newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

రేవంత్ కొత్త డిమాండ్ వెనుక పాత సీన్ ఉందా..?

09-12-201909-12-2019 07:20:52 IST
2019-12-09T01:50:52.739Z09-12-2019 2019-12-09T01:50:32.727Z - - 22-02-2020

రేవంత్ కొత్త డిమాండ్ వెనుక పాత సీన్ ఉందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు స‌భ్యుడు రేవంత్ రెడ్డి కొత్త డిమాండ్‌ను వినిపిస్తున్నారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో ఆంగ్లో ఇండియ‌న్స్‌కు ఉన్న రిజ‌ర్వేష‌న్‌ను తీసేయాల‌ని, వీరి స్థానంలో థ‌ర్డ్ జెండ‌ర్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి ప్ర‌ధాన న‌రేంద్ర మోడీని కోరారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న పార్ల‌మెంటులోనూ లేవ‌నెత్త‌నున్నారు. స‌మాజంలో గుర్తింపు లేని థ‌ర్డ్ జెండ‌ర్ల‌కు చ‌ట్ట‌సభ‌ల్లో ప్రాతిన‌థ్యం క‌ల్పించి వారిని గౌర‌వించాల‌ని రేవంత్ రెడ్డి కోరుతున్నారు.

బ్రిటీష‌ర్లు భార‌త‌దేశాన్ని పాలించిన స‌మ‌యంలో ఇంగ్లాండ్ నుంచి వ‌చ్చి భార‌తీయుల‌ను వివాహం చేసుకుని కొంద‌రు ఇక్క‌డే స్థిర‌ప‌డిపోయారు. వీరిని ఆంగ్లో ఇండియ‌న్లుగా పిలుస్తారు.

ఒక ప్రాంతం, రాష్ట్రం అని కాకుండా వీరు అనేక ప్రాంతాల్లో శాశ్వ‌త నివాసులు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో ఆంగ్లో ఇండియ‌న్ అసోసియేష‌న్ త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హించేందుకు చ‌ట్ట‌స‌భ‌ల్లో వారికి అవ‌కాశం క‌ల్పించారు.

ఎన్నిక‌లు పెట్ట‌కుండా నేరుగా వీరిని నామినేట్ చేసే అవ‌కాశం క‌ల్పించారు. ఇలా లోక్‌స‌భ‌కు ఇద్ద‌రు, అసెంబ్లీకి ఒక‌రు చొప్పున ఆంగ్లో ఇండియ‌న్ల‌ను నామినేట్ చేస్తారు. వీరికి సాధార‌ణ స‌భ్యుల‌కు ఉన్నట్లుగానే హ‌క్కులు, స‌ధుపాయాలు ఉంటాయి.

స్వాతంత్య్రం వ‌చ్చి 70 ఏళ్లు అవుతున్నా ఇంకా ఆంగ్లో ఇండియ‌న్ స‌మాజం నుంచి చ‌ట్ట‌స‌భ‌ల‌కు నామినేట్ చేసే సంప్ర‌దాయం కొన‌సాగుతోంది. ఇప్పుడు వీరి స్థానంలో థ‌ర్డ్ జెండ‌ర్ల‌కు ఈ అవ‌కాశం ఇవ్వాల‌నేది రేవంత్ రెడ్డి డిమాండ్‌.

ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల‌ను మ‌రో 10 సంవ‌త్స‌రాలు పొడిగిస్తూ ఈ పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో ఆంగ్లో ఇండియ‌న్ రిజ‌ర్వేష‌న్ల‌ను తొల‌గించి వారి స్థానంలో థ‌ర్డ్ జెండ‌ర్ల‌కు క‌ల్పించాల‌ని రేవంత్ రెడ్డి కోరుతున్నారు. వాస్త‌వానికి థర్డ్ జెండర్ల‌కు వారి స‌మ‌స్య‌లు వినిపించుకునేందుకు చ‌ట్ట‌స‌భ‌ల్లో అవ‌కాశం క‌ల్పించాల‌ని కోర‌డం న్యాయ‌మైన డిమాండే.

అయితే, ఆంగ్లో ఇండియ‌న్ల‌ను తొల‌గించి వారి స్థానంలో థ‌ర్డ్ జెండర్ల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోర‌డం వెనుక కార‌ణాలేంటి అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆంగ్లో ఇండియ‌న్ ఎమ్మెల్యే వ్య‌వ‌హారంలో రేవంత్ రెడ్డికి ఓ చేదు అనుభవం ఉన్న విష‌యం తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీలో ఆంగ్లో ఇండియ‌న్ కోటాలో ఉన్న ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌ను రేవంత్ రెడ్డి క‌లిశార‌ని, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి ఓటు వేసేందుకు డ‌బ్బులు ఆఫ‌ర్ చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్న సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించి బ‌య‌ట‌కు వ‌చ్చిన వీడియోలు రేవంత్ రెడ్డి రాజ‌కీయ జీవితానికి మ‌చ్చ‌గా మారాయి. ఆయ‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌ను కూడా ఈ వీడియోలే అడ్డుకున్నాయ‌ని చెప్పొచ్చు. ఈ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి ఆంగ్లో ఇండియ‌న్స్‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు తొల‌గించాల‌నే డిమాండ్‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి, కార‌ణ‌మేంటో రేవంత్ రెడ్డికే ఎరుక‌.

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle