newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

రేవంత్ అరెస్ట్... ప్రగతిభవన్ ముట్టడికి యత్నం

21-10-201921-10-2019 12:56:25 IST
Updated On 21-10-2019 17:06:07 ISTUpdated On 21-10-20192019-10-21T07:26:25.980Z21-10-2019 2019-10-21T07:26:22.243Z - 2019-10-21T11:36:07.757Z - 21-10-2019

రేవంత్ అరెస్ట్... ప్రగతిభవన్ ముట్టడికి యత్నం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుండి ప్రగతిభవన్‌ కు విడతల వారీగా వస్తున్న కాంగ్రెస్ నేతలు ముట్టడికి ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడిక్కడ అరెస్టులు చేశారు. తెలంగాణా ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ‘ఛలో ప్రగతి భవన్‌’  ఉద్రిక్తంగా మారింది. 

సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ నేతలు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, విక్రం గౌడ్‌, రాములు నాయక్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. 

తెలంగాణవ్యాప్తంగా ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌లతో, ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురి నేతలను పోలీసులు గృహ నిర‍్బంధం చేశారు. మల్‌రెడ్డి రంగారెడ్డి నివాసాన్ని కూడా పోలీసులు చుట్టుముట్టడంతో ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రగతి భవన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించి, గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ప్రగతి భవన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి, గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. మరోవైపు ఛలో ప్రగతి భవన్‌ ముట్టడికి వచ్చిన ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబుని, దోమలగూడలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేశారు.

సంగారెడ్డి జిన్నారం మండల కాంగ్రెస్ నాయకులు ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరగా, వారిని పోలీసులు మార్గమధ్యంలోని అడ్డుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పలువురు కాంగ్రెస్ నాయకులకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇటు ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో బేగంపేట మెట్రోరైల్వే స్టేషన్ ని అధికారులు మూసివేశారు. ప్రగతిభవన్ ప్రాంతంలో రెండుగంటల నుంచి ట్రాఫిక్ జాం కొనసాగుతోంది. ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   3 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   4 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle