newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్ రెడ్డి జైల్లో ఉండగానే పీసీసీ చీఫ్ ప్రకటన?

13-03-202013-03-2020 16:02:30 IST
Updated On 13-03-2020 16:11:30 ISTUpdated On 13-03-20202020-03-13T10:32:30.652Z13-03-2020 2020-03-13T10:32:08.625Z - 2020-03-13T10:41:30.497Z - 13-03-2020

రేవంత్ రెడ్డి జైల్లో ఉండగానే పీసీసీ చీఫ్ ప్రకటన?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అయన జైల్లో ఉండగానే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఆయనకేనని ప్రకటించే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఈమేరకు ఢిల్లీలో అధిష్టానం నిర్ణయం కూడా దాదాపుగా ఖరారైందని.. పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రకటన మాత్రమే మిగిలి ఉందంటున్నారు.

మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరేసిన కేసులో రేవంత్ రెడ్డికు 14 రిమాండ్ విధించగా ప్రస్తుతం అయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఒకసారి కూకట్ పల్లి కోర్టు అయన బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించగా గురువారం వనస్థలిపురం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారు. అయితే, హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణకు స్వీకరించి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

మరోవైపు రేవంత్ రెడ్డి సొంతపార్టీలో కొందరు సీనియర్ నేతలు రేవంత్ డ్రోన్ కేసును ఆయన సొంత వ్యవహారం మాత్రమేనని ప్రకటనలు చేయడం విశేషం కాగా పార్టీ ప్రస్తుతం చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మొక్కుబడిగా ఖండిస్తూ ఒక ప్రకటనను మాత్రమే విడుదల చేశారు. మిగతా పార్టీ సీనియర్లలో వీహెచ్, జగ్గారెడ్డి, కోటమిరెడ్డి వంటి నేతలు ఏ మాత్రం రేవంత్ వ్యవహారాన్ని పార్టీదిగా అంగీకరించడం లేదు.

ఈ నేపథ్యంలో అయనకు హైకోర్టులో అయినా ఊరట లభిస్తుందా? లేదా? అని అయన అభిమానులు పార్టీ కార్యకర్తలలో ఆందోళన నెలకొంది. అయితే, ఢిల్లీలో అధిష్టానం ఇదే సమయంలో పార్టీ చీఫ్ ఎన్నికపై కసరత్తులు మొదలుపెట్టినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఒకపక్క కర్ణాటకలో పరిస్థితులు తారుమారు కావడం ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ ను అధ్యక్షుడిగా ప్రకటించేసింది.

ఇదే సమయంలో తెలంగాణలో కూడా కొత్త అధ్యక్షుడి ఎన్నికను కూడా పూర్తి చేయాలని భావించింది. కర్ణాటకలో డీకే బీజేపీ కేసులకు ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా రాష్ట్రంలో కమలానికి ధీటుగా పోరాడుతున్నారు. తెలంగాణలో అదే రీతిలో రేవంత్ రెడ్డి ఒక్కరే అధికార టీఆర్ఎస్ పార్టీకు కంట్లో నలుసుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ అండ్ కో పై రేవంత్ పోరాటం వ్యక్తిగతమా అనిపించేలా వీరి పోరాటం కనిపిస్తుంది.

మరోవైపు తెలంగాణలో బీజేపీ కూడా తాజాగా నూతన అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ ను నియమించింది. దీంతో కాంగ్రెస్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొత్త చీఫ్ ప్రకటనను ప్రకటనకు సిద్ధమైంది. కాగా, కర్ణాటకలో మాదిరి తెలంగాణలో దూకుడుగా కనిపించే రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించనున్నట్లుగా అధిష్టానం సిద్దమైనట్లుగా తెలుస్తుంది. పార్టీలో ఆవరించిన నిస్తేదాన్ని వదిలించి జవసత్వాలు నింపే వ్యక్తికి పట్టం కట్టాలని చూస్తుంది.

ఇందులో భాగంగానే ఆ పదవి ఆశించే వారితో గురువారం అధిష్టానం నేతలు సంప్రదింపులు జరిపినట్లుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే పదవిని ఆశించే అందరి రిపోర్టులను తెప్పించుకున్న సోనియా గురువారం సీనియర్ నేత కోమటి రెడ్డితో భేటీయై రాష్ట్రంలో పరిస్థితిలపై చర్చించినట్లుగా తెలుస్తుంది. పదవిని ఆశించే వారిని సముదాయించి ప్రకటన చేసేందుకే ఆలస్యం అవుతుందంటుండగా మరో రెండు, మూడు రోజులలో ప్రకటన వెలువడం ఖాయంగా కనిపిస్తుంది.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle