newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్ చుట్టూ విమర్శల ముసురు.. జగ్గారెడ్డి, వీహెచ్ ఫైర్

13-03-202013-03-2020 09:04:58 IST
Updated On 13-03-2020 15:15:18 ISTUpdated On 13-03-20202020-03-13T03:34:58.836Z13-03-2020 2020-03-13T03:34:54.909Z - 2020-03-13T09:45:18.799Z - 13-03-2020

రేవంత్ చుట్టూ విమర్శల ముసురు.. జగ్గారెడ్డి, వీహెచ్ ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్లు టార్గెట్ చేశారా? అంటే అవుననే అంటున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి అయితే ఏకంగా రేవంత్ రెడ్డిపై విమర్శల దాడి చేస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇది ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఫేస్‌బుక్‌లో ఆయన అతిగా ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆయనే సీఎం, ఆయనే పీసీసీ చీఫ్ అయినట్లు అనుచరులు అతిగా పోస్టులు పెడుతున్నారని విమర్శించారు.

ఈ తమాషాలు, పిల్లల పరాచకాలు తక్షణమే మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదన్నారు. రేవంత్ రెడ్డిపై వీహెచ్ తదితర నేతలు ఇప్పటికే ఘాటు విమర్శలు చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక వేళ తెలంగాణ కాంగ్రెస్‌‌లో విభేదాలు ఈ విధంగా వెల్లడవుతున్నాయి. నేతలు వర్గాలుగా విడిపోయి ఆరోపణలు చేసుకుంటున్నారు.. కాంగ్రెస్ సీనియర్లంతా ఏకమయి రేవంత్ పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ వ్యవహారంపై పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఫిర్యాదుచేస్తానన్నారు జగ్గారెడ్డి.

కాంగ్రెస్ పార్టీలో అందరికీ ముఖ్యమంత్రి కావాలని ఉంటుందని జగ్గారెడ్డి అంటున్నారు. కానీ దానిని నిర్ణయించేది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. ‘తమాషాలు బంజేయిండ్రి మీరంతా.. ఈ పులులు, సింహాలు అనే ప్రచారం ఆపండి. మావోళ్లు కూడా నన్ను పులి, పులీ అనేటోళ్లు.. పులి పాడుగాను.. 2 వేల ఓట్లతోని గెలిచిన. పులులు, సింహాలు 2 వేల ఓట్లతోని గెలుస్తయా ఎక్కడన్నా. ఫీల్డ్‌ల చుక్కలు చూస్తున్నం. పైసలేనిది రాజకీయం నడవదు. ఈ న్యూసెన్స్ ఏంది?’ అని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. నీవేం తీస్మార్ ఖాన్ వి కాదని గుర్తుంచుకో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. 

రేవంత్ అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని.. పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన సొంత ఎజెండా కోసం నాటకాలు ఆడుతున్నారని మరో నేత వి హనుమంతరావు మండిపడ్డ సంగతి తెలిసిందే.  కేటీఆర్ ఫాంహౌస్‌పైకి డ్రోన్ కెమెరా పంపించిన కేసులో రేవంత్ రెడ్డి విచారణ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేతలు కొంత మంది ఆయనపై విమర్శలకు ఎక్కుపెట్టారు. టీపీసీసీ కుర్చీ కోసమే ఇదంతా జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle