newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్ రెడ్డికి కొండంత అండగా అధిష్టానం!

14-03-202014-03-2020 07:30:57 IST
Updated On 14-03-2020 11:02:15 ISTUpdated On 14-03-20202020-03-14T02:00:57.271Z14-03-2020 2020-03-14T02:00:51.869Z - 2020-03-14T05:32:15.818Z - 14-03-2020

రేవంత్ రెడ్డికి కొండంత అండగా అధిష్టానం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాలను ఎగరవేసి చిత్రీకరణ చేశారని ప్రభుత్వ పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విడిచారు. కాగా, ఇప్పటికే రెండుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా పోలీసులు పలు మలుపులు తిప్పుతూ బెయిల్ దక్కకుండా చేస్తున్నారు.

గతంలో ఎన్నికల సమయంలో కేసులతో పాటు పాత కేసులను తిరగదోడి పీటీ వారెంట్ కావాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని కోరడం విశేషం కాగా శుక్రవారం హైకోర్టులో ఏకంగా ఈ కేసులు మూడు పిటిషన్లు దాఖలు చేశారు. పెద్ద పెద్ద నేరాలు చేసినా బెయిల్ దక్కే ఈ రోజుల్లో నిబంధనలను అతిక్రమించిన కేసులో కనీసం బెయిల్ కూడా రాకుండా చేయడం ప్రభుత్వం, పోలీసులు కలిసి అదే గేమ్ గానే పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా.. ఈ కేసు శుక్రవారానికి ఢిల్లీకి చేరింది. గురువారం పార్టీ అధినేత సోనియా గాంధీ తెలంగాణ సీఎం కోమటిరెడ్డితో భేటీ కావడంతోనే రాష్ట్రంలో విషయాలపై ఒక అవగాహనకు వచ్చిన అధిష్టానం జైల్లో ఉన్న రేవంత్ రెడ్డికి కొండత అండగా నిలబడుతున్నట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో సీనియర్ నేతల నుండి అండ కోరవైనా ఢిల్లీ నుండి ఆ లోటు భర్తీ అవుతున్నట్లుగా పార్టీ వర్గాలలో వినిపిస్తుంది.

ఓవైపు పార్లమెంట్‌లో ఈ అంశాన్ని వెంటనే చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చిన పార్టీ మరోవైపు పార్టీ తరుఫున న్యాయసహాయం అందించేందుకు కూడా సిద్ధమైంది. ఇందులో భాగంగా అధినాయకత్వం సల్మాన్‌ ఖుర్షీద్‌ సహా 5గురు సీనియర్‌ లాయర్ల ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌ పంపింది. శుక్రవారం సాయంత్రం హైకోర్టులో బెయిల్ పిటిషన్ సహా మరికొన్ని కేసులపై కూడా వాదనలు జరగగా ఈ లాయర్ల బృందం రేవంత్ తరపున వాదనలు వినిపించారు.

ముందుగా ఈ కేసులో పిటిషన్లపై విచారణ ప్రారంభించిన హైకోర్టు ప్రభుత్వ వాదనలు విన్నది. అయితే ప్రభుత్వ లాయర్లు ఈ కేసులో చాలా విషయాలు ఉన్నాయని సమగ్రంగా తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని కోర్టుకి చెప్పారు. దీనికి రేవంత్ లాయర్ల బృందం ఈ కేసు నిరూపితమైతేనే నెల రోజుల శిక్ష మాత్రమే విధిస్తారని.. అలాంటిది 14 రిమాండ్ విధిస్తే మరో రెండు వారాలు శిక్ష విధిస్తే సరిపోతుందని వాదనలు వినిపించారు.

ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ ఆరోజు తమ పూర్తిస్థాయి వాదనలు వినిపించాలని ప్రభుత్వ లాయర్లకు ఆదేశించింది. మొత్తంగా రేవంత్ మంగళవారం వరకు చర్లపల్లిలో జైల్లోనే ఉండడం ఖాయం కాగా.. ప్రభుత్వం బెయిల్ దక్కకుండా చేసేందుకు ఎత్తులు వేసినట్లుగా అర్ధమైంది. ఢిల్లీ లాయర్ల బృందం టేకోవర్ తో కేసు కొంత ముందంజ వేసినట్లుగా న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరోవైపు తెలంగాణ పార్టీ వ్యవహారాలను చూస్తున్న కుంతియా కూడా ఆ పార్టీ నేతలకు ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడవద్దని హెచ్చరికలు జారీచేశారు. అసలే పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మీడియా వద్ద ఎవరికి వారు అభిప్రాయాలు చెప్పడం ఆపేయాలని తెలిపారు. ఏదైనా లేఖల ద్వారా లేక తమ ద్వారా అధిష్టానంకు తెలపవచ్చని బహిరంగంగా మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. మొత్తంగా రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం కొండత అండగా నిలవనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   12 minutes ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   39 minutes ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   3 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   2 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   18 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   a day ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle