newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

రేవంత్ రెడ్డి హ‌ర్ట్ అయిన‌ట్లున్నారే..!

03-10-201903-10-2019 09:02:40 IST
2019-10-03T03:32:40.802Z03-10-2019 2019-10-03T03:32:31.662Z - - 21-10-2020

రేవంత్ రెడ్డి హ‌ర్ట్ అయిన‌ట్లున్నారే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. త‌మ సిట్టింగ్ స్థానంలో తిరిగి విజ‌యం సాధించి టీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టాల‌ని భావిస్తోంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స్వంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం, ఆయ‌న భార్య‌నే అభ్య‌ర్థి కావ‌డంతో ఆయ‌న హుజూర్‌న‌గ‌ర్‌లోనే మ‌కాం వేసి ప్ర‌చారం చేస్తున్నారు.

ఇక‌, టీఆర్ఎస్ సైతం ఇక్క‌డ పాగా వేసుందుకు అన్ని శ‌క్తియుక్తుల‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్ణ‌యించింది. గ్రామానికి ఒక నేత‌ను బ‌య‌టి నుంచి పంపించింది ఆ పార్టీ. దీంతో కాంగ్రెస్ కూడా అప్ర‌మ‌త్త‌మైంది. రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రు కాంగ్రెస్ నేత‌లు ఈ ఎన్నిక‌ను త‌మ ఎన్నిక‌గా భావిస్తున్నారు. నామినేష‌న్ వేసిన అనంత‌రం కాంగ్రెస్ పార్టీ హుజూర్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది.

ఈ స‌భ‌కు తెలంగాణ కాంగ్రెస్‌లోని ముఖ్య‌నేత‌లంతా హాజ‌ర‌య్యారు. పీసీసీ ప‌ద‌విపై క‌న్నేసిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, శ్రీధ‌ర్ బాబు వంటి నేత‌ల‌తో పాటు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, జానారెడ్డి, మ‌హిళా నేత‌లు కొండా సురేఖ‌, సీత‌క్క వంటి వారంతా ఇత‌ర జిల్లాల నుంచి హుజూర్‌న‌గ‌ర్ వ‌చ్చి ప్ర‌చారం నిర్వ‌హించారు. అయితే, తెలంగాణ కాంగ్రెస్ కొంత క్రేజ్ ఉన్న నేత‌గా గుర్తింపు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ఇంత‌వ‌ర‌కూ హుజూర్‌న‌గ‌ర్‌లో క‌నిపించ‌లేదు.

ఇక్క‌డ అభ్య‌ర్థి విష‌యంలో ఉత్త‌మ్‌తో ఏర్ప‌డిన విభేదాలే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇక్క‌డి నుంచి ప‌ద్మావ‌తి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని తెలిసినా రేవంత్ రెడ్డి మ‌రో నేత పేరును ప్ర‌తిపాదించారు.

దీంతో రేవంత్ రెడ్డి ఒక్క‌రు ఒక వైపు, మిగ‌తా నేత‌లంతా ఒక వైపు అన్న‌ట్లుగా కాంగ్రెస్‌లో ప‌రిస్థితి మారిపోయింది. అయితే, అంత‌కుముందు త‌న‌కు నోటి దాకా వ‌చ్చిన పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని ఉత్త‌మ్ దూరం చేశార‌నే కోపంతోనే ఈ టిక్కెట్‌ను అడ్డుకునేందుకు రేవంత్ ప్ర‌య‌త్నించార‌నే టాక్ కాంగ్రెస్ వ‌ర్గాల్లో న‌డుస్తోంది.

దీంతో ఉత్త‌మ్‌, రేవంత్ మ‌ధ్య విభేదాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. సాధార‌ణ ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌మంతా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేసిన రేవంత్ రెడ్డి పార్టీకి అత్యంత కీల‌క‌మైన హుజూర్‌న‌గ‌ర్‌ను మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల కాంగ్రెస్ శ్రేణులు సైతం పెద‌వి విరుస్తున్నారు.

పీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా ఉన్న ఆయ‌న కూడా ఈ బాధ్య‌త‌ను తీసుకొని వ‌చ్చి ప్ర‌చారం చేస్తే బాగుంటుంద‌ని ఆశిస్తున్నారు. మ‌రి, రేవంత్ రెడ్డి ఆలోచ‌న ఏంటో చూడాలి.

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

   7 hours ago


గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

   8 hours ago


కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

   11 hours ago


విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

   11 hours ago


అన్ని పరీక్షలు వాయిదా..!

అన్ని పరీక్షలు వాయిదా..!

   12 hours ago


తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

   12 hours ago


లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

   13 hours ago


కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

   13 hours ago


లంకాదినకర్ సస్పెన్షన్ తో బీజేపీ ఇస్తున్న సంకేతాలేంటి..?

లంకాదినకర్ సస్పెన్షన్ తో బీజేపీ ఇస్తున్న సంకేతాలేంటి..?

   13 hours ago


విజయ్‌ సేతుపతి కుమార్తెనూ రేప్ చేస్తారంట.. మండిపడ్డ కనిమొళి

విజయ్‌ సేతుపతి కుమార్తెనూ రేప్ చేస్తారంట.. మండిపడ్డ కనిమొళి

   13 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle