newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్ సోదరుడి కారుపైకి టిప్పర్ లారీ.. అనుమానాలెన్నో!

05-03-202005-03-2020 09:55:19 IST
2020-03-05T04:25:19.006Z05-03-2020 2020-03-05T04:25:15.978Z - - 14-04-2021

రేవంత్ సోదరుడి కారుపైకి టిప్పర్ లారీ.. అనుమానాలెన్నో!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కారుపైకి బుధవారం ఓ టిప్పర్ లారీ దూసుకెళ్లింది. అయితే డ్రైవర్ అప్రమత్తంతో తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారు. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ వెంటనే కారును తప్పించి రోడ్డు కిందకి తిప్పడంతో లారీ తిరుపతి రెడ్డి కారు వెనుక వచ్చే అనుచరుల కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతినగా అందులో ప్రయాణించే రేవంత్ రెడ్డి అనుచరులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఇది ప్రమాదంగానే కనిపిస్తున్నా దీని వెనుక రేవంత్ రెడ్డి కుటుంబం ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి తనకి సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వాన్ని, కోర్టులను కోరుతున్నారు. ఈమధ్యనే దీనిపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

అప్పట్లో 2009 ఎన్నికల సందర్భంగా తనపై దాడి జరగడంతో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 4+4 భద్రత కల్పించింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాన్ని 2+2కు తగ్గించారు. కాగా 2018 ఎన్నికల సమయంలో హైకోర్టు మరోసారి 4+4 భద్రత కల్పించాలని ఆదేశించడంతో తిరిగి ప్రభుత్వం మళ్ళీ భద్రత కల్పించింది. కానీ మళ్ళీ కొద్దీ కాలానికే తగ్గించి ప్రస్తుతం 2+2 భద్రత మాత్రేమే కలిగి ఉన్నారు.

అయితే, తాను ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న క్రమంలో ఇప్పటికే తనపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం తన హత్యకు కుట్రలు పన్నుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేస్తూ భద్రత కల్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈక్రమంలో రేవంత్ సోదరుడి కారు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా కుట్రలో భాగమేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా ఆరోపణలు మొదలుపెట్టింది.

2018 వరకు కొడంగల్ నియోజకవర్గంలో పేరుకి రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ వ్యవహారాలన్నీ ఆయన కుటుంబమే చూసుకొనేది. రేవంత్ రాష్ట్రస్థాయి నేతగా ఎదిగే క్రమంలో సొంత నియోజకవర్గ బాధ్యతలను తన ఇద్దరు తమ్ముళ్లకి అప్పగించి తాను హైదరాబాద్ లో యాక్టివ్ గా ఉండేవారు. ఇక ఇప్పుడు మల్కాజిగిరి ఎంపీ కావడంతో ప్రస్తుతం కూడా కొడంగల్ లో పార్టీ బాధ్యతలను తమ్ముళ్లే చూసుకుంటున్నారు.

నిజానికి టిప్పర్ లారీ రేవంత్ సోదరుడు కారుపై దూసుకొచ్చిన తుంకిమెట్ల నుంచి కోస్గి వెళ్లే మార్గంలో రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయి. కానీ లారీ కారుపైకి దూసుకురావడంతో ఇది కావాలని చేసిన కుట్రగా రేవంత్ అనుచరులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై విచారణ జరగాల్సిన అవసరంతో పాటు ఇకనైనా రేవంత్ కి భద్రత పెంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   3 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   4 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   7 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   10 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   5 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle