newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

రేవంత్ రెడ్డి ఇరుక్కున్నారా? ఇరికించారా?

27-02-202027-02-2020 14:06:25 IST
2020-02-27T08:36:25.454Z27-02-2020 2020-02-27T08:36:23.016Z - - 20-10-2020

రేవంత్ రెడ్డి ఇరుక్కున్నారా? ఇరికించారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత మూడు రోజులుగా తెలంగాణ రాజకీయాలలో నానుతున్న వ్యవహారాలలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి భూదందా వ్యవాహారం అనేది కూడా ఒకటి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్‌ 127లో 10.21 ఎకరాల పట్టా భూమి ఉండగా, అందులో 6 ఎకరాల 7 గుంటల భూమిని రేవంత్‌ రెడ్డి కాజేశారన్నది ఆయనపై వస్తున్న ఆరోపణ.

రేవంత్ ఆయన సోదరుడు కొండల్ రెడ్డితో కలసి తప్పుడు పత్రాలతో అత్యంత ఖరీదైన భూమిని తమ పేరిట మ్యుటేషన్‌ చేయించుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ విచారణలో తేలింది. రేవంత్‌రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ.. అనిల్‌ కుమార్‌ అనే వ్యక్తి 2015లో రంగారెడ్డి సివిల్‌ కోర్టులో.. కొల్లా అరుణ 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్లన్నీ ఇప్పుడు విచారణకు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఈ మేరకు సీఎస్‌కు నివేదిక సమర్పించారు. తప్పుడు పత్రాలతో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూమిని నొక్కేశారని తేలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ మ్యుటేషన్‌ చేసిన అప్పటి డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే, బుధవారం దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వం తనపై టార్గెట్ చేసి చేస్తుందని ఆరోపించారు. తప్పుడు పత్రాలతో చేసానని తేలిందని ప్రభుత్వం చెప్తున్న ఆ భూమి రిజిస్ట్రేషన్ జరిగిన సమయానికి తనకు ఆరు సంవత్సరాల వయసని రేవంత్ చెప్పడం విశేషం.

ఇలాంటి బెదిరింపులకు.. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే రకం తాను కాదని రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఒకపక్క ప్రభుత్వం మొదలుపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి కౌంటర్ గా రేవంత్ పట్నం గోస కార్యక్రమం మొదలుపెట్టారు. గత రెండు రోజులుగా తన పార్లమెంట్ నియోజకవర్గంలో రేవంత్ బస్తీ బాట పట్టారు.

మరోపక్క తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి మార్పు జరగనుండగా రేవంత్ రెడ్డిని అది వరించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈక్రమంలో ఎప్పటివో కేసులు ఇప్పుడు తెరపైకి తేవడం ఆసక్తిగా మారింది. ఒకపక్క అధికార పార్టీ.. మరోపక్క సొంత పార్టీ కలిసి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుందని అయన అభిమానుల వాదన. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

 

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

   9 hours ago


వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

   13 hours ago


అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

   15 hours ago


టీడీపీ కొత్త టీమ్

టీడీపీ కొత్త టీమ్

   16 hours ago


తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

   16 hours ago


కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

   17 hours ago


మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

   18 hours ago


బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

   18 hours ago


పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

   19 hours ago


ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle