రేవంత్ రెడ్డి విడుదల.. ఆయన అభిమానుల అరెస్ట్!
10-03-202010-03-2020 11:30:30 IST
Updated On 10-03-2020 12:06:16 ISTUpdated On 10-03-20202020-03-10T06:00:30.546Z10-03-2020 2020-03-10T06:00:26.989Z - 2020-03-10T06:36:16.723Z - 10-03-2020

టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ పొజిషన్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు.. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాలను ఎగరవేసిన కేసులో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్న రేవంత్ రెడ్డి మంగళ వారం విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రేవంత్ తో పాటు ఈ కేసులో ఉన్నవాళ్లందరికీ ఇప్పటికే బెయిల్ దక్కడం.. కేసులు కూడా అన్నీ బెయిలబుల్ కేసులే కావడంతో దాదాపుగా మంగళవారం మధ్యాహ్నం తర్వాత ఆయన విడుదల ఖరారైనట్టుగా కనిపిస్తుంది. అయితే రేవంత్ విడుదల ఒకవైపు జరుగుతుంటే మరోవైపు అయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్టులు చేయడం విశేషం. అసలే ప్రభుత్వం మీద రేవంత్ పోరాటంగా కనిపిస్తున్న ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎలా ఉన్నా పార్టీ శ్రేణులలో మాత్రం రేవంత్ పై అభిమానం పెరిగినట్లుగా కనిపిస్తుంది. అందుకు కారణం కూడా.. రేవంత్ అరెస్ట్ పై ముందుగా స్పందించింది ఆ శ్రేణులే. ఇప్పుడు కూడా రేవంత్ జైలు నుండి విడుదల సమయంలో కూడా శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. రేవంత్ చర్లపల్లి జైలు నుండి విడుదల సమయంలో అభిమానులు, శ్రేణులు భారీగా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అందుకు అనుమతిస్తే అది కేసీఆర్ సర్కార్ ఎలా అవుతుంది? రేవంత్ స్వాగత ఏర్పాట్లకు అనుమతులు ఇవ్వలేదు కదా ఏకంగా చర్లపల్లి జైలు పరిసర ప్రాంతాలలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ 144 సెక్షన్ విధించేశారు. ఇక రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ లో పరిస్థితి అయితే మరీ విచిత్రంగా ఉందట. మంగళవారం రేవంత్ విడుదల కానున్నారని సోమవారం కాంగ్రెస్ వర్గాలకి తెలియడంతో కొడంగల్ నుండి భారీగా అభిమానులు చర్లపల్లికి సిద్ధమయ్యారు. దీంతో సోమవారం సాయంత్రం నుండే పోలీసులు ఎక్కడిక్కడ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారట. రేవంత్ అనుచరులుగా పేరున్న అందరినీ సోమవారం సాయంత్రం అరెస్టులు చేసి జైలుకి తరలించారట. అయితే ఇలాంటి నిర్బంధాలు ఎన్నో చూశామని.. అరెస్టులకు ఎప్పుడూ సిద్దమే అంటూ రేవంత్ స్వాగతానికి మాత్రం భారీగా పార్టీ శ్రేణులు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. అందుకు కాంగ్రెస్ నేతలు కూడా పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకొనే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు కారణం అధికార పక్షం ఎప్పటికప్పుడు వ్యూహాలతో ప్రతిపక్షాలకు కునుకులేకుండా చేస్తుంటే పార్టీలోని అంతర్గత కలహాలు.. పదవుల కోసం కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీ నేతలే ఆ పార్టీని పుంజుకునే అవకాశం లేకుండా చేసుకుంటున్నారన్నది రాజకీయ పరిశీలకుల మాట. రేవంత్ రెడ్డి విషయంలో కూడా అదే జరుగుతుంది. అరెస్టులను అక్రమ అరెస్టులుగా పేర్కొంటూ పార్టీ శ్రేణులు దిష్టిబొమ్మల దహనం నుండి ఆందోళనలు నిరసనలు తెలిపారు. ఆ పార్టీ నేతలలో కొందరు స్టేట్మెంట్స్ రూపంలో ఖండిస్తే మరికొందరు మరోసారి ఫామ్ హౌస్ దగ్గరకెళ్ళి ధర్నాకి ప్రయత్నించారు. కానీ కొందరైతే అసలు అది రేవంత్ వ్యక్తిగతంగానే మాట్లాడడం విశేషం. మరి ఇప్పుడు రేవంత్ విడుదలకు స్వాగతానికి కూడా ముందుగా పార్టీ శ్రేణులే స్పందించడంతో పార్టీ నేతలు కూడా అందుకు సిద్ధపడినట్లుగా తెలుస్తుంది. మరి ఈ మొత్తం ఎపిసోడ్ ను రేవంత్ వ్యక్తిగతంగా పేర్కొన్న ఆ సో కాల్డ్ నేతలు ఈ స్వాగత ఏర్పాట్లపై ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 minutes ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
3 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
4 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
7 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
7 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
8 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
6 hours ago

నా రూటే సెపరేటు
10 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago
ఇంకా