newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్ రెడ్డి అరెస్ట్.. సైలెంట్ మోడ్లో ఆ చానెల్స్!

03-03-202003-03-2020 12:54:23 IST
2020-03-03T07:24:23.231Z03-03-2020 2020-03-03T07:24:16.463Z - - 15-04-2021

రేవంత్ రెడ్డి అరెస్ట్.. సైలెంట్ మోడ్లో ఆ చానెల్స్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణ రాజకీయాలలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా అలజడి రేగింది. కాంగ్రెస్‌ ఎంపీలు రేవంత్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం రోజులుగా ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి కౌంటర్ గా పట్నం గోస పేరుతో బస్తీలలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో గతంలో రేవంత్ రెడ్డిపై నమోదైన ఓ భూకబ్జా కేసు తెరమీదకి వచ్చింది.

దానికి రేవంత్ కూడా గట్టిగానే సమాధానమిచ్చారు. భూకబ్జా కేసును, రెవెన్యూ అధికారుల సస్పెండ్ విషయాన్ని మీడియా హైలెట్ చేసి ప్రసారం చేసింది. అదే మీడియాని రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కి పిలిచి ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా అదిరేది, బెదిరేది లేదని.. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలపై పేగులు తెగేవరకు పోరాటం చేస్తానని చెప్పారు. అప్పుడే సోమవారం ఓ బండారం బయటపెడతానని హింట్ ఇచ్చారు.

చెప్పినట్లే సోమవారం రేవంత్ రెడ్డి మరో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని మరికొందరు నేతలను వెంటపెట్టుకొని జన్వాడ అనే గ్రామానికి తీసుకెళ్లారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో ఉన్న ఈ గ్రామం పరిధిలో మంత్రి కేటీఆర్‌ అక్రమంగా ఫామ్‌హౌస్‌ నిర్మించారని ఆరోపించిన ఎంపీలు ఫామ్‌హౌస్‌ ముట్టడికి ప్రయత్నించారు. అయితే అప్పటికే ఫామ్‌హౌస్‌ను పోలీసులు చుట్టుముట్టి ఉండడంతో నేతలను అరెస్ట్ చేసి తరలించారు.

అధికార-ప్రతిపక్ష ఈ నాటకీయ పరిణామాలతో జన్వాడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అసలు ఫామ్‌హౌస్ కట్టుకోవడం తప్పేమి కాదు కదా.. ఎంపీల ముట్టడి ఎందుకు.. అరెస్టులు ఎందుకు అంటే.. జన్వాడ గ్రామం జీవో నెం 111 పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ దాహార్తి తీర్చే జంట జలాశయాలకు ఇదే మార్గం నుండి నీరు చేరుతుంది.

అందుకే ఈ మార్గం పరిధిలోని గ్రామాల్లో శాశ్వత నిర్మాణాలపై గతంలో సుప్రీంకోర్టు  తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ జీవో నెం 111 విడుదల చేశారు. మరి సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘిస్తూ మినిస్టర్ కేటీఆర్ ఫామ్‌హౌస్ ఎలా కట్టారన్నది ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్న. రాజావారు బంగ్లా కడితే అధికారులు ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు.

తండ్రి ఒక చోట.. కొడుకు ఒకచోట ఇలా ఇష్టం వచ్చినట్లుగా నిబంధనలను తుంగలోతొక్కి భవంతులు కట్టుకున్నారని రేవంత్ విమర్శలకు దిగారు. అయితే, రేవంత్ రెడ్డి భూకబ్జా అంటూ వారం రోజులుగా గంటల తరబడి ప్రసారాలు చేసిన చానెల్స్ సోమవారం రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడిపై మాత్రం ఒక్క ముక్క ప్రసారం చేయలేదు.

ఎలాగూ అధికార పార్టీకి చెందిన చానెల్ లో ఇది ప్రసారం అవడం కలగానే భావించాల్సి ఉండగా మిగతా చానెల్స్ లో ఎక్కువ భాగం ఇద్దరు వ్యాపార దిగ్గజాల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అవి కూడా ఈ ముట్టడిని ప్రసారం చేసే సాహసం చేయలేదు. అయితే, జన్వాడ ముట్టడిని ప్రసారం చేయని చానెల్స్ కూడా అన్ని యాంగిల్స్ లో షూట్ చేసి పెట్టుకోవడం విశేషం.

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   19 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle