newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్ లాజిక్.. కొరడాతో కొట్టాల్సిన కేసీఆర్ పై పొగడ్తలేంటి?

29-02-202029-02-2020 13:50:15 IST
Updated On 29-02-2020 18:27:16 ISTUpdated On 29-02-20202020-02-29T08:20:15.411Z29-02-2020 2020-02-29T08:20:12.762Z - 2020-02-29T12:57:16.742Z - 29-02-2020

రేవంత్ లాజిక్.. కొరడాతో కొట్టాల్సిన కేసీఆర్ పై పొగడ్తలేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొన్న గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ రోడ్డుపై వెళ్తుండగా రోడ్డు పక్కన మహమ్మద్ సలీం అనే ఒక వ్యక్తి చేతిలో దరఖాస్తులతో నిస్సహ స్థాయిలో ఉన్నాడు. కాన్వాయ్ లో వెళ్తున్న సీఎం కేసీఆర్ ఆయనను గమనించి కారు ఆపి సలీం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, ఆయన పరిస్థితికి చలించిన సీఎం వరాల జల్లు కురిపించారు.

సలీంకి అక్కడిక్కడే పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, అయన కుమారుడికి అనారోగ్యం నయం అయ్యేవరకు సీఎంఆర్ఎఫ్ కింద ప్రభుత్వం ఖర్చులు.. ఇలా అన్నీ ఇచ్చేశారు. దీనిపై మీడియా మొత్తం కేసీఆర్ ను తెగ మోసేసింది. మరోసారి ఔదార్యం చాటుకున్న కేసీఆర్ అంటూ భజనలు కూడా చేసేశారు. ఆ పార్టీ నేతల ఆహా ఓహోలు సాధారణమే.

అయితే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం కొరడా దెబ్బలు కొట్టాల్సింది పోయి పొగడ్తలు ఏంటి? అటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్లందరికీ ఇల్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారని.. 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారని మరి ఆరేళ్ళ నుండి ఎందుకు ఇవ్వలేకపోయారని.. వాళ్లలో సలీం కూడా ఒకడే కాగా అని రేవంత్ ప్రశ్నించారు.

కేసీఆర్ మాట నిలబెట్టుకొని ఉంటే ఈనాడు సలీంకి రెండూ ఉండేవి కదా? చెప్పింది చేయనందుకు కొరడాతో కొట్టాలా? ఔదార్యం అంటూ భజనలు చేయాలా? మీడియా కూడా సోయ లేకుండా పొగడ్తలు చేయడం విడ్డురంగా ఉందన్నారు. సలీం రోడ్డుకి అడ్డొచ్చారని ఇచ్చిన సీఎం రాష్ట్రంలో అందరూ అలా కారుకి అడ్డొస్తేనే ఇస్తావా? అంటూ ప్రశ్నించారు.

రోడ్డుకి అడ్డొచ్చిన సలీం మాదిరే రాష్ట్రంలో అందరికీ పెన్షన్లు, ఇళ్లులేని వాళ్ళకి ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇస్తే కేసీఆర్ మొనగాడని రేవంత్ వెల్లడించారు. ఇక అసలు సలీంని కూడా ఆ పార్టీ వల్లే ముందుగానే రోడ్డు మీదకి పంపి డ్రామాలు ఆడారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే నాటకాలు ఆడడంతో కేసీఆర్, కేటీఆర్ పోటీపడతారన్నారు.

ఆ మధ్య కేటీఆర్ ఓ ముసలవ్వ దగ్గరకెళ్తే.. ఆమె మీ అయ్యొచ్చి ఏం చేయలే.. నువ్వొచ్చి ఏం చేస్తావ్ అని ప్రశ్నిస్తే.. మెచ్చుకుందని పత్రికలలో రాయించుకున్నారని.. అదే మాదిరి ఇప్పుడు కేసీఆర్ కూడా కేటీఆర్ బాటలోనే ఆరేళ్ళుగా చేయాల్సిన పనిని ఇప్పుడు అడ్డం తిరిగితే చేసి మళ్ళీ ఔదార్యం అని రాయించుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మరి టీఆర్ఎస్ శ్రేణులు స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle