రౌడీ షీటర్ హత్య... రౌడీ షీటర్‌ సయీద్ నూర్‌ను హత్య చేసిన నలుగురు వ్యక్తులు, బంజారాహిల్స్ పీఎస్‌లో లొంగుబాటు*తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోఉంటాయి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మృతదేహాలను భద్రపర్చాలి-సుప్రీంకోర్టు*కూల్చివేతలతో ప్రభుత్వాన్ని ప్రారంభించిన వైసీపీ.. అందరినీ కూల్చివేస్తోంది.. ఎంతోమంది కూలిపోయారు.. మీరెంత...? మీ 151 మంది ఎమ్మెల్యేలెంత?-పవన్*అసెంబ్లీలో మార్షల్ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

రేవంత్ సోనియాను కలిసింది అందుకేనా?

04-09-201904-09-2019 08:16:56 IST
Updated On 05-09-2019 15:53:01 ISTUpdated On 05-09-20192019-09-04T02:46:56.143Z04-09-2019 2019-09-04T02:40:18.618Z - 2019-09-05T10:23:01.427Z - 05-09-2019

రేవంత్ సోనియాను కలిసింది అందుకేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. విద్యుత్ ఒప్పందాలలో అవినీతి జరిగిందని సీబీఐ విచారణకు పట్టుబడుతున్న కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి వత్తిడి పెంచుతున్నారు. కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు.

తాజాగా ఆయన ఢిల్లీలో కుటుంబసమేతంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణలోని పార్టీ వ్యవహారాలపై సోనియాతో రేవంత్ చర్చించినట్లుగా సమాచారం. 

త్వరలో టీపీసీసీ నాయకత్వ మార్పు ఉంటుదని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో రేవంత్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాదు, టీపీసీసీ అధ్యక్షుడి రేసులో రేవంత్ పేరు కూడా వినిపిస్తున్నసమయంలో సోనియాను కలిసి తన విధేయత చూపించారని, తాజా పరిణామాలను చర్చించారని అంటున్నారు. 

అల్లుడు, కూతురు, భార్యతో కలిసి రేవంత్ రెడ్డి సోనియాను కలిసిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ పగ్గాలు ఎప్పుడు చేపట్టబోతున్నారంటూ రేవంత్ ను మీడియా ప్రశ్నిస్తోంది.

టీటీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోవడం, అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలవడం వరుస వరుసగా జరిగిపోయాయి. 

ఎంపీగా గెలిచాక ఆయన పార్టీ మారతారని వార్తలు గుప్పుమన్నాయి. కానీ, తనకు పార్టీ మారే ఆలోచన లేదంటూ పలుమార్లు క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి… గాంధీ కుటుంబానికి సన్నిహితంగా మారుతున్నారని రాష్ట్ర రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి పలుమార్లు ఆఫర్లు వచ్చినా రేవంత్ అటువైపు వెళ్లేందుకు ఇష్టపడలేదు. 

Revanth reddy family meets congress chief Sonia Gandhi

ప్రభుత్వంపై ధీటుగా పోరాడటం, మాస్ ఇమేజ్, కేసీఆర్ ని ఎదుర్కొనే సత్తా ఉండడంతో అధినాయకత్వం రేవంత్‌ వైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా పార్టీ మారిన రెండేళ్ళలోనే ఆయన  పీసీసీ ఛీప్ అయితే మాత్రం అది కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త అధ్యాయం అని చెప్పవచ్చు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే. మళ్ళీ అదే సామాజిక వర్గానికి సోనియా అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle